సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు రెచ్చిపోయారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై దాష్టీకం ప్రదర్శించారు. సెటిల్‌మెంట్ వివాదంలో మహిళపై జనసేన నేతలు దాడి చేశారు. రాజమండ్రికి చెందిన ఆ మహిళను జనసేన నేత బారతాల గోవింద్ నేల మీదకు నెట్టేశారు.
తన భర్త ఆర్థి లావాదేవిల సెటిల్‌మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపర్తిలో సుబ్రమణ్యం అనే వ్యక్తి ఇంటికి ఆ మహిళ వచ్చింది. తన తరపున సెటిల్‌మెంట్ కోసం జనసేన నేతలు కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను సుబ్రహ్మణ్యం పిలిపించుకున్నారు. తన సోదరుడు సతీష్‌పై సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడటంతో సెల్‌లో ఆమె వీడియో తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనసేన నాయకులు.. సెల్ ఫోన్ లాక్కుని దాడి చేశారు. గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.


