డివైడర్‌ను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న కారు

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

ముగ్గురికి తీవ్ర గాయాలు

ఆలమూరు: 216ఏ జాతీ య రహదారిలోని చొప్పె ల్ల వద్ద శుక్రవారం జరిగి న రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై జి.నరేష్‌ కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన సుంకర నవీన్‌, చందుమళ్లకు చెందిన కె.రామ్‌తేజ, పాలకొల్లుకు చెందిన కె.శివాజీ గణేష్‌కుమార్‌ కారులో విశాఖపట్నం బయలు దేరారు. చొప్పెల్ల లాకుల వద్దకు వచ్చేసరికి అపసవ్య దిశలో వెళ్లేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్‌హెచ్‌, 108 అంబులెన్స్‌లలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సై నరేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement