స్పాట్‌ పెట్టేస్తారిక.. | - | Sakshi
Sakshi News home page

స్పాట్‌ పెట్టేస్తారిక..

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా 343 గ్రామ పంచాయతీలున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం పైగా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులే సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా విజయం సాధించారు. వీరు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలు అందించారు. వీరి పదవీ కాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం తెర తీసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ కీర్తి చేకూరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంఈఓ, ఏఓ, మత్స్యశాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధికారుల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఏపీఎంలకు సైతం బాధ్యతలు అప్పజెప్పారు. పంచాయతీలు ఎక్కువగా ఉండటం.. అందుకు తగ్గట్టు అధికారులు లేకపోవడంతో.. కొందరు సీనియర్‌ అధికారులకు రెండు నుంచి మూడు, మరి కొందరికి ఐదు పంచాయతీల బాధ్యతలు సైతం అప్పగించారు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు కావడంతో ప్రత్యేకాధికారులు శనివారం పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలకు తిరిగి ఎన్నికలు జరిగేంత వరకూ పల్లెల్లో ప్రత్యేకాధికారులే పాలనా వ్యవహారాలు చక్కబెట్టనున్నారు.

ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్‌?

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తే.. కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్‌ పడుతుంది. ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం తాగునీరు, పారిశుధ్యానికి, మిగిలిన 50 శాతం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజా ప్రయోజన పనులకు వినియోగిస్తారు. జిల్లాకు రూ.100 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. పాలకవర్గాలు లేకపోవడంతో ఇవి విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో మేజర్‌ గ్రామ పంచాయతీలు సాధారణ నిధులపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడనుంది. ఎలాంటి ఆదాయ వనరులూ లేని చిన్న పంచాయతీలకు ఆర్థిక కష్టాలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇబ్బందులూ ‘ప్రత్యేకమే..’

పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఆయా పంచాయతీల్లో ప్రజలకు వివిధ సేవలు అందడంలోను, అభివృద్ధి కార్యక్రమాల్లోను జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖ విధులు నిర్వర్తించడంతో పాటు అదనంగా పల్లె పాలనపై దృష్టి పెట్టాలి. దీనికి తోడు ఒక్కో అధికారికి రెండు నుంచి ఐదు పంచాయతీలు అప్పగించారు. దీంతో వారిపై మరింత భారం పడనుంది. ఫలితంగా గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌, తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, ఇతర సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు ఎక్కడో ఉంటారు. వారిని సంప్రదించాలంటే ఇబ్బందులు తప్పవు. అదే గ్రామంలో సర్పంచులుంటే.. ఆయా సమస్యలను వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లి సత్వరం పరిష్కరించే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం ప్రత్యేకాధికారులు అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండే అవకాశం తక్కువ కావడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు.

సర్కారు వెనుకడుగు

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కారు వెనుకడుగు వేస్తోంది. అధికార పగ్గాలు చేపట్టిన దాదాపు రెండేళ్లలో కూటమి నేతలు అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. మద్యం, ఇసుక ఇలా ఏ రంగంలోనైనా దండుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమవడంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఎన్నికలకు వెళితే ఘోర ఓటమి చవిచూసే అవకాశం ఉందన్న ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పొరపాట్లకు తావు లేకుండా..

స్పాట్‌ వేల్యుయేషన్‌ విధులకు నియమితులైన వారు తప్పనిసరిగా హాజరు కావాలి. ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. మూల్యాంకన విధులకు హాజరయ్యే వారు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి.

– జి.నాగమణి, రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌,

పాఠశాల విద్యా శాఖ, కాకినాడ

రాయవరం: గత నెల 16న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 391 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో రెగ్యులర్‌, ప్రైవేటుగా మొత్తం 72,797 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, సగటున 99.48 శాతం మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2022 విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి జిల్లా కేంద్రం కాకినాడలో జవాబు పత్రాల మూల్యాంకనం జరిగేది. 2023 నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్పాట్‌ వేల్యుయేషన్‌ చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్ల కోడింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. కాకినాడలో సాలిపేట మున్సిపల్‌ గర్‌ల్స్‌ హైస్కూల్‌, కోనసీమ జిల్లాలో అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం శ్రీరామ్‌ నగర్‌లోని బీవీఎం హైస్కూల్‌లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు.

జిల్లాలకు చేరిన జవాబు పత్రాలు

వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5,43,694 జవాబు పత్రాలకు ఉమ్మడి మూల్యాంకనం చేపట్టనున్నారు. ఇందులో కాకినాడ జిల్లాలో 1,85,811, తూర్పు గోదావరి జిల్లాలో 1,76,106, కోనసీమ జిల్లాలో 1,81,777 చొప్పున జవాబు పత్రాలున్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే జవాబు పత్రాలు ఆయా జిల్లాలకు దాదాపు చేరుకున్నాయి. ఆయా జిల్లాలకు జిల్లా విద్యా శాఖ అధికారులు క్యాంప్‌ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్లు, చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు పాల్గోనున్నారు.

సబ్జెక్టుల వారీగా..

తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, సంస్కృతం, ఒకేషనల్‌ సబ్జెక్టులకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే లీప్‌ యాప్‌ ద్వారా ఉపాధ్యాయులకు నేరుగా ఉత్తర్వులు అందజేశారు. ఆరు సబ్జెక్టులు, ఒకేషనల్‌ పరీక్షలు కలిపి మొత్తం పది రోజుల పాటు మూల్యాంకనం జరుగుతుంది.

ఇవీ నిబంధనలు

ఫ మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌, స్మార్ట్‌ఫోన్లు, వైట్‌నర్‌, ఎరేజర్‌ తదితర వస్తువులను తీసుకుని వెళ్లరాదు.

ఫ మూల్యాంకన సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి తప్పిదాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఫ శిబిరానికి నిర్దేశిత సమయాల్లో హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

ఫ 6 నుంచి 15 వరకూ

టెన్త్‌ స్పాట్‌ వేల్యుయేషన్‌

ఫ ఉమ్మడి జిల్లాలో

5.44 లక్షల జవాబు పత్రాలు

ఫ ఇప్పటికే లీప్‌ యాప్‌లో ఉత్తర్వులు

ఫ ఏఈలు, సీఈలు,

స్పెషల్‌ అసిస్టెంట్లకు నేడు శిక్షణ

స్పాట్‌కు జిల్లాల వారీగా నియామకాలు ఇలా..

కేటగిరీ తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ

డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్లు 1 1 1

స్ట్రాంగ్‌ రూమ్‌ ఇన్‌చార్జి 1 1 1

అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్లు 8 7 8

ఏఏసీఓలు 8 7 8

చీఫ్‌ ఎగ్జామినర్లు 100 79 79

అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు 453 476 483

స్పెషల్‌ అసిస్టెంట్లు 267 237 242

ఫ ముగిసిన సర్పంచుల పదవీ కాలం

ఫ జిల్లాలో 343 గ్రామ పంచాయతీలు

ఫ అన్నిచోట్లా ప్రత్యేకాధికారుల నియామకం

ఫ నేడు విధుల్లోకి ప్రత్యేకాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement