నందెపు వెంకట్రావుకు ఘన నివాళి
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ మాజీ అధ్యక్షుడు, ది ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ స్టేట్ కన్వీనర్ నందెపు శ్రీనివాస్ తండ్రి వెంకట్రావు ఇటీవల మృతి చెందారు. ఆదివారం స్థానికంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వెంకట్రావుకు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ అశోక్ కుమార్‌జైన్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.


