పొగాకు రైతుల నడ్డి విరిచిన కేంద్ర బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుల నడ్డి విరిచిన కేంద్ర బడ్జెట్‌

Feb 4 2026 7:21 AM | Updated on Feb 4 2026 7:21 AM

పొగాకు రైతుల నడ్డి విరిచిన కేంద్ర బడ్జెట్‌

పొగాకు రైతుల నడ్డి విరిచిన కేంద్ర బడ్జెట్‌

రైతుల మొరను ఆలకించని వైనం

అక్రమ సిగరెట్లను ప్రోత్సహించేలా రూపకల్పన

జీఎస్టీని తక్షణం తగ్గించాలి

వర్జీనియా పొగాకు రైతుల ఆవేదన

దేవరపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తమ నడ్డి విరిచిందని వర్జీనియా పొగాకు రైతులు విమర్శించారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పొగాకు ఉత్పత్తులపై 28 శాతం ఉన్న జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల పరోక్షంగా పొగాకు రైతులపై ప్రభావం పడుతుందన్నారు. ఎకై ్సజ్‌ సుంకం, జీఎస్టీ పెంచడం వల్ల విదేశీ (నాన్‌ టాక్స్‌బుల్‌) సిగరెట్లకు మార్కెట్లో డిమాండ్‌ ఏర్పడి, స్వదేశీ సిగరెట్ల వినియోగం పడిపోతుందన్నారు. పెంచిన జీఎస్టీని తగ్గించాలని ఇటీవల రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధుల బృందం ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. బడ్జెట్‌లో రైతులకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదన్నారు. పండించిన పొగాకులో 40 శాతం స్వదేశీ సిగరెట్ల తయారీకి, 60 శాతం ఎగుమతులు జరుగుతున్నాయని, ముడిసరుకు పొగాకుపై పన్ను తగ్గించినప్పటికి రైతులకు ప్రయోజనం లేదన్నారు. జీఎస్టీ పెరగడం వల్ల పొగాకు రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు ప్రయోజనం శూన్యం

వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతుల మొరను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అక్రమ సిగరెట్ల వినియోగం తగ్గించాలంటే స్వదేశీ సిగరెట్లపై జీఎస్టీ తగ్గించాలన్నారు. ముడి సరుకుపై పన్ను తగ్గించడం వల్ల రైతులకు ప్రయోజనం లేదని తెలిపారు. వర్జీనియా పొగాకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు కాట్రు సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ పెంచడం వల్ల సిగరెట్‌ పెట్టైపె రూ.50 నుంచి రూ.100 ధర పెరుగుతుందన్నారు. దీని ప్రభావం పొగాకు ఉత్పత్తి దారులపై తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతు సంఘం ప్రతినిధి యాగంటి సాయిబాబు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని తక్షణం తగ్గించి రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో జీఎస్టీ ని ఇన్వాయిస్‌పై వసూలు చేసేవారని, ఇప్పుడు ఎమ్మార్పీఎస్‌ ధరపై వసూలు చేస్తున్నా రని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకు వచ్చిన పన్ను ల విధానం వల్ల అక్రమ సిగరెట్ల వాటా భారీగా పెరుగుతుందని, ఇప్పటికే పన్ను కట్టని అక్రమ సిగరెట్ల వాటా 26 శాతం ఉన్నట్టు రైతులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల గోడును వినిపించుకుని, పెంచిన జీఎస్టీని తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమా వేశంలో రైతు సంఘాల ప్రతినిధులు సుంకవల్లి శ్రీనివాస్‌, సింహాద్రి ధర్మావతారం, కరుటూరి శ్రీనివాసరావు, ఈలపోలు చిన్ని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement