ఫ అన్నకూటోత్సవం
దుళ్లలోని భూ సమేత వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పులిహోర ప్రసాదంతో స్వామివారి చిత్రపటాన్ని రూపొందించి అన్నకూటోత్సవం జరిపారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు కార్యక్రమాల్లో స్వామికి తెల్లవారుజామునే సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం అన్నకూటోత్సవం జరిగింది. రాత్రి 7 గంటలకు సింహ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయ అర్చకులు పెద్దింటి లక్ష్మణాచార్యులు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
– కడియం
పులిహోరతో రూపొందించిన
వేంకటేశ్వరస్వామి చిత్రం


