మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

Jan 27 2026 8:08 AM | Updated on Jan 27 2026 8:08 AM

మంగళవ

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

ఆర్ట్స్‌ కాలేజీలో

జరిగిన గణతంత్ర దినోత్సవంలో జాతీయ జెండా

ఎగురవేస్తున్న

ఇన్‌చార్జి కలెక్టర్‌

మేఘస్వరూప్‌

గగనపు

వీఽధిలో జాతీయ పతాక రెపరెపలు

ప్రగతికి పునరంకితం

ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘస్వరూప్‌

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

ఆర్ట్స్‌ కళాశాలలో

జాతీయ పతాకం ఆవిష్కరణ

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును వివరిస్తూ శకటాల ప్రదర్శన

ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఏపీఈపీడీసీఎల్‌,

డీఆర్‌డీఏ – మెప్మా, వ్యవసాయ –

హార్టికల్చర్‌ శకటాలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ఇతర ప్రముఖులను స్మరించుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తితో జిల్లా ప్రగతికి పునరంకితం అవుదామని ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘస్వరూప్‌ అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్ట్స్‌ కాలేజీ సభా ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ పోలీసు దళాల గౌరవ వందనం సమర్పించారు. పరేడ్‌ కమాండర్‌ జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పి. సంజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పరేడ్‌ను పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘస్వరూప్‌ మాట్లాడుతూ అఖండ గోదావరి కుడి, ఎడమ కాలువలు పూడిక తీతకు రూ.270 కోట్లు మంజూరు చేశామని, కాటన్‌ బ్యారేజీ మరమ్మతులకు రూ.150 కోట్లతో పనులు టెండర్‌ దశలో ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రాజమహేంద్రవరంలో వీఎల్‌ పురం వద్ద రూ.13.76 కోట్ల వ్యయంతో ఇండోర్‌ స్టేడియం పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఎస్పీ నరసింహ కిశోర్‌ మాట్లాడుతూ ఈరోజు దేశం సర్వసత్తాక, సార్వభౌమత్వ దేశంగా మారిన రోజున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

శకటాల ప్రదర్శన

వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును వివరిస్తూ నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి ఏపీఈపీడీసీఎల్‌కు దక్కగా, రెండవ బహుమతి డీఆర్‌డీఏ–మెప్మా శాఖకు, మూడవ బహుమతి వ్యవసాయం–ఉద్యాన శాఖల శకటాలకు లభించింది. క న్సొలేషన్‌ బహుమతుల్లో నాలుగవ స్థానం పాఠశాల విద్య–సర్వశిక్షా అ భియాన్‌, ఐదవ స్థానం రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌, ఆరవ స్థానం పౌర సరఫరాల శాఖలకు దక్కాయి

స్వాతంత్య్ర

సమరయోధులు, వారి వారసులకు సత్కారం

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులు, వారి వారసులను ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘస్వరూప్‌, ఎస్పీ నరసింహ కిశోర్‌ సత్కరించారు. స్వాతంత్య్ర సమర యోధురాలు నేరంటి చంద్రమ్మ (భర్త రామారాయుడు) వారసులు మారి రామతులసి (కుమార్తె), నెక్కంటి ఆదినారాయణ, బలరామకృష్ణ, వెంకటేశ్వరరావు, స్వాతంత్య్ర సమర యోధులు ఏబీ నాగేశ్వరరావు కుమారుడు కృష్ణవర్మ, స్వాతంత్య్ర సమర యోధులు క్రొవ్విడి లింగరాజు మనుమలు భాస్కరరావు, సుబ్రహ్మణ్యం, స్వాతంత్య్ర సమరయోధులు కందుల వీర రాఘవస్వామి మనుమలు బాబురాయుడులను సత్కరించారు.

మొదటి బహుమతి పొందిన ఏపీ ఈపీడీసీఎల్‌ శకటం

రెండో బహుమతి డీఆర్‌డీఏ –మెప్మా శకటం

మూడో బహుమతి సాధించిన వ్యవసాయం – ఉద్యాన శాఖ శకటం

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20261
1/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20262
2/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20263
3/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20264
4/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20265
5/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20266
6/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20267
7/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20268
8/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20269
9/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202610
10/10

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement