13 నెలల తరువాత విధుల్లోకి..
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండల విద్యాశాఖ అధికారి మానుపూడి శ్రీనివాస్ గురువారం తిరిగి విధుల్లో చేరారు. ఆ వివరాల్లోకి వెళితే.. మండలంలో 13 నెలల క్రితం జరిగిన సమ్మేటివ్ పరీక్షల్లో పేపర్ లీకై ందన్న కారణంతో (లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉండటంతో ప్రిస్టేజ్‌గా తీసుకుని) పేపర్ లీకేజీకి కారణమైన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి పూర్తిగా తొలగించారు. ఇందులో ఎంఈఓ శ్రీనివాస్‌ను కూడా సస్పెండ్ చేశారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఎంఈఓను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పుటికీ ఇంతకాలం సాగదీసి ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మంచి వ్యక్తికి న్యాయం జరిగిందంటూ ఎంఈఓ శ్రీనివాస్‌ను కలసి అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోలిశెట్టి వీరవెంకట సత్యానారాయణ మూర్తి, సుదర్శనరెడ్డి, రేఖా రామలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు బాపూజీ, రమణమూర్తి, చైతన్యబాబు, శివగణేష్, పీఆర్‌టీయూ నాయకులు మొంగం అమృతరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎంఈఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ


