విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తాళ్లపూడి: గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పట్టణ పోలీసులు రక్షించిన ఘటన కొవ్వూరులో చేటుచేసుకుంది. పట్టణ పోలీసులు రక్షించిన సంఘటనలో కొవ్వూరులో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం వెంకటేశ్వరనగర్, మోరంపూడికి చెందిన 20 ఏళ్ల నరవ విశ్వతేజ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కొవ్వూరు వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసినట్టు సీఐ విశ్వం తెలిపారు. బీ టెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్టు వివరించారు. 112కు సమాచారం రావడంతో వెంటనే స్పందించి స్విమ్మర్లను రప్పించి విశ్వతేజను రక్షించి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు.


