220 అర్జీల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

220 అర్జీల స్వీకరణ

Feb 3 2026 7:34 AM | Updated on Feb 3 2026 7:34 AM

220 అ

220 అర్జీల స్వీకరణ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి 220 అర్జీలను ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘస్వరూప్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తాము సమర్పించిన అర్జీల యధార్థ స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చన్నారు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ప్రాబేషనరీ) కృష్ణ చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి, ఆర్డీవోలు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 39 ఫిర్యాదులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 39 అర్జీలు వచ్చాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్‌ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత స్టేషన్‌ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సివిల్‌ కేసులు, కుటుంబ సమస్యలు, ఛీటింగ్‌, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు.

220 అర్జీల స్వీకరణ  1
1/1

220 అర్జీల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement