పుట్టకొండ.. భక్తులే నిండా..
పెదపూడి: పుట్టకొండ గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. దీనిని ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పీఏ అనంతాచార్యులు, గ్రామ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు. స్వామివారిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నిత్యహోమం, సంప్రదాయార్చన, 12 గంటలకు ధ్వజారోహణం, బలిహరణ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం జరిగింది. రాత్రి 10 గంటలకు గరుడ, పుష్పక వాహన సేవ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు స్వామివారి కల్యాణం జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉగ్ర నరసింహ స్వామివారికి ప్రధాన అర్చకుడు పి.గోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వడ్డాది సత్యనారాయణ, సర్పంచ్ వల్లు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


