● నాడు రక్ష.. నేడు శిక్ష
● కళశ యాత్ర
జంతువుల నుంచి మొక్కలను కాపాడేందుకు వేసిన రక్షణ కవచం నేడు శాపంగా మారింది. కిర్లంపూడి వెలుగు కార్యాలయం ఆవరణలో నీడను, స్వచ్ఛమైన గాలి ఇచ్చేందుకు మొక్కలు నాటి వాటికి రక్షణకు ఇనుప చట్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొక్కలు పెద్దవి కావడంతో నాడు రక్షణ కల్పించిన ఇనుప చట్రాలు మొక్క బెరడులోకి చొచ్చుకుపోతున్నాయి. వీటిని తొలగించకుంటే వాటి మనుగడకే ఇబ్బంది.
–కిర్లంపూడి
సన్నవిల్లి వద్ద పంట కాలువలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు
పాతకొట్టాంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో వార్షిక కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. వేలాది మంది మహిళలు సప్తనదీ పవిత్ర జలాల కలశాలను శిరస్సున ధరించి యాత్ర నిర్వహించారు. అనంతరం ఆ జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. తర్వాత విజయవాడకు చెందిన వేదపండితుడు ఘంటికోట సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామివారికి పూజలు, కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యడ్ల చెల్లారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
–కోటనందూరు
ఎటు చూసినా, ప్లాస్టిక్ వ్యర్థాలు జంతు కళేబరాలు చూసి పెంట కాలువ అనుకుంటే పొరపాటే.. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో గొరగొనమూడి, కూనవరం టైల్ ఎండ్ పంట కాలువ దుస్థితి ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగుకు నీరు అందించాల్సిన కాలువ ఇలా అధ్వానంగా తయారైంది. నిండా చెత్తా చెదారం, వ్యర్థాలతో మూసుకుపోయింది. సన్నవిల్లి పంచాయతీ పరిధి దుర్గమ్మ గుడి సమీపంలో ఇలా ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
–ఉప్పలగుప్తం
● నాడు రక్ష.. నేడు శిక్ష
● నాడు రక్ష.. నేడు శిక్ష


