పంట కాలువలోకి స్కూల్ బస్సు
● స్టీరింగ్ ఫెయిల్ అయ్యి
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వైనం
● 23 మంది విద్యార్థులకు తప్పిన ముప్పు
సఖినేటిపల్లి: మండలం టేకిశెట్టిపాలెంలో మలికిపురంలోని ఒక ప్రైవేటు పాఠశాల బస్సు విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. 23 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు స్టీరింగ్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న హెచ్‌టీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగి బస్‌పై ఒరిగి తీగలు వేలాడాయి. కేవలం అంగుళం దూరంలో తీగలు వేలాడుతుండగా విద్యార్థులను బస్సు నుంచి దింపేశారు. అంతర్వేది ఉత్సవాల వల్ల పూర్తి నీటిమట్టంతో ప్రవహిస్తున్న పి.గన్నవరం ప్రధా న పంటకాలువ కూడా పక్కనే ఉంది. బస్ కాలువలో పడిపోయినా పెను ప్రమాదం సంభింవించేది. అలాగే బస్సుకు 11 కేవీ హెచ్‌టీ విద్యుత్ తీగలు తగిలినా పెను ప్రాణ నష్టం సంభవించేంది. కారణాలు ఏమైనప్పటికీ స్టీరింగ్ ఫెయిల్ అని డ్రైవర్ అంటున్నాడు. సఖినేటిపల్లి పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాఠశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ సంఘటనపై స్పందించి ఆర్టీఏ అధికారులను ఫోన్ చేశారు. జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించా రు. డ్రైవర్‌ను విచారించారు. డ్రైవర్ లైసెన్సు మూడేళ్ల పాటు సస్పెండ్ చేశారు. అలాగే బస్ పర్మిట్‌ను కూడా మూడేళ్ల పాటు సస్పెండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యలకు అనుగుణంగానే బస్‌లు ఏర్పాటు చేసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.


