‘భాష్యం’ ఎదుగుదలలో తల్లిదండ్రులు కీలకం | - | Sakshi
Sakshi News home page

‘భాష్యం’ ఎదుగుదలలో తల్లిదండ్రులు కీలకం

Jan 27 2026 7:50 AM | Updated on Jan 27 2026 7:50 AM

‘భాష్

‘భాష్యం’ ఎదుగుదలలో తల్లిదండ్రులు కీలకం

కంబాలచెరువు: ‘భాష్యం’ ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలమైందని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక జేకే గార్డెన్స్‌లో భాష్యం రజతోత్సవ వేడుకల్లో 2001–02 విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో భాష్యం విద్యా సంస్థలను స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకుని, రజతోత్సవాన్ని జరుపుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తమపై నమ్మకంతో పిల్లలను భాష్యంలో చేర్పించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక దానవాయిపేటలో మొదటి బ్రాంచ్‌ను ప్రారంభించామన్నారు. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోకూడదన్న విలువలను అనుసరించి ఈ విజయానికి కారకులైన తల్లిదండ్రులను సన్మానించుకోవడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. భాష్యం విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ భాష్యం హనుమంతరావు మాట్లాడుతూ తొలినాళ్లలో తమకు వెన్నుదన్నుగా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అకడమిక్‌ కోర్‌ టీమ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సభకు భాష్యం విద్యా సంస్థల ముఖ్య సలహాదారు మైఖేల్‌ రాజ్‌ అధ్యక్షత వహించారు. ఉభయగోదావరి జిల్లాల జెడ్‌ఈఓలు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలసిన

డాక్టర్‌ దశరథ రామారెడ్డి

రాజమహేంద్రవరం సిటీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దశరథ రామారెడ్డి, సింధు తేతలి దంపతులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

‘భాష్యం’ ఎదుగుదలలో  తల్లిదండ్రులు కీలకం 1
1/1

‘భాష్యం’ ఎదుగుదలలో తల్లిదండ్రులు కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement