‘కొవ్వు’ మాటలపై ఇప్పుడే మంటారు?
కపిలేశ్వరపురం (మండపేట): ప్రపంచ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనీ, లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందంటూ గతంలో కూటమి నేతలు చేసినదంతా దుష్ప్రచారమని తేలిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. విచారణ అనంతరం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదంటూ సిట్ విచారణ నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. తమ రాజకీయ లబ్ధి కోసం చివరకు దేవుడి వ్యవహారాన్ని కూడా దుష్ప్రచారం చేసిన నేతలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చరిత్రలో నిలుస్తారని ఎమ్మెల్సీ తోట అన్నారు. మండపేటలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, మండపేట పట్టణం, రూరల్ కమిటీల కన్వీనర్లు పిల్లి శ్రీనివాస్, అడబాల బాబ్జి, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు పిల్లా వీరబాబులతో కలిసి ఎమ్మెల్సీ తోట విలేకరులతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలవలేదని సిట్ విచారణ నివేదిక తేటతెల్లం చేసిందని, గతంలో చేసిన దుష్ప్రచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన రోజుల్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేస్తున్నది దుష్ప్రచారమనీ, వారి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని నిబద్ధతతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరిన విషయాన్ని ఎమ్మెల్సీ తోట గుర్తు చేశారు. రాజకీయాలను హుందాగా ప్రజాకోణంలో చేయాలని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా దేవుడి వ్యవహారంలో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.
చంద్రబాబు బాటలోనే వేగుళ్ల
చంద్రబాబు బాటలోనే ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నడుస్తున్నారన్నారు. సిట్ విచారణలో జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పగా కల్తీ జరిగిందంటూ ఎమ్మెల్యే వేగుళ్ల ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కల్తీ జరిగిందని చెబుతున్న ఎమ్మెల్యే సిట్ విచారణ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని, చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. పైగా సిట్ విచారణపై వైఎస్సార్ సీపీ నేతలు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే వేగుళ్ల అనడం విడ్డూరంగా ఉందన్నారు. తనను అలిపిరి ఘటన నుంచి రక్షించింది శ్రీవారే అని ఒక పక్కన చెబుతూ ఆ శ్రీవారినే రాజకీయాల్లోకి లాగడం ఏపాటి ధర్మమో చంద్రబాబు చెప్పాలన్నారు. పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసిన ఎవరినీ శ్రీ వేంకటేశ్వరస్వామి వదలడని అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నపై చేస్తున్న ఆరోపణలు ఏమాత్రమూ సరికాదన్నారు. టీటీడీ ఆర్థిక వ్యవహారాలన్నీ బ్యాంక్ ఖాతాల ఆధారంగా జరుగుతాయన్న సంగతిని కూటమి నేతలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆలీఖాన్ బాబా, మందపల్లి రవికుమార్, ఎర్రగుంట అయ్యప్ప, జొన్నపల్లి సత్తిబాబు, పోతుల రాంబాబు, పోతుల ప్రసాద్, యరమాటి వెంకన్నబాబు, దాసరి వీర వెంకట లక్ష్మి, వాసిరెడ్డి అర్జున్, కోళ్ళ శ్రీను, తీగిరెడ్డి మహేష్, మరివాడ సూరిబాబు పాల్గొన్నారు.
రాజకీయ లబ్ధి కోసం నెయ్యిలో
కొవ్వు కలిసిందన్నారు
కొవ్వు కలవలేదని
సిట్ విచారణ నివేదిక ఇచ్చింది
తమ ప్రయోజనాల కోసం
దేవుణ్ణి రాజకీయం చేశారు
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై
ఎమ్మెల్సీ తోట ఫైర్
0000681473-000001-RJY ADSALES SPO
8.00x10.00
RJY ADSALES SPOT PAYMENT ACCOUNT


