గాండ్రింపు ఆగింది..
ఫ కూర్మాపురంలో చిక్కిన పులి
ఫ ఫలించిన ‘ఆపరేషన్ టైగర్’
ఫ విశాఖపట్నం తరలింపు
రాయవరం: గాండ్రింపు ఆగింది.. ఎట్టకేలకు పెద్ద పులి చిక్కింది.. వారం రోజుల నుంచి పులి జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.. చివరికి అటవీశాఖ అధికారులు, పోలీసుల కృషి ఫలించింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో పులిని అధికారులు బంధించి విశాఖపట్నం జూలాజికల్ పార్క్‌కు తరలించారు.
రాయవరం మండలం కూర్మాపురంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు పొలానికి వెళ్లిన రైతులు పులి అడుగు జాడలను గమనించారు. పొలంలో మందును స్ప్రే చేస్తుండగా గ్రామానికి చెందిన గుంటూరు వనుములు తొలుత చూశారు. ఈ విషయాన్ని ఊళ్లో వారికి చెప్పడంతో, పులి అడుగు జాడల వెంబడి వెళ్తుండగా గుణ్ణం బాబూరావు చెరువు వద్ద గాండ్రింపును రైతులు ముత్యాల శ్రీనివాస్, గుణ్ణం పనసయ్య విన్నారు. ఆ విషయాన్ని వెంటనే అధికారులకు చేరవేశారు. అనంతరం ఆ పులి ఆంజనేయస్వామి గుడి సమీపంలోని పాలచర్ల రాజు ఇంటి ఆవరణలోకి చేరింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 11.30 గంటల ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పుణే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ప్రత్యేక వాహనంలో ఉండి పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే మధ్యాహ్నం 1.50 గంటలకు ఒక్కసారిగా పులి పాలచర్ల రాజు ఇంటి గోడ దూకి అరటి తోటల నుంచి పంట పొలాల మీదుగా గ్రామంలోని కొలగాని సత్తిబాబు పశువుల పాకలోకి చేరింది. అప్పటికే పశువుల పాకలో రెండు గేదెలు, లేగదూడ ఉన్నాయి. వాటిని పులి చంపిందన్న వార్త బయట హల్‌చల్ చేసింది. అయితే వాటిని ఏమీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పశువుల పాక వద్దే ఉండి..
పశువుల పాక నుంచి బయటకు పులి బయటకు వస్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పశువుల పాక బయట వేచిచూశారు. పశువుల పాక వద్ద భవనాల పైకి చేరిన రెస్క్యూ టీమ్ సభ్యులు తుపాకీ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేందుకు చూశారు. అప్పటికే చీకటి పడుతుండడంతో ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు. చివరికి సాయంత్రం 6.32 గంటలకు పులి బయటకు వచ్చింది. వెంటనే రెండు వైపులా నుంచి రెస్క్యూ టీమ్ సభ్యులు తుపాకీ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇరువురు ఒకేసారి తుపాకీ ద్వారా ఇంజెక్షన్ చేయగా, ఒకటి పులికి తగిలింది. పశువుల పాకకు 100 మీటర్ల దూరంలో దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద పులి రహదారిపై పడిపోయింది. అప్పటికే పులిని అధికారులు, ప్రజలు వెంబడించారు. వెంటనే పులిని బంధించి, ప్రత్యేక వాహనంపై అటవీ శాఖ అధికారులు విశాఖపట్నం జంతు ప్రదర్శన శాలకు తరలించారు.
పయనం సాగిందిలా..
తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల పాటు పులి సంచరించింది. జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిం. ప్రాణనష్టం లేకున్నప్పటికీ, ఆరు పశువులు మాత్రం పులి బారిన పడ్డాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి సాగిన పెద్ద పులి ప్రయాణం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ముగిసింది. తడోబా అభయారణ్యం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఖమ్మం జిల్లా పాల్వంచకు చేరుకుంది. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, పోలవరం మీదుగా గత నెల 31న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలోకి ప్రవేశించింది. పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి జిల్లాలో కోలమూరు, దివాన్‌చెరువు మీదుగా రాజానగరం మండలం జి.యర్రంపాలెం నుంచి గురువారం అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో పులి జాడను అధికారులు కనుగొన్నారు. శుక్రవారం ఉదయానికి పులి రాయవరం మండలం కూర్మాపురంలోకి చేరుకోగా, ఇక్కడ అధికారుల పన్నిన వలలో చిక్కింది.
భయపడిపోయాం..
మా ఇంటి పరిసరాల్లోనే పులి ఉందన్న వార్తతో చాలా భ యపడ్డాం. మొదట్లో ఆందో ళన చెందాం. అటవీశాఖ, పో లీసులు వచ్చిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది. మా ఇంటి వెనుక నుంచే పులి పారిపోవడం చూశాం. గ్రామానికి పులి వస్తుందని అసలు ఊహించలేదు. –చిలుకూరి బుజ్జి,
కూర్మాపురం, రాయవరం మండలం
ఆపరేషన్ విజయవంతం
వారం రోజులుగా పులి సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కూర్మాపురం చేరుకుందని తెలియగానే, అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పులిని పట్టుకున్నాం. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ట్రాంక్విలైజేషన్ ప్రక్రియతో ఆపరేషన్ విజయవంతం చేశాం.
–బి.విద్య, ఈస్ట్‌జోన్ డీఎస్పీ, రాజమహేంద్రవరం డివిజన్
పశువులను వదిలేసి..
పశువుల పాకలో పులి సుమారు 4.30 గంటలు ఉంది. అప్పటికే పశువుల పాకలో రెండు గేదెలు, ఒక దూడ ఉన్నాయి. పశువుల పాకలోనే ఉన్నప్పటికీ పులి వాటిపై దాడి చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజలు పులిని వెంబడించడంతో భయాందోళనకు గురైన పులి పశువులకు హాని తలపెట్టక పోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
గాండ్రింపు ఆగింది..
గాండ్రింపు ఆగింది..
గాండ్రింపు ఆగింది..
గాండ్రింపు ఆగింది..
గాండ్రింపు ఆగింది..


