జాతీయ స్థాయి బీచ్‌ వాలీబాల్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి బీచ్‌ వాలీబాల్‌కు ఎంపిక

Jan 28 2026 11:07 AM | Updated on Jan 28 2026 11:07 AM

జాతీయ స్థాయి బీచ్‌ వాలీబాల్‌కు ఎంపిక

జాతీయ స్థాయి బీచ్‌ వాలీబాల్‌కు ఎంపిక

చాగల్లు: జాతీయ స్థాయి బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు ఊనగట్ల జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థినులు ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయుడు ఎన్‌వీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తమ పాఠశాలలో పంతకాని లాస్య (తొమ్మిదో తరగతి), కంచర్ల హనీ (ఏడో తరగతి) అండర్‌–14 బాలికల విభాగంలో జాతీయ స్థాయి బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. వీరు బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ కోల్‌కతాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థినులను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామోపాధ్యాయుడు కొయ్య గంగాధరరావును అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నందిగం శ్రీనివాసరావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ కామన శివ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement