తోట త్రిమూర్తులుకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | - | Sakshi
Sakshi News home page

తోట త్రిమూర్తులుకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

తోట త

తోట త్రిమూర్తులుకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

కపిలేశ్వరపురం: సోదర వియోగంతో బాధ పడుతున్న వైఎస్సార్‌ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఫోనులో పరామర్శించారు. తోట సోదరుడు సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో తోటను జగన్‌ ఫోనులో ఓదార్చారు. త్రిమూర్తులును ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కూడా ఫోను ద్వారా పరామర్శించారు. అలాగే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలవురు నాయకులు రామచంద్రపురం రూరల్‌ మండలం వెంకటాయపాలెంలోని త్రిమూర్తులు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, బీజేపీ నాయకులు యాళ్ళ దొరబాబు, రాచమంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

తోట త్రిమూర్తులుకు వైఎస్‌ జగన్‌ పరామర్శ 1
1/1

తోట త్రిమూర్తులుకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement