ఫ్రిజ్ పేలి మెడికల్ షాపు దగ్ధం
అల్లవరం: ఫ్రిజ్ పేలడంతో షాపు దగ్ధమైన ఘటన బోడసకుర్రు మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. షాపు యజమాని కొక్కిరమెట్టి గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఆయన భోజనం చేయడానికి షాపు క్లోజ్ చేసి కోడూరుపాడులోని ఇంటికి వెళ్లారు. భోజనం చేయడానికి రెడీ అవుతున్న సమయంలో బోడసకుర్రు నుంచి ఫోన్ వచ్చింది. షాపులో నుంచి పొగ, శబ్దాలు వస్తున్నాయని తెలిపారు. దీంతో హూటాహూటీన షాపు వద్దకు వెళ్లే సరికి షాపులో మంటలు చెలరేగుతున్నాయి. స్థానికుల సాయంతో షాపు షట్టర్ ఓపెన్ చేసి చేసే సరికి ఫ్రిజ్ పేలిపోయి మంటలు వ్యాపించాయని బాధితుడు తెలిపారు. సుమారు రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని చెప్పారు.


