విద్యుత్ లైన్‌పై పడిన కొబ్బరి చెట్టు
సఖినేటిపల్లి: అంతర్వేదికి వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఉయ్యూరివారి మెరక ఆర్‌అండ్‌బీ రోడ్డులో సోమవారం పెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డులోని శంకరయ్య రైస్ మిల్లుల వద్ద ఒక కొబ్బరి చెట్టు ఒక్కసారిగా హెచ్‌టీ విద్యుత్ తీగలపై పడింది. తీగలు తెగి తారు రోడ్డుపై పడ్డాయి. విద్యుత్ తీవ్రతకు తారు రోడ్డుపై సైతం మంటలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ ఎక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ శాఖ ఏఈ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.


