మార్కెట్‌లోకి సుజుకి ఈ–యాక్సిస్ స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–యాక్సిస్’ను రాజమహేంద్రవరం కంటిపూడి సుజుకి షోరూంలో శుక్రవారం జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి ఆర్.సురేష్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సంపత్‌కుమార్‌లు మార్కెట్‌లోకి విడుదల చేశారు. కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీతో ఈ వాహనం విడుదలైందన్నారు. దీనిద్వారా నాలుగు రెట్ల అధిక బ్యాటరీ జీవితం లభించనుందన్నారు. దేశంలోనే తొలిసారిగా 60 శాతం విలువతో బై–బ్యాక్ సౌకర్యం కల్పించడం ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు. హయాబూసా, జీఎస్‌ఎక్స్, వి–స్ట్రోమ్ వంటి అత్యాధునిక మోడళ్లకు టెస్టింగ్ జరిగే జపాన్‌లో ఈ స్కూటర్ పరీక్షలు జరగడం విశేషమన్నారు. కేవలం ఒక గంట 12 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ అయ్యే సామర్థ్యం ఉందని సర్వారాయుడు తెలిపారు. కీ–లెస్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు 4.2 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చిందన్నారు. కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ సత్యనారాయణ మూర్తి (చినబాబు), కె.వినయ్‌బాబు, ఎం.జగన్, కె.మన్మోహన్‌రామ్, ఎస్‌ఎం వెంకటేశ్, నగర ప్రముఖులు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.


