వేషం కట్టు... జోలె పట్టు
u
అనపర్తి: రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతరకు ప్రత్యేకత ఉంది. ఉత్సవాలు శనివారం నుంచి మూడు రోజులు జరగనున్నాయి. ఇక్కడో వింత ఆచారం ఉంది. ఎంతటి వారైనా వేషం కట్టి, జోలె పట్టి అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం అనాదిగా వస్తోంది. సుమారు రెండొందల ఏళ్ల నుంచి ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. కర్రి వారి ఆడపడుచుగా పేరొందిన అమ్మవారికి ప్రతి రెండేళ్లకోసారి జాతర జరుగుతోంది. ఈ నెల 31వ తేదీ శనివారం నుంచి ప్రారంభమయ్యే జాతర వచ్చే నెల 2వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులంతా ఇప్పటికే సొంతూరికి చేరుకున్నారు.
కొప్పవరంలో మూడు రోజులపాటు జాతర మహోత్సవాలు జరుగుతాయి. తొలిరోజు శనివారం కత్తిరి కుండ నెత్తిన ధరిస్తే సంతానం లేని మహిళలకు సంతానం కలుగుతుందని నమ్మకం. దీనికోసం చాలామంది మహిళలు వస్తుంటారు. రెండో రోజు ఆదివారం గ్రామ దేవత సత్తెమ్మ తల్లిని నాగదేవతగా ఉందని పుట్టలో పాలు పోసి పూజిస్తారు. అనంతరం గ్రామ దేవత సత్తెమ్మ తల్లిని భక్తితో కొలిచే పూజారులను ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకుని బెత్తంతో కొట్టించుకుని మొక్కు తీర్చుకుంటారు. వచ్చే నెల 2న చివరి రోజు సామాన్యుడైనా, కుబేరుడైనా సరే మొక్కు తీర్చాలంటే జోలె పట్టి భిక్షాటన చేయాల్సిందే. పిల్లలు లేని దంపతులు, వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపారులు, పంటలు బాగా పండాలని రైతులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ఆచారం. రకరకాల వేషధారణలతో మొక్కులు తీర్చుకునే భక్తులు, ఈ జాతరను వీక్షించడానికి తరలివచ్చే ప్రజలతో కొప్పవరం గ్రామం అంతా మూడు రోజులూ సందడితో నిండిపోతుంది.
భిక్షాటన చేసి..
అమ్మవారి జాతరలో చివరి రోజు కీలకమైంది. తారతమ్యాలు లేకుండా రకరకాల వేషధారణలతో భిక్షాటన చేసి వచ్చే నగదు, బియ్యాన్ని అమ్మవారికి సమర్పించుకుని మొక్కు తీర్చుకుంటారు. ఈ జాతరలో ప్రముఖ సినిమా వేషధారణలు చూపర్లను ఆకట్టుకుంటాయి. అనేక మంది ప్రముఖులు, రాజకీయ నేతలు వచ్చి వేడుకలను తిలకిస్తుంటారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా..
కర్రి వారి ఆడపడుచుగా పూజలందుకుంటున్న కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతర రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా మనుషులంతా ఒక్కటే అనే భావన కలిగే విధంగా ఎంతటి వారైనా భిక్షాటన చేసి మొక్కు తీర్చుకునే సంప్రదాయం కొప్పవరం సత్తెమ్మ అమ్మవారి ఆలయం వద్దే కనిపిస్తుంది. –కర్రి బులిమోహనరెడ్డి,
ఆలయ కమిటీ సభ్యుడు, కొప్పవరం
రెండేళ్లకు ఒకసారి..
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కొప్పవరం సత్తెమ్మ తల్లి. అమ్మవారి జాతర మహోత్సవాలకు వృత్తి, వ్యాపారాల రీత్యా సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు సైతం రెండేళ్లకు ఒకసారి వస్తుంటారు. అమ్మవారి సంబరాలకు తప్పనిసరిగా వచ్చి వేషధారణ చేసి భిక్షాటన చేసి మొక్కు తీర్చుకుంటాం.
–గొలుగూరి దుర్గారెడ్డి, భక్తుడు, కొప్పవరం
పంచె కట్టి.. ముసలివాడిగా కర్ర చేతబట్టి.. పోలీస్‌లా లాఠీ ఎక్కుపెట్టి.. షిర్డీసాయిలా వేషం కట్టి.. ఇలా ఒకటేమిటి వివిధ వేషధారణతో ఆ ఊరిలో సందడే సందడి. కుబేరులైనా, సామాన్యులైనా ఇలా వేషం కట్టి.. జోలె పట్టడం ఇక్కడ సంప్రదాయం. రెండేళ్లకు ఒకసారి జరిగే కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతరలో అమ్మవారికి భక్తులు ఇలా మొక్కు తీర్చుకుంటారు. ఇందులో భాగంగా ముందుగా వివిధ వేషధారణతో భిక్షాటన చేయడం ఆచారంగా వస్తోంది. శనివారం నుంచి ఈ జాతర జరగనుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం రండి.
ఫ కొప్పవరం సత్తెమ్మ జాతరలో వింత ఆచారం
ఫ మొక్కు చెల్లించడానికి
విచిత్ర వేషధారణతో భిక్షాటన
ఫనేటి నుంచి వచ్చే నెల 2 వరకూ
సంబరాలు
వేషం కట్టు... జోలె పట్టు
వేషం కట్టు... జోలె పట్టు
వేషం కట్టు... జోలె పట్టు
వేషం కట్టు... జోలె పట్టు
వేషం కట్టు... జోలె పట్టు


