రేపటి నుంచి జాతీయ స్థాయి హాకీ పోటీలు
● కాకినాడ వేదికగా నిర్వహణ
● హాజరుకానున్న జాతీయ,
అంతర్జాతీయ క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ క్రీడలకు ప్రసిద్ధి.. ఇప్పటికే జాతీయ స్థాయి హాకీ పోటీలకు నగరం వేదికగా నిలిచింది. ఇప్పుడు ఇక్కడి జిల్లా క్రీడా మైదానంలోని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి హాకీ టోర్నీ జరుగనుంది. ఆ వివరాల్లోకి వెళితే... హాకీ ఇండియా సహకారంతో హాకి ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారి కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రీడా మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో ఈ నెల 4 నుంచి 14 వరకూ ఈ పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ సెక్రటేరియేట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ మేజర్ పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జట్లు పాల్గొంటున్నాయి. మహిళల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ పోటీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరుకానుండడంతో నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. హాకీ ఇండియా అఫిలియేటెడ్ అంపైర్లను పోటీల నిర్వహణకు హాకీ ఇండియా పంపనుంది. వివిధ జట్లకు చెందిన క్రీడాకారుల కోసం భోజన, వసతి సదుపాయాలు ఇప్పటికే పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక అధికారులు, జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారులు, పీఈటీలు టోర్నమెంట్ నిర్వహణలో సేవలు అందించనున్నారు. పోటీల్లో మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండో బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.లక్ష ఆయా జట్లకు అందిస్తా రు. జాతీయస్థాయి గోల్డ్‌కప్ హాకీ పోటీలు కాకినా డ ప్రజలకు సుమారు 10 రోజుల పాటు కనువిందు చే యనున్నాయి. పోటీల నిర్వహణకు అనువుగా క్రీ డా మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్‌ను తీర్చిదిద్దుతున్నారు. పోటీల ఏర్పాట్లలో హాకీ సంఘ ప్రతినిధు లు రవిరాజు, సూరిబాబు సహకారం అందిస్తున్నారు.


