గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు
గోకవరం: మండలంలోని సూదికొండ, గంగంపాలెం గ్రామాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా భూగర్భ, గనుల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు నిర్ధారించి తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు పొక్లెయిన్లను సీజ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు శైలజ, మనీషా, స్థానిక రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


