కాశీ ఇసుక, గంగాజలంతో సూక్ష్మ శివలింగం
కపిలేశ్వరపురం (మండపేట): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మకళా శిల్పి అండలూరి వీర వెంకట సత్యనారాయణ.. కాశీ నుంచి తెచ్చిన ఇసుక, గంగాజలంతో సూక్ష్మ శివలింగాన్ని రూపొందించారు. కందిబద్ద పరిమాణంలో తయారైన సూక్ష్మ శివలింగాన్ని పెన్సిల్‌పై అమర్చి శనివారం ప్రదర్శించారు. 2005లో తన తల్లిదండ్రులు త్రయంబకాచారి, వెంకటలక్ష్మి దంపతులు కాశీ నుంచి తీసుకొచ్చిన ఇసుకను భక్తితో భద్రపరిచామని సత్యనారాయణ తెలిపారు. రావణాసురుడిని వధించిన తర్వాత శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో సైకత శివలింగాన్ని తయారు చేసి పూజించిన ఘట్టానికి ఆకర్షితుడినై తాను ఈ సైకత శివలింగం తయారు చేశానని చెప్పారు. సత్యనారాయణ గతంలో సూక్ష్మ రూపంలో పంచలోహాలతో శివలింగం, బియ్యపు గింజతో శివలింగం, నవరత్నాల్లో ఒకటైన పచ్చ (మరకత) శివలింగం, విద్యుత్ బల్బులోని ఫిలమెంట్‌తో శివలింగాన్ని తయారు చేశారు.
కాశీ ఇసుక, గంగాజలంతో సూక్ష్మ శివలింగం


