మహాశివరాత్రికి ఆలయాల ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రికి ఆలయాల ముస్తాబు

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

మహాశి

మహాశివరాత్రికి ఆలయాల ముస్తాబు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): శంభోశంకర ... హరహర మహాదేవా అంటూ భక్తులతో శివాలయాలు మారుమోగనున్నాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లాలోని అన్ని శివాలయాల్లో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌతమ మహర్షి తపో ఫలితంగా, పరమ శివుని జటాజూటం నుంచి జాలు వారిన గోదావరి పరీవాహక ప్రాంతం నేడు శివనామ స్మరణతో మార్మోగనుంది. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానమాచరించి పరమేశ్వరుడు దర్శనానికి భక్తులు సిద్ధమవుతున్నారు. గోదావరి నది ఒడ్డున అనేక శివాలయాలు ఉన్నాయి. వాటిలో అతి ప్రాచీనమైనవి, పురాతనమైన శివాలయాలున్నాయి. రాజమహేంద్రవరంలోని కోటిలింగాలపేటలోని భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వరస్వామి, మార్కండయేశ్వర స్వామి, భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వరస్వామి, జాంపేటలోని ఉమా రామలింగశ్వర దేవాలయం, సారంగధరేశ్వరుని ఆలయం, మహాకాళేశ్వర ఆలయాల్లో భక్తుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మహాశివరాత్రికి ఆలయాల ముస్తాబు1
1/1

మహాశివరాత్రికి ఆలయాల ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement