ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శ

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్

ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్

రామచంద్రపురం: సోదర వియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట త్రిమూర్తులును మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం వెంకటాయపాలెంలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల త్రిమూర్తులు సోదరుడు తోట సత్యనారాయణ మృతిచెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణ చిత్రపటానికి పేర్ని నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ ఫోన్‌లో ఎమ్మెల్సీ త్రిమూర్తులును పరామర్శించారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్‌, సత్తి సూర్యనారాయణరెడ్డి, రాపాక వరప్రసాద్‌, పాముల రాజేశ్వరి, సింహాద్రి రమేష్‌, ప్రత్తిపాడు వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌, ముద్రగడ గిరిబాబు, రామచంద్రపురం వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశ్‌, రామచంద్రపురం, మండపేట మున్సిపల్‌ చైర్మపర్సన్‌లు గాధంశెట్టి శ్రీదేవి, పతివాడ నూక దుర్గారాణి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్‌, అత్తిలి సీతారామస్వామి, పెదపూడి ఎంపీపీ కేతా తులసీ శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటరెడ్డి, పెదపూడి మండలానికి చెందిన 14 మంది సర్పంచ్‌లు రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవానీ, వెంకటాయపాలెం సర్పంచ్‌ యర్రమల్లి సతీష్‌కుమారి, వైఎస్సార్‌ సీపీ నేత పెంటపాటి శ్రీను, అంబటి తుకారాం, ముద్రగడ కాంత్రి, నియోజకవర్గంలోని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌ సీపీ నేతలు త్రిమూర్తులును పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement