ఉత్సాహంగా సెపక్‌ తక్రా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా సెపక్‌ తక్రా పోటీలు

Feb 12 2026 7:28 AM | Updated on Feb 12 2026 7:28 AM

ఉత్సా

ఉత్సాహంగా సెపక్‌ తక్రా పోటీలు

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సెపక్‌ తక్రా మెన్‌, ఉమెన్‌ అంతర్‌ కళాశాలల, వర్సిటీ జట్టు ఎంపికలను వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ బుధవారం ప్రారంభించారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు 30 మంది అబ్బాయిలు, 12 మంది అమ్మాయిలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 8 మంది అబ్బాయిలను, ముగ్గురు అమ్మాయిలను వర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. వీరికి శిక్షణ ఇచ్చిన అనంతరం నైపుణ్యం ప్రదర్శించిన వారిని మార్చి 11 నుంచి 14వ తేదీ వరకు అస్సాం యూనివర్సిటీలో జరిగే టోర్నమెంట్లకు పంపిస్తారని వీసీ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభను కనబరచి జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి. వెంకటేశ్వర్రావు, కార్యదర్శి డాక్టర్‌ కె.బాలసత్యనారాయణ, పరిశీలకుడు డాక్టర్‌ ఎంవీఎస్‌ఎస్‌ మూర్తి, సెలక్షన్‌ కమిటీ సభ్యులు కె.కనకరాజు, కె.సతీష్‌, అధ్యాపకులు, పీడీలు, ఎంపీఈడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సెపక్‌ తక్రా పోటీలు 1
1/1

ఉత్సాహంగా సెపక్‌ తక్రా పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement