టీడీపీలో ‘ఎత్తిపోతల’ చిచ్చు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో ‘ఎత్తిపోతల’ చిచ్చు

Feb 12 2026 7:28 AM | Updated on Feb 12 2026 7:28 AM

టీడీపీలో ‘ఎత్తిపోతల’ చిచ్చు

టీడీపీలో ‘ఎత్తిపోతల’ చిచ్చు

తాళ్లపూడి: వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం కమిటీ మార్పు విషయం టీడీపీలో చిచ్చు రేపింది. ఆ పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వర్గపోరుతో పరువు బజారున పడింది. దీంతో పథకం నిర్వహణపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి, ఆయనకు అనుకూలంగా ఉన్న కొందరు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీలో మరో వర్గం, జనసేన నాయకులకు తోడు రైతులు కూడా మండిపడుతున్నారు. వేగేశ్వరపురంలో బుధవారం ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ అధ్యక్షుడు కై గాల రాంబాబుతో పాటు టీడీపీ, వైఎస్సార్‌ సీపీ, జనసేన పార్టీలకు అతీతంగా రైతులు పాల్గొని స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు.. సంబంధిత శాఖ అధికారులను అడ్డుపెట్టుకుని చేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.

సొంత పార్టీలోనే ఇబ్బందులు

మాజీ అధ్యక్షుడు కై గాల రాంబాబు మాట్లాడుతూ అధికార టీడీపీలో ఉన్నా తమపై వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. ఎమ్మెల్యే తనను పదవి నుంచి తప్పుకోవాలని చెబితే, ఒప్పుకుని తప్పుకోవడం జరిగిందన్నారు. అయితే అధికారులు పథకం నిర్వహణ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారని, 4న తనకు నోటీసు ఇచ్చారని, తాను హాస్పిటల్‌కు వెళ్లి వచ్చే లోపు తాళాలు పగలగొట్టడం జరిగిందన్నారు. తనను సొంత పార్టీలోనే ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బల్లిపాడు టీడీపీ నాయకులు రాత్రీ పగలూ అక్కడ కాపలా కాస్తున్నారని, ఇదేం దౌర్జన్యమని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం వద్ద సమావేశం ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు తీసుకుని వారికి నచ్చిన వారిని అధ్యక్షుడిగా వేసుకోవాలన్నారు. సమావేశంలో కార్యదర్శి ఆత్కూరి రాంబాబు ఆయుకట్టు రైతులు పాల్గొన్నారు.

ఫ రెండు వర్గాల మధ్య పోరు

ఫ వేగేశ్వరపురంలో సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement