బడి బస్సు సీజ్
ముమ్మిడివరం: పాఠశాల బస్సులపై రవాణా శాఖాధికారులు జరిపిన దాడుల్లో నిబంధనలు పాటించని రెండు పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేసి రూ.33,200 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా శాఖాధికారి డి.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో బుధవారం వివిధ ప్రాంతాలలో రవాణా శాఖాధికారులు దాడులు నిర్వహించారు. అలాగే నిబంధనలు పాటించని ఒక బస్సును సీజ్ చేశామన్నారు. ఓవర్ లోడింగ్, అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై దృష్టి పెడుతున్నామని పట్టుబడిన డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎంవీఐ సురేష్‌కుమార్ కౌశిక్ పాల్గొన్నారు.
బంగారు, వెండి
ఆభరణాల చోరీ
నల్లజర్ల: మండలంలోని దూబచర్లలో పూరెల్ల పవన్‌కు చెందిన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోని బీరువా తాళాలు పగులగొట్టి అందులోని 7 కాసుల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంటి యజమాని పవన్ తనకు కొడుకు పుట్టిన ఆనందంలో తన అత్తవారింటికి ప్రకాశరావుపాలెం వెళ్లారు. ఇంటి పరసర ప్రాంతాల వారు తనకు ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పడంతో వచ్చి చూడగా చోరీ విషయం బయటపడినట్టు పవన్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాంబాబు, ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి కేసులో
మరొకరి అరెస్టు
గంగవరం: గంజాయి స్మగ్లింగ్, సరఫరా, ప్యాకింగ్, డబ్బుల పంపిణీ కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న లాకే సహదేవ్ అలియాస్ టైగర్ సాయిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేష్ బుధవారం తెలిపారు. స్టేషన్ పరిధిలో నమోదు చేసిన 187 కిలోల గంజాయి తరలింపు కేసులో సాయి పరారీలో ఉన్నాడన్నారు. ఒడిశాలోని చిత్రకుండ–జనబ గ్రామంలో ఉంటున్న లాకే సహదేవ్‌ది చింతపల్లి మండలం గడపరాయి గ్రామమని ఆయన తెలిపారు. అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి పర్యవేక్షణలో కేసు విచారించినట్టు ఎస్సై తెలిపారు. ఆధునిక పద్ధతులతో అతని కదలికలపై నిఘా ఉంచి అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. అతడు కిర్ల్లంపూడి స్టేషన్‌లో 80 కిలోల గంజాయి రవాణా కేసులో, గొలుగొండలో 193 కిలోల గంజాయి రవాణా కేసుల్లో కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
బడి బస్సు సీజ్
బడి బస్సు సీజ్


