గుండెపోటుతో డిప్యూటీ తహసీల్దార్ మృతి
దేవరపల్లి: గోపాలపురం మండలంలో సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న తాతపూడి దివాకర్ (45) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లో దివాకర్ సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వారు తెలిపారు. జిల్లాలోని దివాన్‌చెరువుకు చెందిన దివాకర్ మూడేళ్లుగా గోపాలపురం మండల సీఎస్ డీటీగా పనిచేస్తూ, తాళ్లపూడి మండల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. పని ఒత్తిడి వల్ల దివాకర్ గుండెపోటుకు గురైనట్టు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. రెండు మండలాల బాధ్యతలు అప్పగించడం వల్ల పని ఒత్తిడి ఎక్కువైనట్టు అంటున్నారు.


