విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బస్సు
నిడదవోలు: స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన సోమ వారం జరిగింది. నిడదవోలులోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి బస్సు పంగిడి వెళ్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా నిడదవోలు – చాగల్లు ప్రధాన రోడ్డులో ఆటోను తప్పించే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు క్లీనర్‌కు స్పల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పట్టణ ఎస్సై జయరాజు వచ్చి విచారణ చేపట్టారు. పట్టణ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తన టెక్నికల్ సిబ్బందితో వచ్చి విద్యుత్ లైన్లను పునరుద్ధరించారు.


