దారిలో జలదరింపు | - | Sakshi
Sakshi News home page

దారిలో జలదరింపు

Feb 10 2026 7:42 AM | Updated on Feb 10 2026 7:42 AM

దారిల

దారిలో జలదరింపు

వీఆర్‌పురం – చింతూరు మండలాల ప్రధాన రహదారిలో ఏజీకొడేరు, తిమ్మిరిగూడెం నడుమ జల్లివారిగూడెం వాగు ఉంది. ఇది ప్రవహించే ప్రాంతంలో రహదారిపై గతంలో లోలెవల్‌ చప్టా నిర్మించారు. ఈ చప్టాకు ఎగువభాగంలో భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీంతో ఎగువ ప్రాంతంలో ఎక్కడ వర్షం పడినా ఆ నీరు చప్టాపై నుంచి ప్రవహిస్తూ రాకపోకలు నిలిచిపోతున్నాయి. చప్టాకు ఎగువభాగంలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే నీరు చప్టా కింద నుంచి ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ఈ చప్టా కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

–చింతూరు

పడితే.. అటో.. ఇటో

పిఠాపురం మండలం భోగాపురంలో కల్వర్టుకు ఇరువైపులా రక్షణ గోడలు (రెయిలింగ్‌) లేక ప్రయాణం దినదిన గండంలా మారింది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా వెళ్తుంటాయి. శిథిలావస్థకు చేరిన ఈ కల్వర్టు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం అందరిలో నెలకొంది. కొత్తగా కల్వర్టు నిర్మించాలని, అప్పటి వరకూ కనీసం రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

–పిఠాపురం రూరల్‌

దారిలో జలదరింపు 
1
1/1

దారిలో జలదరింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement