గోపాలపురంలో 13న మెగా జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

గోపాలపురంలో 13న మెగా జాబ్‌ మేళా

Feb 12 2026 7:28 AM | Updated on Feb 12 2026 7:28 AM

గోపాల

గోపాలపురంలో 13న మెగా జాబ్‌ మేళా

సీటీఆర్‌ఐ: గోపాలపురంలోని శర్వాణి ఇంగ్లిషు మీడియం స్కూల్లో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వికాస, మానవతా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్‌మేళాకు సుమారు 20 ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌, ఐటీ, ఫార్మా, హెల్త్‌ కేర్‌, బ్యాంకింగ్‌ తదితర విభాగాల్లో సుమారు 1200 ఉద్యోగాలు భర్తీ చేస్తారన్నారు. ఆసక్తి కలిగిన వారందరూ ఆ రోజు ఉదయం 9 గంటలకు రావాలని కోరారు. కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.లచ్చారావు, వికాస జిల్లా మేనేజర్‌ బాబు, మానవత సంస్థ మండల అధ్యక్షుడు రాపాక ఫణి పాల్గొన్నారు.

మందపల్లి మహా గణపతికి

పంచలోహ కవచం

కపిలేశ్వరపురం (మండపేట): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మందపల్లిలోని శనైశ్చరస్వామి దేవాలయంలో కొలువైన మహా గణపతికి విజయవాడకు చెందిన వాసా పల్లపురాజు పంచలోహ కవచం చేయించారు. మండపేటకు చెందిన రామకృష్ణ బ్రాస్‌, సిల్వర్‌ వర్క్స్‌ శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్‌ చేతుల మీదుగా ఈ కవచం రూపుదిద్దుకుంది. దీన్ని గురువారం మందపల్లి ఆలయానికి తరలించనున్నట్టు దాతలు తెలిపారు.

గుండెపోటుతో

వైద్యుడి మృతి

నిడదవోలు: పట్టణంలోని అమ్మ హాస్పిటల్‌ వైద్యుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంవో అందే వీవీఎస్‌ తాతారావు (56) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తణుకులో విధులు ముగించుకుని నిడదవోలు ఇంటికి కారులో వస్తుండగా ఉండ్రాజవరం రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. కారును రోడ్డు పక్కగా ఆపగా స్థానికులు గమనించి బయటకు తీసి అంబులెన్సులో తణుకు తరలిస్తుండగానే కన్నుమూశారు. ఆయనకు భార్య లావణ్య, కుమార్తెలు చిట్టి ప్రణతి, ప్రవళ్లిక ఉన్నారు. తాతారావు తల్లి మొగల్తూరు వైఎస్సార్‌ సీపీ ఎంపీపీగా చేస్తున్నారు. తండ్రి భుజంగరావు వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన మృతికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌, వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్‌ నాయుడు తదితరులు సంతాపం తెలిపారు.

మహాలక్ష్మి ఆలయానికి

రూ.11.5 లక్షల విరాళాలు

పి.గన్నవరం: లంకల గన్నవరం గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం పలువురు గ్రామస్తులు రూ.11.5 లక్షల మేర విరాళాలు అందజేశారు. యర్రంశెట్టి అచ్యుత రామయ్య కుమారుడు రాజారావు రూ.3.01 లక్షలు, మొండెపులంక లాకు ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు రూ.2.25 లక్షలు, యర్రంశెట్టి రాజు (జొన్నలరాజు) రూ.2.06 లక్షలు, యర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులు రూ.1.6 లక్షలు, యర్రంశెట్టి చిన్న లోన వారి సేవా కమిటీ సభ్యులు రూ.1.01 లక్షలు, తాపీమేస్త్రి అంబటి దుర్గారావు రూ.50 వేలు, గన్నవరపు అప్పారావు కుటుంబ సభ్యులు రూ.21 వేలు, రామేశ్వరపు గోవిందరావు రూ.20 వేలు, యర్రంశెట్టి బులి వెంకయ్య కుటుంబ సభ్యులు రూ.20 వేలు, లంకే పాల్గుణ రూ.15 వేలు, ఇంకా పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.

గోపాలపురంలో  13న మెగా జాబ్‌ మేళా 1
1/2

గోపాలపురంలో 13న మెగా జాబ్‌ మేళా

గోపాలపురంలో  13న మెగా జాబ్‌ మేళా 2
2/2

గోపాలపురంలో 13న మెగా జాబ్‌ మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement