ట్రాఫిక్‌కు సినిమాతో కష్టాలు
సామర్లకోట: రద్దీగా ఉండే సెంటర్.. ఆపై సినిమాతో కష్టాలను పట్టణ ప్రజలు సోమవారం ఎదుర్కొన్నారు. సామర్లకోట మఠం సెంటర్‌లో సినిమా షూటింగ్ జరగడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ముఖ్యకూడలిలో సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. జీవిత, రాజశేఖర్, వారి కుమార్తె శివానీ నటిస్తున్న చిత్ర షూటింగ్ సామర్లకోట మఠం సెంటర్‌లో ప్రారంభించారు. ఇక్కడ అంబేడ్కర్ విగ్రహం, కూరగాయల మార్కెట్, బడ్డీలు ఏర్పాటు చేసి షూటింగ్ జరిపారు. తొలిరోజు రాజశేఖర్ కుమార్తె శివానీ, ఆలీలు కూరగాయల మార్కెట్‌కు వచ్చిన సన్నివేశం చిత్రీకరించారు. సామర్లకోట – పెద్దాపురం రోడ్డు ముఖ్య కూడలి కావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనికితోడు షూటింగ్ చూడడానికి వచ్చిన స్థానికులను సినిమా యూనిట్‌కు చెందిన బౌన్స్‌ర్లు దగ్గరకు రాకుండా గెంటి వేయడంతో వాదోపవాదాలు జరిగాయి. ఏదేమైనా ముఖ్య కూడలిలో సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ట్రాఫిక్‌కు సినిమాతో కష్టాలు


