భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు చనిపోయారు. అందుకోసం ఇప్పటీ నుంచి పుష్కర పనులు చేస్తున్నారు. కానీ శివరాత్రి రోజున కనీస ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం. వేలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా, హాని కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైనా, అధికారుల పైనా ఉంది.
– గారా చంటిబాబు, రాజమహేంద్రవరం
స్నానాలకు ఏర్పాట్లు చేయాలి
అనేక వేల మంది భక్తుల రాకతో గోదావరి తీరం నిండిపోతుంది. కనీసం స్నానాలు ఆచరించడానికై నా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఏ ఘాట్‌లో కూడా ఏర్పాట్లు కానరావడం లేదు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు పాటించి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
– వి.సత్తిబాబు రాజమహేంద్రవరం
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి


