తెలంగాణలో సంచలనం.. ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌ సస్పెన్షన్‌! | IAS Arvind Kumar Suspended In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో సంచలనం.. ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌ సస్పెన్షన్‌!

Feb 28 2026 8:58 AM | Updated on Feb 28 2026 10:05 AM

IAS Arvind Kumar Suspended In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

వివరాల మేరకు.. తెలంగాణలో ఇటీవలే ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. అనంతరం, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అర్వింద్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం.

ఇక, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ కొంతకాలం కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బీఎల్‌ఎన్‌ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement