మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం | Old Man Arrested For Molested Mentally Disabled Woman At Elkathurthy Mandal Of Hanumkonda, More Details Inside | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

Jan 12 2026 11:01 PM | Updated on Jan 13 2026 12:44 PM

Old Man Molested Mentally disabled woman at Elkathurthy mandal of Hanumkonda

సాక్షి, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో మానవత్వాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. ఓ మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడు పోలేపాక ప్రభాకర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.  

జరిగిన సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మానసిక వికలాంగురాలిపై ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement