మేజిక్‌బస్‌ ఇండియాతో కేయూ ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

మేజిక్‌బస్‌ ఇండియాతో కేయూ ఎంఓయూ

Feb 27 2026 4:05 AM | Updated on Feb 27 2026 4:05 AM

మేజిక్‌బస్‌ ఇండియాతో కేయూ ఎంఓయూ

మేజిక్‌బస్‌ ఇండియాతో కేయూ ఎంఓయూ

మేజిక్‌బస్‌ ఇండియాతో కేయూ ఎంఓయూ

కేయూ క్యాంపస్‌: ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మేజిక్‌బస్‌ ఇండియా ఫౌండేషన్‌తో కేయూ గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. సంవత్సరంపాటు ఉండే ఈ ఒప్పందంపై కేయూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, మేజిక్‌బస్‌ ఇండియా ఫౌండేషన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ శేఖరబాబు సంతకాలు చేశారు. ఎంఓయూతో వెనుకబడిన, ఆర్థికంగా బలహీనవర్గాల యువతకు నాణ్యమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ, కెరీర్‌ మార్గదర్శక, ఉపాధి ఆధారిత శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా జాబ్‌ ఓరియంటెడ్‌ ట్రైనింగ్‌, ప్లేస్‌మెంట్‌ కల్పించనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, కేయూ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ ఆఫైర్‌ డీన్‌ మామిడాల ఇస్తారి, వివిధ విభాగాల ఫ్రొఫెసర్లు ఎస్‌. జ్యోతి, ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్‌ టి.వెంకటరావు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ రాజేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement