breaking news
Hanamkonda District News
-
ఓటరు జాబితాపై జల్లెడ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేగం పుంజుకుంది. ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా అధికారులు జారీ చేసిన నోటీసుల పంపిణీ దాదాపు తుది దశకు చేరుకుంది. సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆరు జిల్లాల్లో కలిపి 6,45,763 నోటీసులు జారీ చేయగా.. 6,28,499 మంది ఓటర్లకు చేరాయి. మరోవైపు ఇప్పటివరకు 4,39,603 విచారణలు పూర్తయ్యాయి. అభ్యంతరాలు, దరఖాస్తులు, రికార్డుల పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నోటీసుల పంపిణీలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో జారీ చేసిన 32,636 నోటీసులనూ ఓటర్లకు అందజేశారు. అంటే నోటీసుల పంపిణీలో 100 శాతం పూర్తయింది. ఇందులో 32,458 విచారణలు పూర్తయ్యాయి. కేవలం 78 విచారణలు మాత్రమే గడువు దాటినవిగా నమోదయ్యాయి. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,94,395 నోటీసులు జారీ అయ్యాయి. వీటిలో 1,84,448 పంపిణీ కాగా.. ఇంకా 9,947 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 90,054 విచారణలు పూర్తయ్యాయి. 18,689 దరఖాస్తులను ధ్రువీకరించగా.. తుది ప్రచురణకు 81,460 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. హనుమకొండ జిల్లాలో 1,32,070 నోటీసులకు గాను 1,31,602 పంపిణీ చేశారు. కేవలం 468 నోటీసులు మాత్రమే పంపిణీ కావాల్సి ఉంది. జిల్లాలో 1,07,163 విచారణలు పూర్తయ్యాయి. 30,401 దరఖాస్తులను ధ్రువీకరించగా.. 95,637 రికార్డులు తుది ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. జనగామ జిల్లాలో 1,63,890 నోటీసులు జారీ చేసి 1,62,862 పంపిణీ చేశారు. ఇంకా 1,028 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 1,21,025 విచారణలు పూర్తయ్యాయి. గడువు దాటిన విచారణలు 42,063గా నమోదయ్యాయి. తుది ప్రచురణకు 1,10,661లు సిద్ధంగా ఉన్నాయి. మహబూబాబాద్‌లో 80,872 నోటీసులకు గాను 76,688 పంపిణీ అయ్యాయి. 60,687 విచారణలు పూర్తయ్యాయి. 56,678 ప్రతిపాదనలు తుది ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ములుగులో 41,900 నో టీసులకు గాను 40,263 పంపిణీ చేశారు. 28,216 విచారణలు పూర్తి కాగా.. 24,509లు తుది ప్రచురణకు సిద్ధమయ్యాయి. 6.28 లక్షల నోటీసులు.. 4.39 లక్షల విచారణలు పూర్తి తుది జాబితాకు 3.83 లక్షలు సిద్ధం నివేదిక విడుదల చేసిన అధికారులు -
ఎలుక కాటు ఆనవాళ్లు లేవు
పాలకుర్తి టౌన్ : మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 22న విద్యార్థినులను ఎలుకలు కరిచాయన్న ఘటనపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టతనిచ్చారు. సోమవారం ఆర్డీఓ కిరణ్ప్రకాశ్తో కలిసి గురుకులాన్ని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. భోజనం ఎలా ఉంది? మీకు ఎలుకలు కరిచినప్పుడు వాటిని చూశారా? టీకాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఏ సమయంలో జరిగింది.. అప్పుడు రక్తం వచ్చినట్లు అనిపించిందా.. నొప్పిగా ఏమైనా ఉందా అని వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల చేతులు, కాళ్లను పరిశీలించగా ఎలుకలు కరిచిన ఆనవాళ్లు, గీతలు లేవన్నారు. వదంతులు నమ్మొద్దని కలెక్టర్ సూచించారు. వంటశాల, భోజన గది, సరుకులు నిల్వ గది, మరుగుదొడ్లు, వసతి గృహాలను పరిశీలించారు. పరిసరాల శుభ్రతపై అసంతప్తి వ్యక్తం చేసి, పనికిరాని వ్యర్థాలను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. నాణ్యమైన పౌషికాహారం, తాజా కూరగాయలతో భోజనం తయారు చేయాలని సూచించారు. అనుమతి లేకుండా బయటి వ్యక్తులను బాలికల గురుకులంలోకి అనుమతించొద్దని స్పష్టం చేశారు. కలెక్టర్ తనిఖీ చేసే సమయంలో గురుకుల పాఠశాలలోకి వచ్చిన వార్డు సభ్యుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. ఎంపీడీఓ, తహసీల్దార్ గురుకుల పాఠశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, వైస్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా గురుకులంలో తనిఖీ..శుభ్రతపై అసంతృప్తి -
రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ చైర్మన్‌గా అశోక్
న్యూశాయంపేట : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్‌గా బేతి అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ వసంత సమక్షంలో ఎన్నిక జరిగింది. వైస్ చైర్మన్‌గా శానబోయిన రాజ్‌కుమార్, కోశాధికారిగా బొల్లం శివ, స్టేట్ ఎంసీ మెంబర్‌గా నాడెం శాంతికుమార్‌లతో పాటు సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్లుగా కుసుమ సత్యనారాయణ (రిటైర్డ్ తహసీల్దార్), తోట సంపత్‌కుమార్ (రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు), మండల పరుశరాములు(ఎన్జీఓ), మామిడాల రమేష్‌బాబు (అడ్వకేట్), వద్ది రాజు, చొప్పరి సోమయ్య, ముల్క ప్రసాద్, పుల్లూరి వేణు, డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి, మోతే తిరుపతిరెడ్డి, డాక్టర్ గజ్వెల్లి రాజ్‌కుమార్ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం సభ్యులు కలెక్టర్ సత్యశారదను మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఓటు హక్కుపై దాడిని సహించం
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ అర్బన్: ఓటు హక్కును హరించే ఏ ప్రయత్నాన్నైనా సహించబోమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ అంశంపై చేపడుతున్న పోరాటానికి మద్దతుగా సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని పాల్గొన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలంటే ప్రతీ దశ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, ఓటర్ల తొలగింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, దుద్దిళ్ల శ్రీనుబాబు, ఈవీ శ్రీనివాస్‌రావు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీని వాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పోచమ్మమైదాన్‌లో కాంగ్రెస్ శ్రేణుల నిరసన కాశిబుగ్గ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మానవహారం, నిరసన, సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ఎన్నికల వ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటుందన్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారదను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఓర్సు తిరుపతి, కర్నాటి పార్వతమ్మ, రవీందర్ నాయక్, చిలువేరు శ్రీనివాస్, దాడి శివ, ఎడ్ల రవికుమార్, పోశాల వెంకన్న పాల్గొన్నారు.పోచమ్మమైదాన్ సెంటర్లో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ సారయ్య, కుడా చైర్పర్సన్ సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు అయూబ్, నాయకులునిరసన ర్యాలీలో పాల్గొన్న ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, తదితరులు -
పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
● అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్ : అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టభద్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో నమోదుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. 2023 నవంబర్ 1 కంటే ముందు పట్టభద్రులైన, ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో స్థానిక నివాసం ఉన్న అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశం అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో నమోదుకు ఈ.వీ శ్రీనివాస్‌రావు ఫారం–18 ద్వారా తన వివరాలతో పూర్తి చేసిన దరఖాస్తును అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీఓ వెంకటేశ్‌కు అందించారు. సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్. వెంకన్న, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ.శ్రీనివాస్‌రావు, రావు అమరేందర్‌రెడ్డి, నాగబెల్లి రజనీకాంత్, ఎండీ నేహాల్, అంబాల ప్రశాంత్, బస్కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
టెర్మినల్ సహా కీలక నిర్మాణాలు
ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ పనుల్లో మరో అడుగు పడింది. ఇప్పటికే రూ.203.49 కోట్ల అంచనా వ్యయంతో రన్‌వే ఆధునికీకరణ, ట్యాక్సీ వేలు, విమానాల పార్కింగ్ ఆప్రాన్, టెర్మినల్‌కు అనుసంధాన రహదారులు, గ్రౌండ్ సపోర్ట్, పలు మౌలిక వసతుల పనులకు టెండర్లు పిలిచిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. తాజాగా మరో రూ.213.59 కోట్లతో నూతన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, ఫైర్‌స్టేషన్, ఈ అండ్ ఎం వర్క్‌షాప్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఈమొత్తం పనులను 18 నెలల వ్యవధిలో పూర్తి చేసేలా ఏఏఐ గడువు నిర్దేశించింది. దీంతో ఎయిర్‌పోర్టు పనులు మరో కీలక దశలోకి చేరాయి. నవంబర్ 3వరకు బిడ్ల దాఖలు ఈ ప్యాకేజీకి అక్టోబర్ 6 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. నవంబర్ 9న టెక్నికల్ బిడ్లను, నవంబర్ 30న ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నట్లు ఏఏఐ అఽధికారులు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికై న సంస్థకు పనులు అప్పగించి, నిర్ణీత వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఎయిర్పోర్ట్ సందర్శన మామునూరు విమానాశ్రయాన్ని సోమవారం టెండర్‌దారులతో కలిసి ఏఏఐ ఆధికారులు సందర్శించారు. పాత రన్‌వేతోపాటు ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన ప్రీ–బిడ్ సమావేశంలో రూ.213.59 కోట్ల ప్యాకేజీతో చేపట్టనున్న నిర్మాణాలు, సాంకేతిక అంశాలు, టెండర్ నిబంధనలపై టెండర్‌దారులకు అధికారులు వివరించారు. టెండర్‌దారుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏఐ ఏజీఎం నాగరాజు, తహసీల్దార్ ఇక్బాల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.ఎయిర్పోర్ట్ పనుల్లో మరో అడుగు తాజాగా రూ.213.59 కోట్లతో టెండర్లకు ఆహ్వానం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన ఏఏఐ అధికారులు, టెండర్‌దారులు -
అసలు పోరు వారిద్దరి మధ్యే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అక్టోబర్ 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 26న ఎన్నికల గుర్తులు కేటా యించడంతో ప్రచారంలో మరింత జోష్ వ చ్చింది. షెడ్యూల్‌కు ముందే ప్రధాన యూని యన్లు రీజియన్ స్థాయిలో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి కార్మికులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. వరంగల్ రీజియన్‌లోని 9 ఆర్టీసీ డిపోలతోపాటు రీజినల్ మేనేజర్ కార్యాలయం, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. కార్మికశాఖ ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేసి ఈనెల 25వరకు అభ్యంతరాల ను స్వీకరించింది. ఓటరు జాబితాను త్వరలోప్రకటించనుంది. మంగళవారం (నేడు) నమూనా బ్యాలెట్‌ను కార్మికశాఖ జారీ చేయనుంది. 12 యూనియన్లు.. రెండు కూటములు గుర్తింపు ఎన్నికల బరిలో మొత్తం 12 యూనియన్లు ఉన్నాయి. అయితే ప్రధానంగా రెండు కూటముల మధ్యే పోటీ నెలకొంది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (అశ్వత్థామరెడ్డి వర్గం), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఒక కూటమిగా బరిలో ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ–థామస్‌రెడ్డి వర్గం) మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. పొత్తుల ప్రకారం ఎస్‌డబ్ల్యూఎఫ్ ఖమ్మం, నల్లగొండ రీజియన్లలో పోటీ చేస్తుండగా.. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ వరంగల్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర రీజియన్లు, అనుబంధ వర్క్‌షాపులు, రాష్ట్రస్థాయిలో పోటీ చేస్తోంది. మరో కూటమిలో ఎన్ఎంయూ వరంగల్ రీజియన్‌లో పోటీ చేస్తుండగా.. మిగతా రీజియన్లలో టీఎంయూ బరిలో ఉంది. క్లాస్–3 రాష్ట్రస్థాయి పోటీలో ఎంప్లాయీస్ యూనియన్ పోటీ చేస్తోంది. రాష్ట్ర, రీజియన్‌స్థాయి.. రెండు ఓట్లు గుర్తింపు ఎన్నికల్లో ప్రతీ కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాస్–3లో రాష్ట్రస్థాయికి, క్లాస్–6లో రీజియన్ స్థాయికి ఓటు వేయనున్నా రు. దీంతో రాష్ట్రస్థాయి కూటముల ప్రచారంతో పాటు వరంగల్ రీజియన్‌లో స్థానిక యూని యన్ల ప్రచారం కూడా జోరందుకుంది.ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో హోరాహోరీ పోరు ‘విల్లు–బాణం’ ‘కాగడ’ మధ్యే సవాల్ బరిలో 12 యూనియన్లు.. రెండు కూటములు.. నేడు నమూనా బ్యాలెట్‌ను జారీ చేయనున్న కార్మికశాఖ.. వరంగల్ రీజియన్‌లో క్లాస్–6కు ప్రధాన పోటీ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఎన్ఎంయూ మధ్యే కనిపిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ‘విల్లు–బాణం’ గుర్తుతో, ఎన్ఎంయూ ‘కాగడ’ గుర్తుతో బరిలో ఉన్నాయి. దీంతో వరంగల్ రీజియన్‌లో ఈ రెండు యూనియన్లు కార్మికులను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు టీపీసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల సమన్వయం కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌ను ఇన్చార్జ్గా నియమించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర యూనియన్లను ప్రోత్సహించకుండా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు సహకరించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
నిర్వహణ లేమి?
ఇది వరంగల్ ప్రతాప్‌నగర్‌లోని కమ్యూనిటీ టాయిలెట్. నిర్వాహకుడికి ఆరు నెలలుగా సొమ్ము చెల్లించకపోవడంతో ఐదు నెలల పాటు కొనసాగించి, వేసిగి వేసారి, చివరికి తాజాగా టాయిలెట్‌కు తాళం వేశారు. ఇలా.. నగరంలోని రూ.లక్షలు పోసి నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు పనికి రాకుండా ప్రజలు వినియోగించుకోక దారుణమైన పరిస్థితులు దాపురించాయి. బల్దియా అధికారులు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయి నిర్వహణకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు.ఈఫొటోలో కనిపిస్తున్నది వరంగల్ పోచమ్మమైదాన్‌లోని కమ్యూనిటీ టాయిలెట్. ఏడాదిన్నరగా ఉపయోగంలో లేదు. బల్దియా బిల్లు ఇవ్వడం లేదని నిర్వహణ వదిలేశారు. దీంతో టాయిలెట్ అధ్వానంగా మారింది. సమీపంలోని మురికివాడ ప్రజలు మల, మూత్ర విసర్జనకు ఖాళీ స్థలాలకు వెళ్తున్నారు.నగరంలో అధ్వానంగా కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్స్ -
విద్యావ్యవస్థ కాషాయీకరణకు కుట్ర
కేయూ క్యాంపస్ : దేశంలో విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేసేందుకు పాలక వర్గాలు కుట్రలు చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సోమవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవం సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సాంబశివరావు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించి 90ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న ఏఐఎస్ఎఫ్ భగత్‌సింగ్ వారసత్వంతోనే ఆవిర్భవించిందన్నారు. నాటి ప్రధానులు నెహ్రూ, అటల్జీ వంటి వారు కూడా ఈ సంఘంలో పనిచేశారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో కాషాయీకరణను చొప్పిస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఒకప్పుడు విద్యాసంస్థల్లో ఎన్నికలు ఉండేవని, నాటి ఆర్ఈసీ తదితర సంస్థల్లో ఎంతోమంది విప్లవ నాయకులు ఎదిగి సమాజానికి సేవలను అందించారన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగి రాజన్ మాట్లాడుతూ.. దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను మార్చే శక్తి విద్యార్థులకు ఉందని పేర్కొన్నారు. ఈ సభలో ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ ఇన్చార్జ్ రెహమాన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి ప్రణీత్‌గౌడ్, కార్యదర్శి భాషబోయిన సంతోష, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్దసారథి, కార్యదర్శి లాదెళ్ల శరత్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన.. ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్ నుంచి వివిధ కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కేయూ ఆడిటోరియం కిక్కిరిసి పోయింది. ఈ సభలో ప్రజానాట్య మండలి కళాకారులు పాటలతో ఆకట్టుకున్నారు. పాట సీడీ ఆవిష్కరణ ఏఐఎస్ఎఫ్ 90 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా జాతీయ మాజీ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు రచించిన పాట సీడీని ఎమ్మెల్యే సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ పాటను ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాబృందం గానం చేసింది. సాంబశివరావును ఏఐఎస్ఎఫ్ జాతీయ, రాష్ట్ర నాయకులు సన్మానించారు. మంగళ, బుధవారాల్లో బాలవికాసలో ప్రతినిధుల సభ జరగనుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేయూలో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ బహిరంగ సభ -
తొలి సెమిస్టర్ రాయకముందే.. రెండో సెమిస్టర్ హాల్‌టికెట్లు!
సాక్షి, వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (ఎస్డీఎల్సీఈ) పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొంది. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్ష రాయకముందే రెండో సెమిస్టర్ పరీక్షకు హాల్‌టికెట్లు జారీ కావడం విద్యార్థుల్లో అయోమయానికి దారితీసింది. 356 మంది విద్యార్థులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఎస్డీఎల్సీఈ విభాగం నుంచి ఎగ్జామినేషన్ విభాగానికి పంపిన జాబితాలోనే తప్పులు ఉండడంతో యథావిధిగా కేయూ వెబ్సైట్లో అప్లోడ్ చేశారనే విమర్శలున్నాయి. ఆయా విద్యార్థులకు జారీ చేసిన హాల్‌టికెట్లపై ‘యూజీ టు సెమిస్టర్ (ఆర్ఈజీ) ఎగ్జామినేషన్స్, సెప్టెంబర్ 2026’ అని స్పష్టంగా ముద్రించి ఆరు సబ్జెక్టులను హాల్‌టికెట్‌లో పొందుపర్చారు. సంబంధిత విద్యార్థులు ఇంకా మొదటి సెమిస్టర్ పరీక్ష రాయలేదని చెబుతున్నారు. డిసెంబర్లో తొలి సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉండగా.. అప్పుడే పరీక్షలంటూ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ విద్యార్థులకు కేయూనుంచి ఎస్ఎంఎస్లు రావడంతో చాలామంది విద్యార్థులు ఖంగుతిన్నారు. దూరవిద్యలో చదువుతున్న ఈ విద్యార్థులు ఇప్పుడు ఆయా సెంటర్లకు వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఇలా ఎస్డీఎల్సీఈ, పరీక్షల విభాగం సమన్వయ లోపంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని వర్సిటీ వర్గాలే అంటుండడం గమనార్హం. పొరపాటుపై చర్యలుండాల్సిందే.. సెమిస్టర్ విధానంలో మొదటి సెమిస్టర్ అనంతరం రెండో సెమిస్టర్ వస్తుంది. అలాంటప్పుడు తొలి సెమిస్టర్ పరీక్షకే హాజరుకాని విద్యార్థులకు రెండో సెమిస్టర్ హాల్‌టికెట్ ఎలా జారీ అయిందన్నది ప్రశ్నగా మారింది. విద్యార్థి డాటా నమోదు సమయంలో పొరపాటు జరిగిందా? పరీక్ష దరఖాస్తులో సెమిస్టర్ తప్పుగా నమోదైందా? లేక హాల్‌టికెట్ల జనరేషన్లో సాంకేతిక లోపం తలెత్తిందా? అన్న ప్రశ్నలను వర్సిటీ పరీక్ష విభాగాధికారుల వద్ద ప్రస్తావిస్తే ఎస్డీఎల్సీఈ నుంచి వచ్చిన డాటానే అప్లోడ్ చేశామనే సమాధానం చెబుతున్నారు. హాల్‌టికెట్ విద్యార్థి ఏ కోర్సు, ఏ సెమిస్టర్, ఏ సబ్జెక్టులకు పరీక్ష రాయాలో నిర్ధారించే కీలక పత్రం. అందులోనే తప్పులు దొర్లితే పరీక్ష సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా దూరవిద్య విద్యార్థులు పరీక్షల షెడ్యూల్, హాల్‌టికెట్లపైనే ఆధారపడుతుండడంతో ఇలాంటి గందరగోళం మరింత ప్రభావం చూపుతుంది. దిద్దుబాటు చర్యలు తీసుకుని ఆయా విద్యార్థులకు మళ్లీ సమాచారం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని విద్యార్థులు కోరుతున్నారు. తప్పుడు హాల్‌టికెట్లు వాస్తవమే.. దూరవిద్యా విధానంలో డిగ్రీ కోర్సులో తొలి సంవత్సరం చదువుతున్న 356 మంది విద్యార్థులకు జారీ అయిన హాల్ టికెట్లు రెండో సెమిస్టర్ ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఎస్డీఎల్సీఈ నుంచి వచ్చిన డాటా ఆధారంగానే వర్సిటీ వెబ్సైట్లో హాల్‌టికెట్లు అప్లోడ్ చేసి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలంటూ వారి సెల్‌ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లు వెళ్లాయి. వీరికి తొలి సెమిస్టర్ పరీక్షలు డి సెంబర్‌లో జరుగుతాయి. ఒకవేళ ఆయా హాల్‌టికె ట్లు తీసుకొని పరీక్షకేంద్రాలకు వెళ్లినా.. అనుమతించరు. ఆన్లైన్లో రెండో సెమిస్టర్ హాల్‌టికెట్లు అందుబాటులో లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – కట్ల రాజేందర్, కేయూ పరీక్షల నియంత్రణ విభాగాధికారి కేయూ ఎస్డీఎల్సీఈ పరీక్షల విభాగం తీరుపై విమర్శలు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ విద్యార్థులకు ఎస్ఎంఎస్లు అధికారులకు ఫిర్యాదు చేయడంతో లోపాలు వెలుగులోకి.. -
సమస్యలు పరిష్కరించరా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరంలోని కాలనీల్లో సమస్యలు పరిష్కరించరా? అంటూ బల్దియా గ్రీవెన్స్‌లో కమిషనర్ టి.వెంకన్న ఎదుట నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వెంకన్న దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 92 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు 36, ఇంజనీరింగ్‌కు 34, ఆరోగ్యం, పారిశుద్ధ్యం 9, రెవెన్యూ విభాగానికి 11, నీటి సరఫరా 2 చొప్పున నమోదయ్యాయి. ప్రతీ అర్జీని బాధ్యతతో పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డీఎఫ్ఓ శంకర్లింగం, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● గిర్మాజీపేట లక్ష్మీ అపార్ట్‌మెంట్‌కు డ్రెయినేజీ నిర్మించాలని ఫ్లాట్స్ యజమానులు ఫిర్యాదు అందించారు. ● 19వ డివిజన్ వివేకానంద కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని శ్రవణ్‌కుమార్ కోరారు. ● వరంగల్ ఉర్సులో ‘కుడా’ లేఔట్ ప్లాట్ ఆక్రమణకు గురైందని ఫిర్యాదు అందింది. ● జానీపీరీల అండర్ బ్రిడ్జికి రెండు వైపులా రోడ్లను నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● 12వ డివిజన్ పెరుకవాడలో 2నెలలుగా తాగునీటి సరఫరా బంద్ ఉందని, సరఫరా పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరారు. ● 64వ డివిజన్ టేకులగుడెంలో మట్టి రోడ్డు అయినా వేయాలని గ్రామస్తులు విన్నవించారు. ● భీమారం, కోమటిపల్లి, గోపాల్‌పూర్‌లో ఏడాది క్రితం టెండర్లు పూర్తయినా పనులు చేపటట్లేదని మాజీ కార్పొరేటర్ రజిత ఫిర్యాదు చేశారు. గ్రేటర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుదారుల ఆవేదన 92 అర్జీలు స్వీకరించిన అధికారులు -
చేనేత ఉత్పత్తులను ఆదరించండి
పోలీస్ కమిషనర్ శ్వేత కాశిబుగ్గ: ‘చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు బాగుంటాయి. అవి నాకెంతో ఇష్టం. చేనేత ఉత్పత్తులను అందరూ ఆదరించాలి’ అని పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. చేనేతపై అభిమానంతో సీపీ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కొత్తవాడ వెళ్లి నేత ఉత్పత్తులు కొన్నారు. ఎలాంటి పోలీసు బందోబస్తు లేకుండా సాదాసీదాగా కుటుంబ సభ్యులతో కలిసి సీపీ కొత్తవాడ మగ్గాలను సందర్శించారు. మగ్గాల పనితీరు, కార్మికుల ప్రతిభను చూశారు. భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన కొత్తవాడ కార్పెట్లను పరిశీలించి, తయారు చేసే విధానం తెలుసుకున్నారు. ఉద్యోగ విరమణ రోజున టవల్స్ కప్పి, పూజా మ్యాట్ ఇచ్చి చేనేతను ప్రోత్సహించాలని సీపీ పిలుపునిచ్చారు. సీపీ శ్వేతను చేనేత సంఘాల ప్రతినిధులు చిప్ప వెంకటేశ్వర్లు, అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, యెలుగం సాంబయ్య, జగన్, ఓం ప్రకాశ్ సన్మానించారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలు సోమవారం భట్టుపల్లిలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మైదానంలో జరిగాయి. పోటీల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సరితరెడ్డి, సీఐ రంజిత్ కుమార్, రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పిల్లి సాంబశివరావు, పెరుమాండ్ల సాంబమూర్తి, పీడీలు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో (సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ) వివిధ పరీక్షలు ఇటీవల వాయిదా వేశారు. ఆయా పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ సోమవారం టైంటేబుల్ విడుదల చేశారు. దూరవిద్య పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 7న నిర్వహించనున్నారు. డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షలు 8న, డిగ్రీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలు 9న నిర్వహించనున్నారు. దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు, డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పరీక్షలు అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. దూరవిద్య పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు 7న, దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు 9వ తేదీన నిర్వహిస్తారు. ఎల్ఎల్బీ పరీక్షలు ఇలా.. కేయూ ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు నాలుగో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 6న, మూడేళ్ల హానర్స్ రెండో సెమిస్టర్ పరీక్షలు 9న నిర్వహిస్తారని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 6న, ఎల్ఎల్బి ఐదేళ్ల కోర్సు ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. న్యూశాయంపేట: ఆరోగ్య పరీక్షలు పూర్తిచేసుకున్న హజ్ యాత్రికులకు హనుమకొండ కాపువాడలోని హుమా నర్సింగ్‌హోంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సర్టిఫికెట్ల్లు పంపిణీ చేస్తున్నట్లు అంజుమనే హుజాజ్ హనుమకొండ అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కాజీపేట అర్బన్: ప్రభుత్వ భుములకు హద్దులు ఏర్పాటు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కాజీపేట మండలం మడికొండలో క్రిస్టియన్, ముస్లిం మతస్తులకు శ్మశానవాటిక కేటాయింపునకు ప్రతిపాదించిన స్ధలాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. శ్మశానవాటిక కేటాయింపు ప్రతిపాదనలను సమర్పించాలని ఆర్టీఓ వెంకటేశ్, తహసీల్దార్ రాజును ఆదేశించారు. భట్టుపల్లిలో.. కాజీపేట మండలం భట్టుపల్లిలో సోమవారం ఆర్డీఓ వెంకటేశ్, కాజీపేట తహసీల్దార్ రాజు గ్రామంలోని మైసమ్మ కట్ట నుంచి సబ్‌స్టేషన్ వ రకు భూముల రీసర్వే నిర్వహించారు. ఆర్ఐ కృష్ణ, సర్వేయర్ స్టాలిన్, జీపీఓ సంధ్య, లైసెన్స్డ్ సర్వేయర్ ప్రశాంత్ పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
● సెంట్రల్ జోన్ డీసీపీ కవిత కాశిబుగ్గ : ప్రజలకు మెరుగైన, మర్యాదపూర్వకమైన సేవలు అందిస్తూ ఫిర్యాదులపై సత్వర పరిష్కారం చూపాలని సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత తెలిపారు. సోమవారం మట్టెవాడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పని తీరు, పెండింగ్ కేసులు, శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ..ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, సమర్థవంతమైన సిటిజన్, సెంట్రిక్ పోలీసింగ్ అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ కరుణాకర్‌రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నేరాల అదుపులో భాగస్వాములు కావాలి : ఏసీపీ సదయ్య నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో నేరాలను అదుపు చేయడానికి అందరూ భాగస్వాములు కావాలని క్రైం ఏసీపీ సదయ్య అన్నారు. సోమవారం వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమ్మాయిలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త కలిగి, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే సీపీ (87126 85257), సీఐ (87126 85142), ఎస్సై(87126 85270) నంబర్లకు వాట్సాప్ చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచి, నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చందర్, ఫ్యాకల్టీ, షీ టీమ్ ఎస్సై స్వాతి పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిసారించాలి
● జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: కాశిబుగ్గ, కాజీపేట సర్కిళ్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగయ్యేందుకు రోజువారీగా డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు ఆయన పలు సూచనలిచ్చారు. నగర పరిశుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, తమ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తి బాధ్యత వహించాలని ఉప కమిషనర్లను ఆయన ఆదేశించారు. పండుగలకు ఏర్పాట్లు చేయండి బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా సమావేశాల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, అదనపు కమిషనర్ జోన, ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న కళాకృతులు స్వచ్ఛత హీ సేవా–26 కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం నిర్వహించిన ‘వేస్ట్ టు ఆర్ట్’ (వ్యర్థాల నుంచి కళాత్మక వస్తువుల రూపకల్పన) పోటీల్లో విద్యార్థులు రూపొందించిన సజనాత్మక కళాకృతులు ఆకట్టుకున్నాయి. -
గురుకులాల్లో భద్రతకు ప్రాధాన్యం
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాసంస్థల నిర్వహణ, వసతులపై సమీక్షించారు. ఫుడ్‌పాయిజన్, ఎలుకలు, పాముకాటు ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్, హనుమకొండ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థలను కలెక్టర్లు క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు బి.శేషాద్రి, వైవీ గణేశ్, శిక్షణ కలెక్టర్ రోహిత్ నేత, డీఈఓలు గిరిరాజ్ గౌడ్, రంగయ్యనాయుడు, సంక్షేమ శాఖల, రెసిడెన్షియల్ విద్యాసంస్థల పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 11 నుంచి ఓపెన్ పరీక్షలు కాళోజీ సెంటర్: తెలంగాణ ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ సదానందం తెలిపారు. పరీక్షల హాల్‌టికెట్లు సెప్టెంబర్ 26 నుంచి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. తెలంగాణ ఓపెన్‌స్కూల్.ఓఆర్జీలో అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతీ అభ్యర్థి హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి హన్మకొండ చౌరస్తా : విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం హనుమకొండలోని సుధానగర్‌లో చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తె తిగుల్ల యమున కథనం ప్రకారం.. సుధానగర్‌కు చెందిన రుద్రారం లక్ష్మి (58) స్నానం చేసేందుకు వేడి నీటి కోసం బకెట్లో హీటర్ పెట్టింది. నీరు వేడైనా తర్వాత హీటర్‌ను తీసివేసే క్రమంలో చేయి తగిలి విద్యుత్ షాక్ గురైంది. గమనించిన కూతురు స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందింది. యమున ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్పై ప్రమాదం.. కాజీపేట అర్బన్ : మడికొండ ఓఆర్ఆర్ ఎల్కుర్తి క్రాస్ వద్ద సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ట్రాలీ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మడికొండ ఎస్సై రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. కాజీపేట మండలం మడికొండకు చెందిన దువ్వ శ్రీనివాస్ (50) ట్రాలీ ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ట్రాలీ ఆటోలో పెద్దపెండ్యాల వద్ద సిమెంట్ అన్లోడ్ చేసి ఓఆర్ఆర్ మీదుగా మడికొండకు వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టి వెళ్లిపోగా సంఘటన స్ధలంలోనే శ్రీనివాస్ మృతి చెందాడు. మృతదేహాన్ని టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల తగ్గింపుతో ప్రమాదం ● బస్సు దిగుతూ ప్రమాదానికి గురైన మహిళ హన్మకొండ : ఎక్స్‌ప్రెస్ బస్సుల తగ్గింపు ప్రమాదాలకు దారి తీస్తుంది. హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్‌తో పాటు పలు ప్రధాన రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సులు చాలా వరకు తగ్గించింది. దీంతో వచ్చిన బస్సు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన అత్తకోడలు చుక్క నిర్మల, గౌతమి హైదరాబాద్ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కారు. సీటు దొరక్కపోవడంతో పాటు నిలబడేందుకు కాలు పెట్టే స్థలం లేకపోవడంతో నిర్మల బస్సు దిగుతుండగా బస్సు కదలడంతో కింద పడిపోయింది. ఆమె ఎడమ కాలుపై నుంచి టైరు వెళ్లడంతో కా లు నుజ్జునుజ్జయింది. వెంటనే చికిత్స కోసం 108లో ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. కాగా నిర్మల భర్త శ్రీనివాస్, కుమారుడు వెంకటేశ్ మాట్లాడుతూ..ఈ ప్రమాదానికి ఆర్టీసీ పూర్తి బాధ్యత వహించాలని, వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. -
గ్రాడ్యుయేట్ ఓటరుగా
నమోదు చేసుకోవాలిహన్మకొండ : ఉమ్మడి నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన ఓటరు నమోదు ప్రక్రియను అర్హత ఉన్న పట్టభద్రులు వినియోగించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి సోమవారం విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6వ తేదీతో ముగియనుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఇది కేవలం ఓటరు నమోదు ప్రక్రియ మాత్రమే కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక ఆయుధం.. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక అస్త్రం.. డిమాండ్లను సాధించుకోవడానికి ఒక అవకాశం.. మన కోసం పోరాడే వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో మద్దతు తెలియజేయడానికి ఒక మార్గం అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీని కలిసిన అదనపు కమాండెంట్ హసన్‌పర్తి: హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ నుంచి మామునూరు టీజీఎస్పీ –4వ బెటాలియన్ అదనపు కమాండెంట్‌గా బదిలీపై వచ్చిన వంశీమోహన్‌రెడ్డి సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా భగవద్గీత గ్రంథాన్ని అందజేశారు. అదేవిధంగా ఎంజీఎంలో భద్రతా చర్యలపై సమీక్షలో పాల్గొన్న ఎస్పీఎఫ్ కమాండెంట్ కమాండెంట్ కోటేశ్వర్రావు మర్యాదపూర్వకంగా సీపీని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
విజయవంతం చేయాలి
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో బుధవారం చేపట్టనున్న డివిజనల్ లోకో సమ్మెట్‌ను విజయవంతం చేయాలని సంఘ్ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటనారాయణ, అవారి మధుసూదన్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం కాజీపేట అన్ని బ్రాంచ్‌ల సంఘ్ నాయకులు, ఆఫీస్ బేరర్లు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. సికింద్రాబాద్ డివిజన్ స్థాయిలో లోకో రన్నింగ్ స్టాప్ సమస్యలను తెలుసుకోవడానికి ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.రాఘవయ్య కాజీపేటకు రానున్నట్లు తెలిపారు. తరగతులు కావడం లేదని.. ● ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల ఆందోళన కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీ విద్యార్థులు తమకు క్లాస్‌లు సరిగా జరగడం లేదని నిరసిస్తూ సోమవారం యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ కూడా సక్రమంగా తరగతులు జరిగేలా తగిన చర్యలు చేపట్టడం లేదని రిజిస్ట్రార్ వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఆందోళన చేస్తున్న బీపీఈడీ విద్యార్థులు రిజిస్ట్రార్ చాంబర్‌కు రాగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యను వీసీ ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. అక్కడికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్‌ను కూడా పిలిపించి మాట్లాడారు. ఈ విషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో రెగ్యులర్ అధ్యాపకులు లేరని ప్రస్తుతం నలుగురు అధ్యాపకులే పని చేస్తున్నారని తెలిపారు. 8 మంది అధ్యాపకుల అవసరం ఉందని అధ్యాపకుల కొరతతో బీపీఈడీ విద్యార్థులకు తరగతులు జరగడం లేదని రామచంద్రం వివరణ ఇచ్చారు.గత విద్యా సంవత్సరంలో పేపర్ వైజ్‌గా తాత్కాలిక అధ్యాపకులు విధులు నిర్వర్తించారని వారిని ప్రస్తుతానికి విధుల్లోకి తీసుకొని ఈనెల 29నుంచి బీపీఈడీ విద్యార్థులకు తరగతులు యథావిధిగా నిర్వహిస్తామని విద్యార్థులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారని రిజిస్ట్రార్ వివరణ ఇచ్చారు. వివిధ కారణాలతో ఆ కాలేజీకి సంబంధించి పార్ట్‌టైం అధ్యాపకుల నియమకాలు జరగలేదన్నారు. -
నగరంలో ఉల్లాస్ పరీక్షకు విశేష స్పందన
● పరీక్ష రాసిన 3,700 మంది మహిళలువరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు ట్రైసిటీలోని 3,700 మంది మహిళలు హాజరయ్యారు. నగరంలోని కొత్తవాడ, గిర్మాజీపేట, కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యతో కలిసి వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో 47 కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.. పరీక్షలకు హాజరైన మహిళలతో మాట్లాడి, కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, హాజరు, పరీక్ష నిర్వహణ విధానం తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైవీ.గణేశ్ మాట్లాడుతూ.. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అక్షరాస్యతతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసం, అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉల్లాస్ ఇన్చార్జ్ అధికారి నాగేశ్వర్రావు, డీఎంసీలు రేణుక, రజిత టీఎంసీ రమేశ్ ఆర్పీలు, సీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపు
కేయూ క్యాంపస్: కేంద్ర ఎన్నికల సంఘం సర్ పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తోందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగరాజన్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ కేంద్రం కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. కేయూలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో విద్యారంగాన్ని కాషాయీకరణ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. హనుమకొండలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ 90 వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్షికోత్సవాల్లో విద్యారంగ సమస్యపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా ముమ్మాటికీ విద్యార్థుల పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధులు తగ్గిస్తున్నారని, దేశంలోకి ప్రైవేట్ యూనివర్సిటీలు అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ కోసం పోరాడిన ఏకై క విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్ అని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించగా, ఇప్పటి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బానోతు రఘురావు, రహమాన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్‌గౌడ్, కార్యదర్శి భాషబోయిన సంతోష్, వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదెల్ల శరత్, నాయకులు వినయ్, భాను తదితరులు పాల్గొన్నారు. విద్యారంగం కాషాయీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగరాజన్ -
లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిస్వార్థంగా పోరాడిన మహా నీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్ర పటానికి సీఎండీ, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కోసం బాపూజీ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన త్యాగం, నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకనుగుణంగా రాష్ట్ర ప్రగతికి ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు వెంకటరమణ, మల్లికార్జున్, నాగప్రసాద్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు కళాధర్ రెడ్డి, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాకతీయ వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
ఖిలా వరంగల్: కాకతీయుల చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరై కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీఓలు ఉమారాణి, సుమ, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, పర్యాటకశాఖ ఇన్చార్జ్ అనిల్, గజ్జల శ్యామ్, దామోదర్, కోట గైడ్ రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం -
సమష్టి కృషితోనే అభివృద్ధి
సభ్యుల సమష్టి కృషి, క్రమశిక్షణ, అంకితభావం, నమ్మకంతోనే ముల్కనూరు సొసైటీ ఇంతటి అభివృద్ధి సాధించింది. రైతుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. రైతుకు విత్తనం నుంచి పంట మార్కెటింగ్ వరకు అన్ని దశల్లో అండగా ఉండేలా సేవలను విస్తరిస్తున్నాం. భవిష్యత్‌లోనూ రైతు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథ రెడ్డి కలలుగన్న రైతే రాజు నానుడిని నిజం చేస్తున్నాం. – అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు -
మైనార్టీల హక్కుల పరిరక్షణకు ఐక్యపోరాటాలు
న్యూశాయంపేట : రాష్ట్రంలో మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతి కోసం ఐక్యపోరాటాలే శరణ్యమని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ వాహబ్ అన్నారు. ఆదివారం హనుమకొండ ములుగు రోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్లో హక్కుల పోరాట సమితి హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు మహ్మద్ మోహిబుద్దీన్, మహ్మద్ హామీద్ షరీఫ్‌ల అధ్యక్షతన ‘మైనార్టీల ప్రధాన సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో విడుదల చేసి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా మహ్మద్ అబ్దుల్ ఖలీఖ్ తన్వీర్, గ్రేటర్ వరంగల్ సిటీ అధ్యక్షుడిగా మహ్మద్ ఖాదర్‌వలీతో పాటు మరో 21మంది కోచైర్మన్లతో కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ మసూద్, డాక్టర్ రాజ్‌మహ్మద్, సిరాజ్ అహ్మద్, తాజుద్దీన్, నయీముద్దీన్, మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్ వరంగల్ ఉమ్మడి జిల్లా జేఏసీ ఎన్నిక -
ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్– 14, 16, 18, 20 బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 1,500 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 220 ఈవెంట్లు నిర్వహించినట్లు వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఊర యుగేంధర్‌రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశం కోసం అథ్లెట్లు వారి ప్రతిభకు పదును పెట్టారు. నువ్వానేనా అన్నట్లు పోటీపడగా 111 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. బాలికల విభాగం.. అండర్–14 విభాగంలో 15 పాయింట్లతో హనుమకొండ అథ్లెట్లు, అండర్–16 విభాగంలో 27 పాయింట్లతో హైదరాబాద్, అండర్–18 విభాగంలో 22 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం, అండర్–20లో 28 పాయింట్లతో భద్రాద్రి జిల్లా అథ్లెట్లు విజేతలుగా నిలిచారు. కాగా, సీనియర్ ఉమెన్ కేటగిరీలో 18 పాయింట్లతో ఖమ్మం జిల్లా అథ్లెట్లు విజేత ట్రోఫీని అందుకున్నారు. బాలుర విభాగం.. అండర్–14 విభాగంలో 11 పాయింట్లతో ఆదిలాబాద్, అండర్–16 విభాగంలో 10 పాయింట్లతో హనుమకొండ, అండర్–18లో 20 పాయింట్లతో హైదరాబాద్, అండర్–20 కేటగిరీలో 36 పాయింట్లతో రంగారెడ్డి, సీనియర్ మెన్ చాంపియన్‌షిప్‌ను 32 పాయింట్లతో ఖమ్మం ట్రోఫీని అందుకుంది. తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి హాజరై విజేతలకు ట్రోఫీతోపాటు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం నిర్వహణ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు పుల్యాల కిషన్, వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేశ్‌బాబు, కోచ్‌లు శ్రీమన్నారాయణ, దిమ్మిక నాగరాజు, టెక్నికల్ అఫీషియల్స్, తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ భద్రాద్రి కొత్తగూడెం -
ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం
వరంగల్ ఎల్లంబజార్‌లో 51 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే ఆదివారం ఘనంగా నిమజ్జనం చేశారు. భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వాహకుడు ఆకుతోట సంజయ్, భక్తులు 14 రోజులు విశేష పూజలు చేశారు. ఉత్సవాల నిర్వాహకులు క్షీరాభిషేకంతోపాటు రెండు ఫైరింజన్ల నీళ్లతో మట్టి విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేశారు. అంతకు ముందు 51 కిలోల లడ్డూను రూ.2.25 లక్షలకు కాజీపేటకు చెందిన శంకర్, లావణ్య తులసి, నాగరాజు దేవిక కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. గణపతి నామస్మరణ మార్మోగింది. – వరంగల్ చౌరస్తా -
ఏఐఎస్ఎఫ్ @ 90..
సాక్షిప్రతినిధి, వరంగల్ : విద్యార్థి ఉద్యమాల చరి త్రకు సాక్షిగా నిలిచిన హనుమకొండ మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 90 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి వార్షికోత్సవాలకు నగరం ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో విద్యార్థుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ, మాజీ విద్యార్థి నాయకుల సమ్మేళనం, విద్యారంగంపై సెమినార్, రాష్ట్ర ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు తరలిరానుండడంతో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేయూ ఆడిటోరియంలో బహిరంగ సభ.. వార్షికోత్సవాల్లో భాగంగా తొలిరోజు సోమవారం హనుమకొండలో భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించనున్నారు. పబ్లిక్ గార్డెన్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ప్రదర్శన కొనసాగనుంది. అనంతరం కేయూ ఆడిటోరియంలో బహిరంగ స భ నిర్వహిస్తారు. ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగి రాజన్, జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరా వు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరుకానున్నారు. రేపు మాజీ నాయకుల సమ్మేళనం.. రెండో రోజు మంగళవారం కాజీపేటలోని బాల వికాస కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ మాజీ ముఖ్య నాయకుల సమ్మేళనం నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తదితరులు పాల్గొననున్నారు. ఏఐఎస్ఎఫ్లో పనిచేసి వివిధ రంగాల్లో స్థిరపడిన మాజీ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు. విద్యార్థి దశలో ఉద్యమాల్లో పాల్గొని అనంతరం రాజకీయాలు, న్యాయ, వైద్య, సాంకేతిక తదితర రంగాల్లో రాణిస్తున్న పూర్వ నాయకులు ఒకే వేదికపైకి రానుండడం ఈ సమ్మేళనానికి ప్రత్యేకతగా నిలవనుంది. విద్యారంగ సవాళ్లపై చర్చ.. విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక సె మినార్ నిర్వహించనున్నారు. ప్రముఖ విశ్లేషకులు మల్లేపల్లి లక్ష్మయ్య, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రి టైర్డ్ ప్రొఫెసర్ మార్క శంకర్ నారాయణ తదితరులు పాల్గొంటారు. ప్రస్తుత విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న స వా ళ్లు, విద్యారంగంలో చేపట్టాల్సిన మార్పులపై చ ర్చించనున్నారు. వేడుకల్లో చివరి రోజైన బుధవా రం కాజీపేట బాలవికాస కేంద్రంలో రాష్ట్ర ప్రతిని ధుల సభ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు విద్యారంగ సమస్యలపై చర్చించి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న ప్రతినిధులు.. ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర, జిల్లా నాయకులు కొన్ని రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్చార్జ్ రహమాన్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నాయకులు, ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో 28, 29,30 తేదీల్లో మూడు రోజులపాటు హనుమకొండలో విద్యార్థి ఉద్యమ సందడి నెలకొననుంది.స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి పోరాట ప్రస్థానంఅఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936లో ఏర్పాటై దేశ విద్యార్థి ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి విద్యార్థుల హక్కులు, విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు చేపట్టిన సంస్థగా గుర్తింపు పొందింది. తొమ్మిది దశాబ్దాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ వేడుకలు విద్యార్థి ఉద్యమ గతాన్ని గుర్తుచేసుకోవడంతోపాటు, ప్రస్తుత విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు వేదిక కానున్నాయి.9 దశాబ్దాల పోరాటం.. నేటినుంచి మూడు రోజుల పండుగ పబ్లిక్ గార్డెన్ నుంచి కేయూ వరకు భారీ విద్యార్థి ప్రదర్శన ప్రారంభ సభకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ, రాష్ట్ర నాయకులు -
డాక్టర్ ఎన్వీఎన్ చారికి నబారా పురస్కారం ప్రదానం
హన్మకొండ కల్చరల్: నగరానికి చెందిన పద్యకవి డాక్టర్ ఎన్వీఎన్ చారికి నబారా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ మేరకు తెలంగాణ రచయితల సంఘం, నబారా (నమిలికొండ బాలకిషన్‌రావు) వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో ఆయనకు అవార్డు అందించారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్వీఎన్ చారి సాహితీసేవలను గుర్తించి పురస్కారాన్ని అందజేశామన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాన్ని అందుకున్న కవి వీఆర్ విద్యార్థిని సన్మానించారు. తెరసం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, సహృదయ సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు, సొసైటీ కన్వీనర్ డాక్టర్ పాంచాల్‌రాయ్, కవులు బిల్లా మహేందర్, నాగిళ్ల రామశాస్త్రి, దాస్యం సేనాధిపతి, డాక్టర్ కర్రె సదాశివ్, రాంబ్రహ్మచారి, కొడెం సురేందర్, కార్తీకరాజు, రామ రత్నమాల తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలకసంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో.. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావునయీంనగర్: సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో సమాచార హక్కు చట్టంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాస్‌రావు హాజరై మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అన్నారు. చట్టాన్ని సద్విని యోగం చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేయకూడదని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టంలోని 4(1) బీ ప్రకారం సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలని, కానీ అది సక్రమంగా అమలు కావడం లేదని తనిఖీల్లో వెల్లడైందని తెలిపారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు కమిషన్ త్వరితగతిన హియరింగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 జిల్లాలు పర్యటించి చట్టంపై అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. న్యాయవాది గుడిమళ్ల రవికుమార్, నేరెళ్ల శోభ, విశ్రాంత ప్రొఫెసర్ జ్యోతిరాణి, టీజీఓ హనుమకొండ అధ్యక్షుడు శ్రీనివాస్‌కుమార్, కొల్లూరు వెంకన్న, మండల పరషురాములు, రమేశ్, శ్రీనివాస్‌రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ చౌరస్తా: యువత మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం ఎంజీఎం ఆస్పత్రిలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ ఫర్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపును కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ బి.రాజారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి అరుణ్ జోషి, జిల్లా యువజన అధికారి బి.సంజీవ్, ప్రొఫెసర్ వెంకన్న, వైద్యాధికారులున్నారు. -
రైతు సేవలో ముల్కనూరు సొసైటీ
భీమదేవరపల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా దేశంలోని సహకార సంఘాలకు ఆదర్శంగా నిలిచింది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ. 1956లో కొద్దిమంది రైతులతో ప్రారంభమైన ఈ సొసైటీ నేడు వేలాది మంది రైతులకు విస్తృత సేవలు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతు సంక్షేమం, సహకార రంగంలో అందిస్తున్న సేవలకు ముల్కనూరు సొసైటీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకుంది. సోమవారం 70వ వార్షికోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం 7,464 మంది సభ్యులకు సేవలు.. ముల్కనూరు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని సొసైటీకి బలమైన పునాది వేశారు. అప్పట్లో రూ.100తో ప్రారంభమైన సంస్థ క్రమంగా అభివృద్ధి చెంది నేడు 42,663 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే స్థాయికి చేరుకుంది. సుమారు 144 మంది ఉద్యోగులతో 14 గ్రామాల్లో 7,464 మంది సభ్యులకు సేవలందిస్తోంది. రైతే రాజు.. ఇదే సొసైటీ లక్ష్యంగా.. రైతులకు సొసైటీ పంట రుణాలు, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తోంది. అంతేకాకుండా పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, విద్యుత్ మోటార్లు, పైపులైన్లకు రుణ సాయం అందిస్తోంది. పాడిపశువులు, గొర్రెలు, ట్రాక్టర్ల కొనుగోళ్లకు సైతం ఆర్థిక సహకారం అందిస్తోంది. రైతు పండించిన ధాన్యం, పత్తిని సొసైటీ కొనుగోలు చేస్తోంది. సొసైటీ వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చే నికర లాభాలు 2026లో సుమారు 7.22 కోట్లు రైతుల సంక్షేమానికి వినియోగించడం ప్రత్యేకతగా నిలిచింది. ఏటా విజ యదశమి సందర్భంగా లాభాల్లో కొంత భాగాన్ని బోనస్ రూపంలో సభ్యులకు అందిస్తోంది. ఎరువుల కొరత లేకుండా.. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎరువుల కొరత రాకుండా సొసైటీ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఏటా సుమారు రూ.6 కోట్ల విలువైన ఎరువులను నిల్వ ఉంచి అవసరమైన సమయంలో రైతులకు అందుబాటులో ఉంచుతోంది. సొసైటీ పరిధిలోని గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసి రైతులకు గ్రామస్థాయిలోనే ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను అందిస్తోంది. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా సొసైటీ గుర్తింపు సొసైటీ నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, శుద్ధిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. 1965లో ప్రారంభమై న విత్తన శుద్ధి కార్యక్రమం క్రమంగా విస్తరించి అ త్యాధునిక విత్తన శుద్ధి కర్మాగారాల స్థాయికి చేరింది. నాణ్యమైన వరితో పాటు మొక్కజొన్న విత్తనాల ను కూడా రైతులకు అందిస్తుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక ప్రాంతా ల రైతులు సైతం ముల్కనూరులో తయారయ్యే వి త్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అందుకే సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ముల్కనూరు సొసైటీని కీర్తిస్తారు. వృద్ధ రైతులకు పింఛన్ సౌకర్యం రైతులు వృద్ధాప్యంలోకి చేరినప్పుడు ఆర్థిక భరోసా కల్పించేలా పింఛన్ సదుపాయం, ప్రమాదవశాత్తు సభ్యుడు మృతిచెందినప్పుడు కుటుంబానికి ఆర్థిక సాయం, అంత్యక్రియలకు సాయం, పంట రుణాల మాఫీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట రైతు కుటుంబాల్లో విద్య, వైద్యానికి సొసైటీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. సభ్యుల పిల్లలకు పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ప్రోత్సాహకాలు, ఉపకార వేతనాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ఏకేవీఆర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఏకేవీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలను నిర్వహిస్తోంది. 2008 నుంచి 2026 వరకు సుమారు 1200 మంది పైగా విద్యార్థులకు రూ. కోటికి పైగా ఉపకార వేతనాలు అందించినట్లు సొసైటీ వివరించింది. ఉన్నత విద్యలో బీటెక్, ఎంబీబీఎస్ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సైతం ఆర్థిక సహాయం అందిస్తోంది. అదేవిధంగా సభ్యులు, వారి కుటుంబాల ఆరోగ్య సంరక్షణకు సొసైటీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. సూపర్‌బజార్ ఆవరణలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాల ద్వారా వేలాది మంది సభ్యులకు కంటి పరీక్షలు చేయించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించింది. ఇందుకోసం సుమారు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సొసైటీ వివరించింది. ప్రముఖుల సందర్శన.. ముల్కనూరు సొసైటీని ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికా రులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సొసైటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగడంతో పాటు జీవితాంతం సభ్యుడిగా ఉండడం సంస్థ చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ సొసైటీని సందర్శించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కాశీ విశ్వనాథరెడ్డి కాంస్య విగ్రహాన్ని అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆవిష్కరించారు. 1956లో రూ.100తో ప్రారంభం.. ఒక ఉద్యోగితో సేవలు 2026లో రూ.42,663 కోట్లకు పైగా లావాదేవీలు నేడు ముల్కనూరు సొసైటీ 70వ వార్షికోత్సవం -
దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 28,30 తేదీల్లో నిర్వహించాల్సిన దూరవిద్య (ఎస్డీఎల్సీ) పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ ఆదివారం తెలిపారు. ‘సెట్’ నేపథ్యంలో ఆయా పరీక్షలను వాయిదావేశామని చెప్పారు. మిగతా అన్ని పరీక్షలు టైంటేబుల్ ప్రకారం యథావిఽధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. వాయిదాపడిన ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. సీఏఎస్ ఆర్ఎంఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కాశిబుగ్గ: వైద్య విద్యా సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) హైదరాబాద్ నియంత్రణలో కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో నాలుగు సీఏఎస్ ఆర్ఎంఓ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిలో మార్చి 31, 2027 వరకు లేదా అవసరం ముగిసేవరకు, లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఎంపికై న వైద్యులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 5న తాత్కాలిక జాబితా ప్రకటన, 6 నుంచి 7 వరకు అభ్యంతరాలు ప్రకటన, స్వీకరణ, అనంతరం ఎంపిక ప్రక్రియ వివరాలను వెబ్ సైట్లో ప్రకటిస్తామని ఆయన వివరించారు. పూర్తి వివరాలను www.kmcwgl.com. వెబ్సైట్లో తెలుసుకోవాలని సూచించారు. సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలి● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ కల్చరల్: మన పండుగలు, కళలు, నృత్యాలు, సంగీతాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలని, సంస్కృతీసంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు హనుమకొ ండలోని కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో శ్రీశాంతి కృష్ణ సేవా సమితి 41వ వార్షికోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా ని ర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కాకతీయ కళా వైభవాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా కళారంగంతో పాటు వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన 108 మంది సన్మానించి సేవా సమితి పురస్కారాలు అందజేశారు. అసెంబ్లీకి అణగారిన వర్గాల ప్రాతినిథ్యం : విశారదన్ కాజీపేట అర్బన్ : అణగారిన వర్గాల ప్రాతినిథ్యాన్ని అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహరాజ్ సూచించారు. హంటర్‌రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ‘ఎవరి కులం ఎంతో వారికంత వాటా’ అనే అంశంపై ఏర్పాటు బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలోని నాలుగు కోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, 40 లక్షలు ఉన్న అగ్రకులాల వారి మధ్య యుద్ధం జరగనుందని తెలిపారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని, రానున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ విజయం సాధించనుందని పేర్కొన్నారు. జేఏసీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, కుమారస్వామి, చందా మల్లయ్య, రాఘవేంద్ర , సుమన్, కూరపాటి రమేశ్ పాల్గొన్నారు. -
వైద్య ఉద్యోగుల పోరుబాట
హన్మకొండ అర్బన్ : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్‌లో వివిధ విభాగాలు, కేడర్లలో ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్హెచ్ఎం జేఏసీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఈనెల 28న( సోమవారం) చలో కమిషనరేట్ నిర్వహించి సమ్మె నోటీసు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 12 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు పనిచేస్తున్నట్లు జేఏసీ తెలిపింది. ప్రభుత్వం దృష్టికి సమస్యలు.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గత, ప్రస్తు త ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉద్యోగులను మరింత ఇబ్బందులకు గురిచేసే చర్యలు తీసుకుంటున్నాయని, దీంతో తమకు పోరుబాట తప్పడం లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరినీ కలిశామని, ప్రభుత్వం దృష్టికి కూడా సమస్యలు తీసుకెళ్లామన్నారు. అయినా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు సోమవారం హైదరాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయం వద్ద చలో కమిషనరేట్ నిర్వహించి కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేయనున్నామని నాయకులు తెలిపారు. జిల్లాల వారీగా సంబంధిత అధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించామన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యోగులు సాధారణ సెలవు కోసం అధికారులకు దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. ఉద్యోగుల భవిష్యత్ కాపాడాలి.. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో సేవలందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, హక్కులు, భవిష్యత్‌పై స్పష్టత లేకపోవడంతో ఆందోళన నెలకొందని జేఏసీ తెలిపింది. సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడంతో ఉ ద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల భవిష్యత్‌ను ప్రభుత్వం కాపాడాలని, ఏ ళ్ల తరబడి అందిస్తున్న సేవలకు గుర్తింపు, ఉద్యోగ భద్రత, న్యాయమైన హక్కులు కల్పించాలని ఎన్హెచ్ఎం జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతియుత నిరసనకు కదిలిరావాలి నేడు నిర్వహించనున్న చలో కమిషనరేట్ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ శాంతియుతంగా, క్రమశిక్షణతో పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించేదిలేదు. ఐక్య ఉద్యమాలతో సమస్యలను పరిష్కరించుకుందాం. – డాక్టర్ మహేందర్‌రావు పుట్ట, ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో క్రీడాపోటీలు నిర్వహించారు. ఇంటర్ కాలేజీయేట్ మహిళల వాలీబాల్ ఫైనల్ పోటీల్లో వాగ్దేవి కళాశాల జట్టుపై కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల జట్టు విజయం సాధించినట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ఖోఖో మహిళల విభాగంలో యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ జట్టు, ములుగు జట్టు తలపడగా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు విజేతగా నిలిచింది. వాలీబాల్ జట్టుకు వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ కుమార్ కోచ్‌గా, ఖోఖో జట్టుకు డాక్టర్ కిరణ్‌కుమార్ కోచ్‌గా వ్యవహరించారు. కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జె. సోమన్న, ఉపాధ్యక్షుడు రమేశ్, అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ అనిత, పీడీ రాజేష్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఓవర్ ఆల్ చాంపియన్‌గా కూడా కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.మహిళల వాలీబాల్ విజేతగా కేయూ జట్టునేడు ‘చలో కమిషనరేట్’ 12 నుంచి నిరవధిక సమ్మెలో ఎన్ హెచ్ఎం సిబ్బంది అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం -
మంత్రులు పొన్నం, వివేక్‌కు దర్రీస్ బహూకరణ
కాశిబుగ్గ: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో వరంగల్ కొత్తవాడలో తయారు చేసిన దర్రీస్‌లను రాష్ట్ర మంత్రులకు బహూకరించారు. జయంతి వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని చేనేత సహకార సంఘాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, చేనేత కార్మికులు, పద్మశాలి సంఘాల నుంచి వంద మందికి పైగా తరలివెళ్లారు. ఈసందర్భంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖమంత్రి గడ్డం వివేక్‌కు చేనేత దర్రీస్‌లను అందజేశారు. చేనేత సంఘం ప్రతినిధులు చిప్ప వెంకటేశ్వర్లు, యెలుగం సాంబయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, యెలుగం రావిరాజ్, యెలుగం వెంకటమల్లు, చిన్న వీరస్వామి, వలుస లక్ష్మీనారాయణ, కూరపాటి సంపత్, బూర వేణుమాధవ్, ఓం ప్రకాశ్, మాటేటి రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఎన్నికలకు గుర్తుల కేటాయింపు
● ఉధృతం కానున్న ప్రచారం హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ యూనియన్ ఎన్నికలకు కార్మిక శాఖ శనివారం గుర్తులు కేటాయించింది. దీంతో ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చింది. ఇప్పటికే మొదలు పెట్టిన ప్రచారం గుర్తుల కేటాయింపుతో ఉధృతం కానుంది. గతంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు కేటాయించిన విల్లు, బాణం గుర్తును తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు కేటాయించారు. ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు బతుకమ్మ, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు నిచ్చెన, టీఎస్ ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్‌కు కత్తెర, టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బస్, టీఎస్ ఆర్టీసీ కార్మిక పరిషత్‌కు బస్ టైర్, టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ్‌కు టైగర్, టీఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్‌కు ధర్మచక్ర, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు నక్షత్రం, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు కాగడ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు తరాజు, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌కు గధ గుర్తును కార్మిక శాఖ కేటాయించింది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ సంబరాలు.. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (అశ్వత్థామ రెడ్డి వర్గం)కు విల్లు, బాణం గుర్తు కేటాయించడంతో ఆ యూ నియన్ సంబరాలు చేసుకుంది. గతంలో టీఎంయూగా కొనసాగిన అశ్వత్థామ రెడ్డి వర్గం గుర్తింపు ఎన్నికలో తెలంగాణ ఆ ర్టీసీ వర్కర్స్ యూనియన్‌గా పోటీ చేస్తుంది. అయితే గతంలో టీఎంయూ గుర్తుగా కార్మికుల్లోకి విస్తృతంగా ప్రచారంలో ఉన్న విల్లు, బాణం గుర్తు తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు కేటాయించడంతో శనివారం రాత్రి హనుమకొండలోని వరంగల్–1, వరంగల్–2, హనుమకొండ డిపోల వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు జితేందర్ రెడ్డి, ఎస్.కె.వై.పాషా, రాతిపల్లి సాంబయ్య, జి.సత్తయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం
జనగామ: గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిన ఇళ్లను గుర్తించి వాటిని పూర్తి చేసి పేద కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి మంత్రి మాట్లాడారు.. ఒక్క జనగామ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో నిర్మాణాలు పూర్తికాక ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తిస్తున్నామని చెప్పారు. జనగామకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జనగామ జిల్లాలో సుమారు 500 కుటుంబాలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నాయని, వచ్చే దసరా నాటికి ఇందులో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మొండి గోడల వద్ద, స్లాబ్ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లను కూడా పరిశీలించి రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు దసరా నాటికి రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులను వెంటనే మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమ ంలో డీసీపీ రాజ మహేంద్రనాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి నాయక్, వైటీడీఏ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పూరిగుడిసెల కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు జనగామ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
ఎయిర్ పోర్ట్ పనుల్లో వేగం పెంచాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మామునూరు : నిర్ణీత ప్రణాళిక ప్రకారం విమానాశ్రయం నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు శనివారం వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని అదనపు కలెక్టర్ ఎల్. కిశోర్‌కుమార్, ఆర్డీఓ సుమ, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారి నటరాజ్, ఈఈ రాజేందర్, ఇతరశాఖల అధికారులతో కలిసి సందర్శిచారు. పాత రన్‌వే, పరిసరాలు, భూసేకరణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన పనులు, ఆయా శాఖల పరిధిలోని అంశాలపై ఆయా ఆధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ ఇక్బాల్, ఆర్అండ్బీ ఈఈ రా జేందర్, ఇరిగేషన్ డీఈ సురేశ్‌బాబు, డీఈ మధుసూదన్, నేషనల్ హైవే డీఈ అమీర్‌పాషా పాల్గొన్నారు. -
ప్రతీరోజు మైదానానికి తీసుకెళ్లేవాడిని..
● దగ్గరుండి సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ ● నా కూతురు సాఫ్ట్‌బాల్ భారత జట్టుకు ఎంపిక సంతృప్తినిచ్చింది.. ● సాయివర్షిణి తండ్రి వేల్పుల అనిల్హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డికాలనీ సమీపంలో శాంతినగర్‌కు చెందిన వేల్పుల అనిల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ వాకింగ్‌కు వెళ్లే అలవాటు ఉన్న అతను వెంట తన కూతురును కూడా మైదానానికి తీసుకెళ్లేవాడు. వివిధ క్రీడల్లో సాధన చేస్తున్న పిల్లలను చూసి కూతురు సాయివర్షిణికి ఆటలపై ఆసక్తిగా కలిగింది. సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించగా సాయివర్షిణి తన తండ్రి నమ్మకాన్ని నిలబెట్టి నేడు భారతజట్టుకు ఎంపికై ంది. ఈ నేపథ్యంలో తన కూతురు సాధించిన విజయాలను తండ్రి అనిల్ నేడు కూతుళ్ల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’కి వివరించారు. – వరంగల్ స్పోర్ట్స్ -
వాకింగ్‌కు వెళ్లి.. విగతజీవిగా మారి
ఖిలా వరంగల్ : వాకింగ్ వెళ్లిన ఓ వ్యక్తి విగత జీవిగా మారాడు. మద్యం మత్తు, స్నేక్ డ్రైవ్‌తో అతివేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం(బైక్) అతడిని బలితీసుకుంది. ఈ ఘటన వరంగల్ 39వ డివిజన్ జన్మభూమి జంక్షన్ నుంచి కాశికుంటకు వెళ్లే రహదారిపై చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ 39వ డివిజన్ ఏకశిల నగర్‌కు చెందిన బత్తుల కిషన్(60) రియల్ స్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజువారీగానే శనివారం ఉదయం 6గంటల సమయంలో జన్మభూమి జంక్షన్ రోడ్డులో వాకింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో కరీమాబాద్‌కు చెందిన శ్యామ్ మణిభూషణ్ కాశికుంట వెళ్లే రహదారిపై పల్సర్ బైక్‌పై మద్యం మత్తు,స్నేక్ డ్రైవ్‌తో వెనుక నుంచి కిషన్‌ను ఢీకొన్నాడు. దీంతో కిషన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. శ్యామ్ మణిభూషణ్ రోడ్డుపై పడిపోవడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే 108లో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఎస్సై శ్రవణ్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య సుగుణ, కుమారుడు శ్రీధర్, కుమార్తెలు మాధవి, మమత ఉన్నారు. కుమారుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. కాగా, రక్తపు మడుగులో ఉన్న కిషన్ మృతదేహం మీద పడి కుటుంబీకులు బోరున విలపించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించారు. బైక్ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం వరంగల్ జన్మభూమి రోడ్డులో ఘటన -
ముందస్తు చర్యలు చేపట్టండి
హన్మకొండ: వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని సర్కిళ్లలో ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధా న కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈ లు, ఏడీఈలు, ఎస్ఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని రూపొందించాల్సిన కార్యాచరణపై సమీక్షించారు. సీఎండీ మాట్లాడుతూ 33 కేవీ, 11 కేవీ ఓవర్‌లోడ్ ఫీడర్లను ముందుగానే గుర్తించి అవసరమైన చోట కండక్టర్ అప్‌గ్రేడేషన్ చేపట్టాలని, కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, అదనపు డీటీఆర్‌ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు పనుల్లో వేగం పెంచాలన్నారు. డీటీఆర్లపై లోడ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, 60 శాతానికి పైగా లోడ్ ఉన్న డీటీఆర్లను ముందుగానే గుర్తించి అవసరమైన చోట సామర్థ్యాన్ని పెంచాలన్నారు. టాంగ్ టెస్టర్ రీడింగ్‌లను తీసుకుని లోడ్ బ్యాలెన్సింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, సి.ప్రభాకర్, సీఈలు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి -
పనులు నాణ్యతతో పూర్తి చేయాలి
వరంగల్ అర్బన్: నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సాయపురెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నగర పర్యటనలో భాగంగా జీడబ్ల్యూఎంసీ, కుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హనుమకొండ పరిధి కాజీపేట కూడలిలో ప్రతిపాదించిన జంక్షన్ అభివృద్ది ప్రాంతం, చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనులతో పాటు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పనుల పురోగతి, వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు, స్తంభంపల్లిలో కొనసాగుతున్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉర్సు గుట్ట చెరువు పరిసరాల్లో అభివృద్ధి, ఎస్టీపీ పనులు పరిశీలించారు. అభివృద్ధి పనులపై సమీక్ష క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కమిషనర్ వెంకన్నతో కలిసి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సాయపురెడ్డి నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, కుడా సీఈఓ అజిత్‌రెడ్డి, ఈఈలు రవికుమార్, సంజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ సుచరణ డీఈలు, ఏఈలు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. యూజీడీపై సీడీఎంఏ సమీక్షవరంగల్ నగర సమగ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా చేపట్టి, కార్యాచరణను వేగవంతం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ, సీడీఎంఏ డాక్టర్ టి.కె శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ నగర యూజీడీ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్ క్యాంపు కార్యాలయం నుంచి కమిసనర్ టి.వెంకన్న, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సాయపురెడ్డి, అధికారులు పాల్గొన్నారు. పచ్చదనం మరింత విస్తరించాలి..పార్కులు, సెంట్రల్ మీడియన్లలో పచ్చదనం మరింత విస్తరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్‌లో హార్టికల్చర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పార్కులు, సెంట్రల్ మీడియన్లు, గ్రీనరీ అభివృద్ధి పనులను శనివారం కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన కాజీపేట–సోమిడి సెంట్రల్ మీడియన్, ఎకై ్సజ్ కాలనీలోని కనకదుర్గ పార్క్, పబ్లిక్ గార్డెన్లో పచ్చదనం, సుందరీకరణ, మొక్కల సంరక్షణ, నిర్వహణ తీరును పరిశీలించారు. వరంగల్‌లో కోట చెరువు, బండ్ వద్ద చేపట్టిన ప్లాంటేషన్ పనులు, లేబర్‌కాలనీలోని టీఆర్టీ పార్క్‌లో నూతనంగా చేపట్టిన గ్రీనరీ సుందరీకరణ పనులను పరిశీలించారు. కమిషనర్‌తో పాటు చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్లు లక్ష్మారెడ్డి, ప్రశాంత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.ఎంఎఅండ్ యూడీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సాయపురెడ్డి -
అమ్మనాన్నల రెక్కల కష్టం.. కూతుళ్ల విజయాల ఆకాశం
తాము చదువుకోలేక ఎదుర్కొన్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. తాము చిందించిన ప్రతీ చెమట చుక్కను కూతుళ్ల భవిష్యత్తుకు పునాదిగా మార్చారు. మరికొందరు తల్లిదండ్రులు కొడుకు లేడని బాధపడలేదు. కూతుళ్లనే కుమారులుగా భావిస్తూ ఉన్నతస్థానాలకు వెళ్లాలని ఆశపడ్డారు. వారి నమ్మకాన్ని కూతుళ్లు నిలబెట్టారు. ఉన్నతస్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు. నేడు (ఆదివారం) కూతుళ్ల దినోత్సవం (డాటర్స్ డే) సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తల్లిదండ్రుల కల నెరవేర్చిన కూతుళ్లు, కూతుళ్ల కోసం కష్టపడిన తల్లిదండ్రులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు. చదువుకోలేదన్న వెలితిని.. పిల్లల చదువుతో తుడిచేసుకున్న తల్లిదండ్రులు వారి ఆశలను వమ్ము చేయకుండా నెరవేర్చిన కూతుళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నతస్థానాలకు ఎదిగిన పలువురునా పేరు కందగట్ల గణేశ్ వృత్తి రీత్యా నేను హనుమకొండలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. భగవంతుడు మాకు ప్రసాదించిన అమూల్యమైన వరాలు మా ఇద్దరు కుమార్తెలు. విద్య వినయ శాంతి ప్రజ్ఞ శ్రీ, వాణి వికాస సాయి శ్రీ రేష్మిత. ఇద్దరూ తమ ప్రతిభ, కృషితో హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. 2026 మార్చి 4న మా వివాహ రజతోత్సవం సందర్భంగా.. హైదరాబాద్‌లో మాకు ఫ్లాట్ బహుమతిగా అందించారు.నేడు కూతుళ్ల దినోత్సవం -
ప్రతీరోజు మైదానానికి తీసుకెళ్లేవాడిని..
తండ్రి స్ఫూర్తితో కూతురువరంగల్ స్పోర్ట్స్: ఆడపిల్ల పుట్టిందంటే పెళ్లి నాటికి బంగారం, డబ్బులు, ప్లాట్లు సంపాదిస్తే చాలు.. కూతురుకు బంగారు భవిష్యత్ అందించొచ్చు. ఇది సగటు సాధారణ తండ్రి ఆలోచన. అందుకు భిన్నంగా ఓ తండ్రి తన కూతురును అంతర్జాతీయ వేదికపై తల ఎత్తి చూడాలని తలచారు. తన లక్ష్యం కోసం కూతురును క్రీడా దిగ్గజంగా మలిచేందుకు పరితపించారు. చూస్తుండగానే తన లక్ష్యానికి కూతురు చేరువయ్యింది. వచ్చే నెల 12 నుంచి 18వ తేదీ వరకు చైనాలో జరగనున్న ఐదో ఏషియా కప్ టోర్నమెంట్లో అండర్–15 బాలికల విభాగంలో భారత జట్టు నుంచి పాల్గొననుంది. హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డికాలనీ సమీపంలో శాంతినగర్‌కు చెందిన వేల్పుల అనిల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్, సుజాత దంపతులకు కూతురు సాయివర్షిణి, కుమారుడు సాయివర్షిత్ ఉన్నారు. కూతురు సాయివర్షిణి ఎదిగిన తీరును ‘డాటర్స్ డే’ సందర్భంగా తండ్రి అనిల్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రశ్న: సాయివర్షిణికి సాఫ్ట్‌బాల్‌పై ఆసక్తిని ఎప్పుడు గుర్తించారు సాయివర్షిణి పుట్టగానే క్రీడాకారిణిగా తయారు చేయాలని నిశ్చయించుకున్నా. నాలుగో తరగతి చదువుతుండగా ప్రతీ రోజు మైదానానికి తీసుకెళ్లేవాడిని. స్టేడియంలో క్రీడాకారులను చూపుతూ క్రీడలపై ఆసక్తి పెరిగేలా బోధించేవాడిని. కొద్ది రోజులు గమనించాక సాఫ్ట్‌బాల్ వైపు సాయివర్షిణి ఆసక్తి చూపెట్టింది. ప్రశ్న: ఎక్కడ శిక్షణ ఇప్పించారు ప్రతీ రోజు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం తీసుకెళ్తున్న క్రమంలో సాఫ్ట్‌బాల్ క్రీడ పట్ల ఆసక్తి కనబరిచింది. అక్కడే శిక్షణ ఇస్తున్న కోచ్ వినయ్ వద్ద జాయిన్ చేశా. నాలుగు సంవత్సరాలుగా వినయ్ వద్ద శిక్షణ పొందుతోంది. ప్రతీ రోజు రెండు గంటలకు పైగా సాధన చేస్తుంది. ప్రస్తుతం పిచ్చర్‌గా భారత జట్టులో స్థానం దక్కించుకుంది. ప్రశ్న: సాయివర్షిణి చదువు, ఆటపై ఎలా దృష్టి పెడుతున్నారు సాయివర్షిణి చిన్నప్పటి నుంచే ఏదైనా సరే ఒకసారి చెబితే చాలు ఇట్టే పట్టేస్తుంది. ప్రస్తుతం హంటర్‌రోడ్‌లోని గ్రీన్వుడ్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఏ రోజు కూడా చదువులో వెనుకంజ వేయలేదు. సాయంత్రం స్టేడియానికి వెళ్లి రాగానే పుస్తకాలు పడుతుంది. ఏ రోజు కూడా అలసిపోయా.. చదువుకోలేను అని చెప్పలేదు. ప్రశ్న: తల్లిదండ్రులుగా కూతురు ఈ స్థాయికి ఎంపిక కావడం ఎలా ఫీలవుతున్నారు నా కూతురుని అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచమంతా తల ఎత్తుకుని చూడాలన్న మా ఆశయం, ఆలోచనలను ఒంటబట్టించుకుని భారత జట్టుకు ఎంపిక కావడం మాటల్లో చెప్పలేని సంతృప్తిగా ఉంది. ఈ విషయాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నా. భవిష్యత్‌లో మరింత స్థాయికి ఎదుగుతుందని ధీమా కలుగుతోంది.దగ్గరుండి సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ నా కూతురు సాయివర్షిణి సాఫ్ట్‌బాల్ భారత జట్టుకు ఎంపిక సంతృప్తినిచ్చింది.. తండ్రి కానిస్టేబుల్ వేల్పుల అనిల్ -
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: గ్రామాల సమగ్రాభివద్ధికి అవసరమైన పనులను గుర్తించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సర్పంచ్, అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్, వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై సర్పంచ్‌లు, గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో రూపొందించిన ఆత్మకూరు గ్రామ నమూనా చిత్రపటాన్ని కలెక్టర్ పరిశీలించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ సేకరణపై సమీక్ష గౌరవెల్లి ప్రాజెక్టు భూ సేకరణపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టులోని మేజర్ 2ఎల్ కెనాల్ భూ సేకరణలో భాగంగా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన భూమిని ప్రాజెక్టు కోసం సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఖనిజాల సర్వే నివేదికలను నవీకరించాలి జిల్లాలోని ఖనిజ సర్వే నివేదికలను నవీకరించి, తప్పులు ఉంటే సరిచేయాలని ఆర్డీఓ ఎన్. వెంకటేష్ ఆధ్వర్యంలోని ఉప కమిటీ నిర్ణయించింది. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ఉప కమిటీ సమావేశం నిర్వహించారు. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతుల కోసం జిల్లా సర్వే నివేదికలో గనులు, క్వారీల వివరాలను చేర్చడం తప్పనిసరని సమావేశంలో చర్చించారు. ఆయా సమావేశాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.శేషాద్రి, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, వివిధ శాఖల అదికారులు లక్ష్మీ ప్రసన్న,వెంకటేష్, డాక్టర్ రాధాకిషన్, రాజగోపాల్రావు, రాజేష్, జగత్సింగ్, స్వామి, రాములు, చైతన్య, నంద, ఎన్.రామాచారి, బి.రామ్మోహన్, సుభాష్, బి.రత్న్లాల్, కె.శంకర్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
వరంగల్ స్పోర్ట్స్: క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించి, గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరై వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా సమగ్ర రూపకల్పన చేస్తున్నామన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మైదానాల్లో పోటీ పడాలని సూచించారు. వరంగల్ సీపీ శ్వేత మాట్లాడుతూ జేఎన్ స్టేడియం క్రీడాకారులకు వరమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడల్లో విజయం సాధించడం కంటే పాల్గొనడమే గొప్ప విజయమన్నారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. సారంగపాణి మాట్లాడుతూ అండర్– 14,16,18,20 బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో జరుగుతున్న పోటీలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి 1,500 మంది క్రీడాకారులు పాల్గొనగా, 220 ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు 120 ఈవెంట్లు జరిగినట్లు తెలిపారు. గ్రంథాలయ సంస్థ హనుమకొండ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, డీవైఎస్ఓ ప్రశాంత్, వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేశ్‌బాబు, అధ్యక్షుడు పుల్యాల కిషన్, కార్యదర్శి ఊర యుగెంధర్రెడ్డి, సంఘం రాష్ట్ర బాధ్యుడు వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్‌లు, టెక్నికల్ అఫీషియల్స్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అట్టహాసంగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు -
ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
హన్మకొండ : నిన్నుచూసి మేం తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం. కూతురు సహనా రెడ్డి చిన్ననాటి నీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందం పొందుతున్నాం. విద్య అనేది భవిష్యత్తును మార్చే శక్తి అని ధృడంగా నమ్మి మా కూతురును చదివించాం. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. మల్టీ నేషనల్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవడం మాకెంతో గర్వకారణం. మా ఆనందం.. ఆశలకు ప్రతీక అయిన నీవు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని, నేటి సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవాలని కోరుకుంటున్నాం. – గోపు రేణుక, సమ్మిరెడ్డి, హనుమకొండకాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి గాండ్ల ప్రభాకర్–రమాదేవికి ఇద్దరు కుమార్తెలు మౌనిక, మేఘన. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నా చింత లేకుండా వారిని చదివించారు. పెద్దమ్మాయి మౌనిక కేఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పిడియాట్రిక్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా పరిధి నీలోఫర్ ఆస్పత్రిలో డీఎం నియోనెటాలజీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా చిన్నమ్మాయి మేఘన కూడా తానేమీ తీసిపోనట్లుగా ఒంగోలులోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం గుంటూరులోని మెడికల్ కాలేజీలో ఆప్తాల్మాజీలో సెకండియర్ చదువుతున్నారు. ‘మాకు కొడుకులు లేరన్న చింత లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా లక్ష్మీదేవిగా వారిని భావిస్తూ కష్టపడి చదివించాం. డాక్టర్లు కావడంతో మా జన్మ ధన్యమైంది.’అని తల్లిదండ్రులు ప్రభాకర్–రమాదేవి సగర్వంగా చెప్పారు. నా పేరు డి.ప్రభాకర్.. మాది అశోక కాలనీ హనుమకొండ. మా బిడ్డ ప్రాంశుత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (MCJ) పూర్తి చేసింది. రెండు బంగారు పతకాలు సాధించి, గవర్నర్ చేతుల మీదుగా వాటిని ఈ ఏడాది సెప్టెంబర్ 8న అందుకున్న క్షణం మాకు ఎంతో గర్వకారణం. జూనియర్ సివిల్ జడ్జిగా అశ్వినిరఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన నోముల పార్వతి–యాకయ్యది వ్యవసాయధార కుటుంబం. విద్య లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులు అనుభవించిన ఆ దంపతులు కూతురిని ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు. వారి కలలకు అనుగుణంగా అశ్విని ఆహర్నిశలు శ్రమించి ఏడాది క్రితం వనపర్తి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై బాధ్యతలు నిర్వరిస్తున్నారు. జడ్జిగా సేవలందిస్తున్న మా బిడ్డను చూస్తుంటే కడుపు నిండిపోతోంది అని పార్వతి, యాకయ్య ఎంతో ఆనందంగా తెలిపారు. నా పేరు బొజ్జ మాధవి వేణుగోపాల్. మేం ఉండేది హనుమకొండ కాకతీయ కాలనీ. మాకు ఇద్దరు అమ్మాయిలు. భువన, చందన. పెద్దమ్మాయి 10 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మా చిన్న కూతురు బీఫార్మసీలో గోల్డ్ మెడలిస్ట్. చదువు అయిపోగానే ఏడాది జాబ్ చేసి ఉన్నత చదువులకు కెనడా వెళ్లింది. అక్కడ చదువు పూర్తి చేసుకుని హెల్త్ అండ్ కేర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఉన్నతంగా బతకాలనే వారి ఆశయాలు, వాళ్ల ధైర్యాన్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాం. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పాఠశాల క్రీ డల సమాఖ్య అండర్– 14, 17 బాలబాలికల ఎంపిక పోటీలు శనివారం ఉత్సాహంగా కొనసాగాయి. వరంగల్ జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ కాశీబుగ్గలోని ఓసిటీ మైదానంలో ఉషు, టంగ్తా క్రీడల ఎంపికలు నిర్వహించా రు. అలాగే , హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్, లాన్‌టెన్నీస్ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్జీఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి పుల్ల అ నిల్ తెలిపారు. నాలుగు క్రీడాంశాల్లో జరిగిన ఈ పోటీలకు ఉ మ్మడి జిల్లా నుంచి 400 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు చె ప్పారు. పీఈటీల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటేశ్వర్లు, కన్వీనర్లు పి. సుధాకర్, జె. సతీశ్, బి. రవీనా, సుజాత, జి. ధన్‌రాజ్, పీఈటీలు నాగరాజు, సతీశ్, పాషా, సమ్మయ్య, పెద్దిరాజ్, రఘువీర్, తదితరులు పాల్గొన్నారు. -
రెడ్ క్రాస్ పాలకమండలి ఏకగ్రీవం
● చైర్మన్‌గా మూడోసారి విజయచందర్‌రెడ్డి హన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా పాలకమండలి ఏకగ్రీవంగా ఎన్నికై ంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో 19 మంది అభ్యర్థుల్లో నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకోగా, మిగిలిన 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి చైర్మన్‌గా మూడోసారి ఎన్నికయ్యారు. రెడ్ క్రాస్ భవన్లో నిర్వహించిన ఈకార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు, అదనపు కలెక్టర్ బి.శేషాద్రి, ఎన్నికల అధికారి బి.నవీన్‌కుమార్ నూతన కమిటీని ప్రకటించి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. వైస్ చైర్మన్‌గా పెద్ది వెంకట్ నారాయణ్‌రెడ్డి, రాష్ట్ర పాలక మండలి సభ్యుడిగా ఈవీ.శ్రీనివాస్‌రావు, కోశాధికారిగా బొమ్మినేని పాపిరెడ్డి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా గొట్టిముక్కల శ్రీలక్ష్మీ, ఈవీ.శ్రీనివాస్‌రావు, పెద్ది వెంకట్ నారాయణగౌడ్, డాక్టర్ యస్.జ్యోతి, డాక్టర్ నల్ల సురేందర్‌రెడ్డి, హరిప్రసాద్, పాపిరెడ్డి, రాకేశ్, డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి, మాటేటి నీరజ, బిళ్ల రమణారెడ్డి, డాక్టర్ సీహెచ్.సంధ్యారాణి, పుల్లూరి వేణుగోపాల్, పొన్నాల సంయుక్త ఎన్నికయ్యారు. అనంతరం కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకరంగా కలిశారు. వరంగల్‌లో.. న్యూశాయంపేట: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా పాలకవర్గం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ వసంత తెలిపారు. మొత్తం 25 మంది నామినేషన్లు వేయగా శనివారం జెడ్పీ హాల్లో స్క్రూట్నీ నిర్వహించారు. అర్హత పొందిన 25 మంది సభ్యుల్లో పది మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపారు. దీంతో సొసైటీ సభ్యుల ఎన్నికల ప్రక్రియ నిబంధనల మేరకు 15 మంది సభ్యులు పోటీలో ఉన్నారన్నారు. ఈ నెల 28న చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, మేనేజింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. -
సహారా సొమ్ము.. ఇంకెన్నాళ్లు?
హన్మకొండ: సహారా సంస్థల్లో డిపాజిట్ చేసిన తమ సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులు శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం కూడలిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్లుగా తమ డబ్బు కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్ సొమ్ము తిరిగి అందక పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, ఇళ్ల నిర్మాణం వంటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సహారా సంస్థలకు చెందిన ఆస్తులను విక్రయించి, వచ్చిన మొత్తంతో డిపాజిటర్లకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు వెంటనే స్పందించి సహారా డిపాజిటర్ల సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సహారా ఖాతాదారుల, కార్యకర్తల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.బాలయ్య, ఉపాధ్యక్షులు రవీందర్‌రెడ్డి, గడల కుమార్, గుండేటి కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం.నరేశ్, కోశాధికారి డక్క సుధాకర్, కార్యదర్శి రాము, అమీనా, నర్సయ్య, సఫియా, విజయ, చందు, సదానందు, మద్దెల రమేశ్, కాసారపు తిరుపతి, శ్రీనివాస్, రాజమౌళి, శంకరయ్య, ప్రభాకర్, వేణుగౌడ్, నరేందర్, బాలరాజ్, నరేంద్రబాబు, కె. వేణు, బి. శివ, రాంబాబు, ఎ. సతీశ్ తదితరులు పాల్గొన్నారు. డిపాజిటర్లకు వెంటనే చెల్లించాలి అంబేడ్కర్ విగ్రహం కూడలిలో బాధితుల ఆందోళన -
సీఈసీ పదవి నుంచి తొలగించాలి
హన్మకొండ: ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే సీఈసీ పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు సీపీఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ల హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీ, ధర్నాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమంగా తొలగించిన ఓటర్లందరి పేర్లను వెంటనే పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. సీఈసీ జ్ఞానేశ్వర్‌ను తొలగించే వరకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నాయకులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, ఎన్.అశోక్ స్టాలిన్, ఏదునూరి వెంకట్రాజం, కర్రె లక్ష్మణ్, జక్కు రాజు గౌడ్, నకీర్త ఓదెలు, వేల్పుల సారంగపాణి, కామెర వెంకటరమణ, గుంటి రాజేందర్, మాలోతు శంకర్ నాయక్, రాసమల్ల దీనా, కొట్టె వెంకటేశ్ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు -
గోదావరిలో అస్థికలు కలిపి వస్తుండగా..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: బంధువు అస్థికలను భద్రాచలంలోని గోదావరిలో కలిపి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యుల బొలెరో వాహనాన్ని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలోని మూలమలుపు వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పెద్దతండాకు చెందిన దరావత్ భద్రు (45) మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడ్వాయి ఎస్సై జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం పెద్దతండాకు చెందిన దరావత్ భద్రు ఇటీవల మృతి చెందగా అస్థికలను భద్రాచలంలోని గోదావరిలో కల్పిందుకు కుటుంబ సభ్యులు, బంధువులు బొలెరో వాహనంలో ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని సోమ్లతండాలోని మరికొందరు బంధువులను తీసుకుని ఈనెల 23న భద్రాచలం వెళ్లి ఆస్తికలు కలిపారు. శుక్రవారం తిరిగి వస్తున్న క్రమంలో తాడ్వాయి దాటిన తర్వాత కొండపర్తి సమీపంలోని మూలమలుపు వద్దకు చేరుకోగానే హనుమకొండ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దరావత్ భద్రు తీవ్రంగా గాయపడి ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దరావత్ సరోజన, దరావత్ నెహ్రూ, సక్రు, దరావత్ బుజ్జమ్మ, భూక్య జ్యోతి, దరావత్ వెంకన్న, దరావత్ అనితతోపాటు మరి కొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను తాడ్వాయి ఎస్సై జగదీష్, సెకండ్ ఎస్సై మధుకర్ 108 అంబులెన్స్‌లో ములుగు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా బస్సు కండక్టర్ రమేష్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు దరావత్ నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.బొలెరో వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఒకరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు -
రీసర్వేను వేగవంతం చేయాలి
● హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. రీసర్వే ప్రక్రియపై తహసీల్దార్లు, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ ఆర్డీఓ ఎన్.వెంకటేశ్‌తో కలిసి రీసర్వే పురోగతిని సమీక్షించారు. సర్వే విభాగంలో సీనియర్ సర్వేయర్ జీవన్ కుమార్ సర్వేలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. ఐదు గ్రామాల్లో తుది దశకు.. హనుమకొండ రెవెన్యూ డివిజన్ పరిధి ఐదు మండలాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తికాగా, ఆయా గ్రామాల్లో తుది దశ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భీమదేవరపల్లి, కాజీపేట మండలం అమ్మవారిపేట, ధర్మసాగర్ మండలం జానకీపురం, ఎల్కతుర్తి మండలం వల్బాపూర్, కమలాపూర్ మండలం మాధన్నపేట గ్రామాల్లో తుది దశ పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన మండలాల్లోనూ రీసర్వే పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా తహసీల్దార్లు, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. -
ఎగిసిపడిన అగ్నికీలలు
హసన్‌పర్తి: నగరంలో తెల్లవారుజామున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. జవహర్‌కాలనీ క్రాస్ వద్ద శుక్రవారం ప్రభాత సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంతెత్తు ఎగిసిపడిన మంటలతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అర్పేశారు. నగరంలోని జవహర్‌కాలనీ రోడ్ నంబర్–9 ప్రాంతానికి చెందిన భూక్య భద్రు సరస్వతి ఎంటర్ ప్రైజెస్, సరస్వతి హార్డ్‌వేర్ అండ్ పెయింట్స్ షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 8 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటల ప్రాంతంలో షాపుల నుంచి మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు గుర్తించి భద్రుకు సమాచారం ఇచ్చారు. భారీ మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాసులు ఆందోళనకు గురయ్యారు. తమ ఇళ్లలోకి మంటలు వ్యాపిస్తాయేమోనని భయాందోళన చెందారు. తెల్లవారు వరకు కంటిమీద కునుకు లేకుండా ఉండిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. మంటలు అదుపులోకి తీసుకురావడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. కాగా, ఈ ప్రమాదంలో రెండు షాపుల్లో సుమారు రూ.3.50 కోట్ల నష్టం జరిగింది. భద్రు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రూ.3.50 కోట్ల విలువైన ఆస్తి నష్టం జవహర్ కాలనీలోని హార్డ్‌వేర్ షాపులో ఘటన మంటలు వ్యాపిస్తాయని కాలనీవాసుల భయాందోళన -
గురుకుల పాఠశాలల్లో వసతులు కరువు
పాలకుర్తి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడంలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. పాలకుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం తెలిసందే. దీంతో శుక్రవారం ఎర్రబెల్లి దయాకర్‌రావు గురుకుల పాఠశాల వద్దకు రావడంతో పోలీసులు, సిబ్బంది ఆయనను లోనికి అనుమతించలేదు. దీంతో పాఠశాల గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఇన్చార్జి ప్రిన్సిపాల్, వార్డెన్‌తో మాట్లాడి విద్యార్థినులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ పాఠశాల కార్యదర్శి శారద, కలెక్టర్ సందీప్ కుమార్ఝాతో ఫోన్లో మాట్లాడి పర్థితిని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేంవత్‌రెడ్డి, స్ధానిక ఎమ్మెల్యేకి చిత్తశుద్ది ఉంటే ఇప్పటికై న పాఠశాలల ను పట్టించుకుని విద్యార్థినుల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పసునూరి నవీన్, నల్లా నాగిరెడ్డి, పాము శ్రీనివాస్, కమ్మగాని విజయ, బొబ్బల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటనపై బీజేపీ, ఎమ్మార్పీఎస్, సీపీఎం, ఎస్ఎఫ్ఐ, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురుకులం గేటు ఎదుట శుక్రవారం ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్, సీపీఎం జిల్లా కమటీ సభ్యుడు చిట్యాల సోమన్న డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఘనటపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్, దొంగరి మహేందర్, పాకనాటి దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరుపెల్లి యాదగిరిస్వామ, ఎడవెల్లి సోమచందర్, రామచంద్రం, జలగం నరేష్ సైతం నిరసన తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురుకులంలో ఎలుకల కరచిన ఘటనపై మాజీ మంత్రి ఆందోళన లోపలికి అనుమతించకపోవడంతో గేటు ఎదుట ధర్నా -
ట్రాఫిక్‌కు ‘టీజీ–టీమార్స్’
సాక్షిప్రతినిధి, వరంగల్ : ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు వేయడం వరకే పరిమితం కాకుండా.. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? వాటిని ఎలా నివారించాలి? బ్లాక్స్పాట్లు ఎక్కడున్నాయి? పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలు, డ్రైవర్లు ఎవరు? ప్రమాదం తర్వాత క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేరుస్తున్నారా? వంటి అంశాలపై ఇక ప్రత్యేక పర్యవేక్షణ ఉండనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’(టీజీ–టీఎంఎఆర్ఎస్ (టీజీ–టీమార్స్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తోపాటు మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపై ఈ వ్యవస్థ ప్రభావం చూపనుంది. కొత్తగా జేసీపీ, అదనపు ఎస్పీలు.. ట్రాఫిక్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్, హైవే పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, డేటా విశ్లేషణ, ప్రాసిక్యూషన్, రైలు ప్రయాణ భద్రత తదితర అంశాలు టీజీ–టీమార్స్ పరిధిలో ఉంటాయి. ట్రాఫిక్ విభాగాలకు ఒకే విధమైన ప్రమాణాలు, సాంకేతికత, శిక్షణ, డేటా విశ్లేషణ, సమీక్ష విధానం ఉండేలా బ్యూరో పనిచేయనుంది. స్థానికంగా ట్రాఫిక్ విభాగాలపై సీపీలు, ఎస్పీల ఆపరేషనల్ కంట్రోల్ యథాతథంగా ఉంటుంది. అదనంగా పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)ను నియమించనున్నారు. జిల్లాల్లో అదనపు ఎస్పీ (ట్రాఫిక్) బాధ్యతలు చూస్తారు. జంక్షన్లు, సిగ్నళ్లు, రహదారి ఆక్రమణలు, ఈ–చలాన్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల విశ్లేషణ వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. ప్రమాదం జరిగితే ‘క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్’ ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ఉన్న సిబ్బందిలో ఒకరిని రోడ్ క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం, ప్రాంతాన్ని భద్రపరచడం, క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకోవడం, ప్రమాద వివరాలను ఈ–డీఏఆర్‌లో నమోదు చేయడం ఆయన బాధ్యత. ప్రమాదానికి అసలు కారణాలను గుర్తించి, పునరావృతం కాకుండా చర్యలు సూచించేలా దర్యాప్తు సాగనుంది. హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్.. మరణం లేదా తీవ్ర గాయాలకు దారితీసిన ప్రమాదాలను పోలీసు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రహదారి యాజమాన్య సంస్థ ఇంజనీర్, అవసరమైతే వైద్యాధికారి కలిసి పరిశీలిస్తారు. డ్రైవర్ తప్పిదం, వాహన లోపం, రోడ్డు పరిస్థితులు తదితర కారణాలను విశ్లేషించి నివేదిక రూపొందిస్తారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఓఆర్ఆర్, నోటిఫై చేసిన రాష్ట్ర రహదారులపై ప్రత్యేక హైవే పెట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, ప్రత్యేక పెట్రోల్ వాహనం ఉంటాయి. డ్యాష్‌బోర్డ్ కెమెరా, ఏఎన్పీఆర్, స్పీడ్ డిటెక్షన్, ఈ–చలాన్ సదుపాయాలతో పనిచేస్తాయి. స్పీడ్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, లేన్ ఉల్లంఘనలు, ఓవర్లోడింగ్ తదితరాలపై ఎన్ఫోర్స్మెంట్ చేపడుతారు. ఈ–చలాన్లు, ప్రమాదాలు, పెట్రోలింగ్ డేటాను విశ్లేషించి హైరిస్క్ కా రిడార్లు, క్రిటికల్ జంక్షన్లు, రెడ్స్పాట్లు, బ్లాక్స్పాట్లు గుర్తించనున్నారు. ఇక మోటార్ వెహికల్ చట్టాల కింద వసూలయ్యే కాంపౌండింగ్ ఫీజు/జరిమానాల్లో 40 శాతాన్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రత్యేక నిధికి జమ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగాక కాదు, ముందే మేల్కొనే వ్యవస్థ.. ట్రాఫిక్, రోడ్డు–రైలు భద్రతకు ప్రత్యేక బ్యూరో పోలీస్ కమిషనరేట్, జిల్లాల్లో అమలు.. జాయింట్ కమిషనర్, అదనపు ఎస్సీలు రోజువారీ కంట్రోల్ సీపీలు, ఎస్పీలదే.. పర్యవేక్షణ టీజీఎంఏఆర్ఎస్ది ప్రతీ ఘోర ప్రమాదంపై బహుళ శాఖల దర్యాప్తు.. హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్ -
రాత్రంతా నిద్రలేదు.. పొద్దున నీళ్లు లేవు!
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని డీవైఎస్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ విద్యార్థులు గురువారం రాత్రంతా జాగారం చేశారు. రాత్రి 10 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఓ వైపు దోమలు స్వైర విహారం చేయగా.. విద్యార్థినులు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఉదయం కాలకృత్యాలకు నీళ్లు లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్టల్ ఎదురుగా ఉన్న జిమ్నాస్టిక్స్ హాల్ వద్ద గల బోరు వేయడంతో బకెట్లలో నీళ్లు తెచ్చుకుని బడికి వెళ్లారు. అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారిందని ఉదయం స్టేడియంలో వాకింగ్ చేస్తున్న పలువురు వాపోయారు. – వరంగల్ స్పోర్ట్స్ -
పల్లెకు ‘జలసిరి’.. రోడ్లకు హ్యామ్జోష్
సాక్షిప్రతినిఽధి, వరంగల్: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానంతోపాటు నీటి భద్రత, ఉపాధి అవకాశాలు, శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా రెండు పూర్వ జిల్లాల్లో హ్యామ్ రోడ్ల పనులను అక్టోబర్ 25 నుంచి దశలవారీగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క (అనసూయ) తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో శుక్రవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, వీబీ జీరామ్‌జీ, ఎల్‌నినో సన్నద్ధత, హ్యామ్ రోడ్లపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్ల డించారు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు పనుల కదలిక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పనులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సీతక్క చెప్పారు. రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో 445 రహదారులను 1,366 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.1,130 కోట్ల వరకు వ్యయం కానుందని, ఇందులో 90 శాతం మేర ఇప్పటికే ఉన్న రహదారులను అభివృద్ధి చేయనుండగా.. 10 శాతం మేర కొత్త రహదారులు నిర్మించనున్నట్లు వివరించారు. ప్రతీ ఆవాసం నుంచి గ్రామానికి, గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారి సౌకర్యం ఉండాలన్నదే హ్యామ్ రోడ్ల లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధి అంటే కూలీ మాత్రమే కాదు.. ‘జలసిరి’తో నీటి భద్రత ఉపాధి హామీ (వీబీజీ రామ్‌జీ) పనులను పని దినాల కల్పనకే పరిమితం చేయకుండా గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించేలా మారుస్తున్నట్లు సీతక్క తెలిపారు. జలసిరి కార్యక్రమం కింద ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతీ ఊరికి ఊటకుంట.. ప్రతీ పంటకు పంటకుంట నిర్మించనున్నట్లు తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో వాగుల వద్ద చెక్‌డ్యామ్‌లు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గ్రామ సమగ్ర ప్రణాళికలను రూపొందించి ఆవిష్కరించనున్నట్లు సీతక్క తెలిపారు. గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ఏ పనులు అవసరమో గుర్తించి అభివృద్ధి మ్యాప్ తయారు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అందుబాటులో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపడా నీరు ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, హ నుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బా జ్పాయ్, సత్యశారద, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, అడిషనల్ కమిషనర్ రవీందర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఎన్సీ జగదీశ్వర్, వరంగల్ బల్దియా కమిషనర్ వెంకన్న, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉపాధి పనులతోపాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టి ఏజెన్సీ గ్రామాల్లో వాగులపై చెక్‌డ్యామ్‌లు అక్టోబర్ 2న గ్రామ సమగ్ర ప్రణాళికలకు శ్రీకారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం అధికారులతో మంత్రి ధనసరి సీతక్క సమీక్ష -
రూ.1,043 కోట్లు..
శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురుతో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.సాక్షిప్రతినిధి, వరంగల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకంలో వేలాది ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. తాజాగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు కలిపి 48,787 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 27,477 (56.32 శాతం) ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో రూ.1,043.48 కోట్లు ఖర్చు చేసినట్లు అసెంబ్లీలో సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇంత మొత్తం వ్యయం జరిగినప్పటికీ మంజూరైన ఇళ్లలో సగానికి కొద్దిగా మించి మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. 14,511 ఇళ్లు గ్రౌండింగ్ తర్వాతే.. ఉమ్మడి వరంగల్‌లో 41,988 ఇళ్లు గ్రౌండింగ్ అయినప్పటికీ వాటిలో 27,477 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే గ్రౌండింగ్ అయినా ఇంకా 14,511 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోలేదు. మరో 6,799 ఇళ్లు మంజూరైనప్పటికీ గ్రౌండింగ్‌కు రాలేదు. దీంతో మంజూరు చేసిన ఇళ్లను త్వరగా గ్రౌండింగ్‌కు తీసుకురావడంతోపాటు ఇప్పటికే పునాదులు పడిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. పెండింగ్ బిల్లుల విడుదలకు వన్ టైమ్ క్లియరెన్స్.. ఇందిరమ్మ ఇళ్లలో నిర్దేశించిన స్లాబ్ ఏరియాను మించి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బేస్మెంట్ చెల్లింపులు నిలిపివేస్తున్నారా? అనే అంశంపై అసెంబ్లీలో ప్రశ్న వచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ నిబంధనలను సడలిస్తూ, పెండింగ్ బిల్లుల విడుదలకు వన్ టైమ్ క్లియరెన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.. ఎవరైతే బేస్మెంట్ స్థాయి నిర్మాణం చేసుకున్నారో వారి ఇళ్లను ఎల్3 నుంచి ఎల్1 కేటగిరీలోకి మార్చి.. వెంటనే బిల్లులు చెల్లించనున్నారు. దీంతో బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం తగ్గి వేగం పుంజుకునే అవకావం ఉంటుందని గృహనిర్మాణ సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. తాజా నిర్ణయాల అమలుతో ఇళ్ల నిర్మాణం వేగం పెరుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 99483 93391పూర్తయినవిగ్రౌండింగ్ అయి పూర్తి కానివిమంజూరుగ్రౌండింగ్మొత్తం పెండింగ్గ్రౌండింగ్ కానివిజనగామ జోరు.. భూపాలపల్లి వెనుకంజ జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణం పూర్తి శాతంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. జనగామ జిల్లా 68.60 శాతంతో ముందంజలో ఉంది. ఇక్కడ 6,071 ఇళ్లు మంజూరు కాగా 4,165 ఇళ్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్ 63.16 శాతంతో రెండో స్థానంలో ఉంది. 11,218 మంజూరైన ఇళ్లలో 7,085 ఇళ్లు పూర్తయ్యాయి. ములుగు 59.79 శాతం, హనుమకొండ 54.82 శాతం పూర్తి చేశాయి. ఇక వరంగల్‌లో 47.64 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి 44.84 శాతంతో చివరి స్థానంలో ఉంది. అక్కడ 5,076 ఇళ్లు మంజూరు కాగా 2,276 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు అయిన ఖర్చు ఆరు జిల్లాల్లో 48,787 మంజూరు.. 27,477 మాత్రమే పూర్తి 68.60 శాతంతో జనగామ టాప్.. 44.84 శాతంతో భూపాలపల్లి లాస్ట్ ప్రభుత్వం తాజా నిర్ణయాలతో వేగం పెరిగేనా?జిల్లాల వారీగా వ్యయమిలా.. (రూ.కోట్లలో) -
ఇంతకీ.. ఏం పేరు?
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్న వేళ.. మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలి? అన్న దానిపై పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలనుంచి సూచనలు కోరడంతో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, నెటిజన్లు తమకు నచ్చిన పేర్లను సూచిస్తున్నారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్టు పేరు ఇప్పుడు ఓరుగల్లు చరిత్ర, కాకతీయుల వారసత్వం, తెలంగాణ సాంస్కతిక స్ఫూర్తి, ప్రముఖుల సేవల చుట్టూ తిరుగుతోంది. ఇదిలా ఉండగా ఎయిర్‌పోర్టు నిర్మాణశైలి కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా ఉండాలని సీఎం సూచించడంతో ఓరుగల్లు సంస్కృతి, కాకతీయ కళావైభవం ప్రపంచానికి మరింత లోతుగా తెలిసే అవకాశం ఉంది. తొలుత సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు. వరంగల్ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఆర్ఐఏ)’లేదా ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేఐఏ)’పేర్లను సూచించారు. ఓరుగల్లు వారసత్వం, సంస్కతి, చరిత్రకు తగిన పేరు ఉండాలని పేర్కొన్నారు. ఆయన సూచనపై సీఎం స్పందిస్తూ ‘దట్స్ ది స్పిరిట్’ అంటూ రియాక్ట్ అయ్యారు కూడా. ‘దసర’, ‘ది ప్యారడైజ్’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో ప్రతిపాదన చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు ‘సమ్మక్క–సారలమ్మ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’అని పేరు పెట్టాలని సూచించారు. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కూడా రాణి రుద్రమదేవి పేరును సూచించారు. ‘రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వరంగల్’అని పేరు పెట్టడం సముచితమని పేర్కొన్నారు. ఇదే సమయంలో నటుడు విజయ్ దేవరకొండ కూడా రుద్రమదేవి, కాకతీయ వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లకు మద్దతుగా స్పందించారు. సినీ నటుడు నితిన్ కూడా బుధవారం ‘రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’పేరును సూచించారు. దీంతో సినీ రంగం నుంచి రుద్రమదేవి పేరుకు వస్తున్న మద్దతులో మరో పేరు చేరింది. అదేవిధంగా పలు దళిత సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ చరిత్రకు అనుసంధానమైన పేరు ఉండాలని పలువురు నెటిజన్లు, పౌరులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు కూడా ప్రతిపాదనల్లోకి వచ్చింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సీఎం పిలుపునకు స్పందిస్తూ మా మునూరు ఎయిర్‌పోర్టుకు పీవీ పేరు పెట్టాలని సూ చించారు. ప్రస్తుత వరంగల్ ప్రాంతానికి చెందిన పీ వీ 1991–96 మధ్య ప్రధానమంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక పీవీ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు మరికొందరు నా యకులు, ఆయన కుటుంబం/ట్రస్ట్‌కు సంబంధించిన వ ర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో పీవీ పేరు కూ డా ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటిగా మారింది. కాగా పేర్ల చర్చలో తాజాగా మరో ప్రతిపాదన చేరింది. ఎ ంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నెల 22న సీ ఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తూ వరంగల్ ఎయిర్‌పోర్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ పేరు పెట్టాలని కోరారు. అలావుద్దీన్ 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వ్యతిరేక పో రాటంలో పాల్గొన్నారని, అనంతరం శిక్ష అనుభవించారని ఓవైసీ ఆ లేఖలో పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ‘మామునూర్’ హీట్ తెరపైకి రోజుకో పేరు.. రుద్రమ.. కాకతీయ.. సమ్మక్క–సారలమ్మ .. పీవీ.. అలావుద్దీన్.. అంబేడ్కర్! నిర్మాణశైలిలో కాకతీయ కళావైభవం, పరాక్రమం ప్రతిబింబించాలన్న సీఎం ఎవరికి వారుగా సామాజిక మాద్యమాల్లో ఆన్లైన్ పోల్ నిర్వహణసీఎం పిలుపుతో సోషల్ మీడియాలోనూ పేర్లపై చర్చ సాగుతోంది. కొందరు రాణి రుద్రమదేవి, మరికొందరు కాకతీయ, సమ్మక్క–సారలమ్మ పేర్లతో ఎయిర్‌పోర్టు గేట్లు, టెర్మినల్ డిజైన్లను ఏఐ ద్వారా రూపొందించి షేర్ చేస్తున్నారు. పీవీ నరసింహారావు, ఓరుగల్లు, ప్రతాపరుద్ర, ప్రొఫెసర్ జయశంకర్, సర్వాయిపాపన్నల పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. మరోవైపు కొందరు ఆన్లైన్ వేదికగా పోల్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు, వివిధ వర్గాలు చేసిన సూచనలు మాత్రమే. తుది పేరు ఇంకా ఖరారు కాలేదు. -
నాణ్యత లేకపోతే బిల్లుల్లో కోత
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే బిల్లుల్లో కోత విధిస్తానని బల్దియా కమిషనర్ టి.వెంకన్న కాంట్రాక్టర్లను హెచ్చరించారు. శుక్రవారం వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో ఆయన తనిఖీ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తాగునీటి పైప్‌లైన్ పనులు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ అనుసంధాన పనులు తనిఖీ చేశారు. కాకతీయ యూనివర్సిటీ రోడ్డు రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైప్లైన్ల పురోగతిని కమిషన్ పరిశీలించారు. తనిఖీల్లో ఎస్ఈ రాజ్‌కుమార్, రాజ్‌కుమార్, రాజారెడ్డి, ఈఈ రవికుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, డీఈ శ్రీకాంత్, ఏఈలు ఉన్నారు. -
‘సూపర్’ పనుల్లో వేగం పెంచాలి
కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎంఓ కార్యాలయం ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని శుక్రవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, కార్యదర్శి కె.మాణిక్ రాజ్, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పనుల ప్రస్తుత పరిస్థితి, వివిధ విభాగాల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి, భవన నిర్మాణం పనులను క్షుణ్ణంగా పరిశీలించి, ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను, చేపట్టాల్సిన పనులను ప్రణాళికబద్దంగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణం, నాణ్యత, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిన అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేనలు అందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, కేంఎసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు, వివిధ శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించిన సీఎంఓ ఉన్నతాధికారులు -
పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలి
● వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ ఖిలా వరంగల్: పర్యాటకరంగం దేశ ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ పేర్కొన్నారు. పర్యాటకరంగ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. రంగశాయిపేట జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ డి.సంపత్ అధ్యక్షతన శుక్రవారం పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఐఈఓ హాజరై వేడుకలను ప్రా రంభించి మాట్లాడారు. చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లకు శ్రీకారం
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో 2026–27 సీజన్ నూతన పత్తి కోనుగోళ్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా నల్లబెల్లి మండలం యం.వి తండాకు చెందిన జి.రమణ పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. జెండాపాట నిర్వహించి తొలి పత్తి క్వింటాకు రూ.8,775 ధర నిర్ణయించారు. కొత్త సీజన్లో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మంచి ధర రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈసందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంకతోపాటు పాలకవర్గ సభ్యులను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి సన్మానించారు. యార్డును పరిశీలించిన సీపీ శ్వేత వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్, శ్వేత శుక్రవారం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం మార్కెట్‌కు వచ్చే మిర్చి రకాల వివరాలతో పాటు వాటికి లభిస్తున్న ధరలపై చైర్పర్సన్ ఎర్రప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు సీపీ ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల గురించి ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, వైస్‌చైర్మన్ బండి జనార్దన్, కమిటీ సభ్యులు గజ్జల శ్యామ్, దుగ్యాల గోపాల్‌రావు, కందుకూరి పూర్నచందర్, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మడూరి వేద ప్రకాశ్, కాటన్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు, అధికారులు, ఎస్సై గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు ఏనుమాముల మార్కెట్లో ప్రారంభమైన సీజన్ క్వింటాకు రూ.8,775 పలికిన ధర -
రోహిత్‌కు ఉపాధ్యాయుల ఆర్థిక సాయం
గార్ల: ‘బాలుడికి ప్రాణభిక్ష పెట్టండి’ అనే శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఉపాధ్యాయులు స్పందించి రూ.11,000 ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన 14 ఏళ్ల రోహిత్‌కు బ్లడ్ కేన్సర్ సోకింది. రోహిత్ ప్రస్తుతం ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో పినిరెడ్డిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన హెచ్ఎం సంతు, ఉపాధ్యాయులు భాస్కర్, ఈరా, అనిల్, వీరస్వామి, శోభారాణి, కిరణ్ కలిసి రూ.11,000 నగదును బాలుడి వైద్యం కోసం శుక్రవారం రోహిత్ అక్కకు అందజేశారు. అదే విధంగా మరికొంత మంది ఫోన్‌పే ద్వారా కొంత నగదు పంపించినట్లు బాలుడి తల్లి కుమారి తెలిపారు. సాక్షి కథనానికి స్పందన బాలుడి వైద్య ఖర్చులకు రూ.11,000 అందజేత -
పెసర్లకు రికార్డు ధర
● క్వింటాకు రూ.9,100 ● ఏనుమాముల మార్కెట్లో కొత్త పెసర్లకు డిమాండ్ ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు కొత్త పెసర్లు వచ్చాయి. శుక్రవారం యార్డులో జరిగిన కొనుగోళ్లలో పెసర్లకు ఊహించని ధర లభించింది. గతంలో క్వింటాకు రూ.7వేలు ఉన్న ధర ఒక్కసారిగా క్వింటాకు గరిష్టంగా రూ.9,100 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త పంటకు తొలి రోజే మంచి ధర రావడంతో పెసర్లు సాగు చేసిన రైతుల్లో ఆనందం నెలకొంది. వికారాబాద్‌లో కోణార్క్ హాల్టింగ్ కాజీపేట రూరల్: వరంగల్, కాజీపేట మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు వికారాబాద్ రైల్వే స్టేషన్లో తాత్కాలికంగా హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29, 30వ తేదీల వరకు భువనేశ్వర్–ముంబాయి (11020) వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ హాల్టింగ్ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. పోక్సో కేసులో నిందితుడికి జైలు ములుగు రూరల్: ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితుడు మాతూరి రమేష్‌పై నమోదైన కేసులో ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు కమ్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి సూర్యచంద్రకళ తీర్పు వెల్ల డించారు. కఠిన కారాగార శిక్షతోపాటు రూ.8,500 జరిమానా, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులైన మమన్ భట్, సీఐ సూర్య ప్రకాశ్, ఎస్ఐటీవీఆర్ సూరి, కోర్టు మానిటరింగ్ అధికారి డీఎస్పీ కిషోర్, కో ర్టు లైజనింగ్ అధికారి కుమారస్వామి, స్పెషల్ పబ్లిక్ స్రాసిక్యూటర్ రామ్ సింగ్, సీడీఓలు మౌనిక, మంగీలాల్‌ను ఎస్పీ అభినందించారు. ఆటో డ్రైవర్ ఆత్మహత్య కాశిబుగ్గ: వరంగల్ ఎల్బీ నగర్‌లోని తారకరామ వీధిలో ఓ ఆటో డ్రైవర్ ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్వ సుధాకర్(53) ఆటో నడుపుతూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతోపాటు కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో నిత్యం ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య మంజుల ఇంతెజార్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిషిత కోరిక నెరవేర్చిన మంత్రి సీతక్క హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 18 ఏళ్ల నిరుపేద యువతి కొల్లూరి రిషిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. డీఎండీ వ్యాధి కారణంగా రెండు కాళ్లు పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్న రిషితకు రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కతో కలిసి సెల్ఫీ దిగాలనే కోరిక ఉంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి సీతక్క శుక్రవారం సాయంత్రం రిషిత నివాసానికి వెళ్లి సెల్ఫీ దిగి ఆమె కోరికను నెరవేర్చారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
నేడు జనగామలో మంత్రి పొంగులేటి పర్యటన
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో నేడు (శనివారం) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణంలోని 13వ వార్డులో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు హాజరుకానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లోని కబడ్డీ హాల్లో శుక్రవారం నిర్వహించిన 70వ పాఠశాల క్రీడల సమాఖ్య హనుమకొండ జిల్లా స్థాయి అండర్–17 కబడ్డీ బాలబాలికలు ఎంపిక పోటీలు సందడిగా కొనసాగాయి. జిల్లాలోని 14 మండలాల నుంచి 336 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసుదేవరావు తెలిపారు. ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా డీవైఎస్ఓ ప్రశాంత్, పీఈటీల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పార్థసారఽథి, కార్యదర్శి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్, వెంకటేశ్వర్లు, పీడీ రాజేశ్వర్, పావని, రెబెకా, కిషన్, శ్యామ్, కిరణ్, జ్యోతి, రాజేశ్వరి, హారిక, శారద, వనజ, ధనలక్ష్మి, స్వప్న, సురేశ్, వినయ్, సుభాష్, సునీల్, రాజు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ కావ్య విజ్ఞప్తి హన్మకొండ చౌరస్తా: వరంగల్‌లో ప్రస్తుతం ఉన్న పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం స్థానంలో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని కోరాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య.. సీఎం రేవంత్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధిపై అనేక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 2017, మార్చి 29న ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా ప్రాంత ప్రజలకు సేవలు అందుతున్నాయని, పాస్‌పోర్ట్ సేవలకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. కేయూకు పీఎం ఉషా నిధుల మంజూరు, వరంగల్ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి కేంద్ర నిధులు, వరంగల్‌లో నైలిట్, సీఐటీడీ కేంద్రాల ఏర్పాటు అంశాలను వివరించారు. వివిధ అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కావ్య తెలిపారు. -
ఇంధన పొదుపుపై అవగాహన అవసరం
వరంగల్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ కాళోజీ సెంటర్: ఇంధన పొదుపుపై అవగాహన పెంచుకోవాలని వరంగల్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి జాతీయ సైన్స్ సెమినార్–2026 శుక్రవారం నిర్వహించారు. ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ – 2047: అవకాశాలు–సవాళ్లు’ అంశంపై 18 పాఠశాలల విద్యార్థులు ప్రజంటేషన్లు ఇచ్చారు. జెడ్పీహెచ్ఎస్ మామునూరు క్యాంపునకు చెందిన సహస్ర (గైడ్ టీచర్ అనితాలత) ప్రథమ బహుమతి, గీసుకొండ మండలం వంచనగిరిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన హుమెరా ఫిర్దౌస్ ద్వితీయ, ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఎ.నైషిక తృతీయ బహుమతి సాధించారు. హరిప్రియ, సీహెచ్.రశ్విత కన్సోలేషన్ బహుమతులు పొందారు. విజేతలకు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో షీల్డులు, విద్యాశాఖ తరఫున ప్రశంసపత్రాలు అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన సహస్ర ఈ నెల 29న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సెమినార్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సురేశ్‌బాబు, హెచ్ఎం శ్రీనివాసరావు, సైన్స్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
అప్రమత్తతే శ్రీరామరక్ష..
హన్మకొండ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వర్షాలను ఎదుర్కొనేందుకు పూర్తి సమాయత్తంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వినియోగదారులు విద్యుత్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి.. విద్యుత్‌పై అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో తరచూ విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. తడిదుస్తులు ఆరేస్తూ, మోటార్లు ఆన్ చేస్తూ, మరమ్మతుల సమయంలో విద్యుత్ తీగలు పట్టుకుని, తెగిన తీగల కారణంగా తరచూ వ్యక్తుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తెగిన విద్యుత్ లైన్లు, టాన్స్‌ఫార్మర్ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. ఫలితంగా రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. విద్యుత్ సిబ్బంది భద్రతా చర్యలు పాటించకపోవడంతోపాటు ఎల్సీల్లో నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విద్యుత్ సంస్థల యాజమాన్యం హెచ్చరించినా, జాగ్రత్తలు పాటించాలని సూచించినా సిబ్బంది, వినియోగదారులు భద్రతను విస్మరించి విలువైన ప్రాణాలను పోగొట్టకుంటూ కుటుంబాన్ని దుఖఃసాగరంలో ముంచుతున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సూచిస్తోంది. దీనిని ఉద్యోగులు, వినియోగదారులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. తడిసిన పరికరాలను తాకొద్దు.. ప్రజలందరూ విద్యుత్‌పై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం సమయంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, పరికరాలు, స్టే వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను తాకరాదు, తెగిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదు. అవసరం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించొద్దు. తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు, మీటరు బోర్డులు, మోటార్లు వంటి విద్యుత్ పరికరాలను తాకరాదు. సెల్‌ఫోన్ చార్జింగ్‌లో ఉండగా మాట్లాడొద్దు. నాణ్యమైన ఎర్తింగ్‌తో పాటు ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన విద్యుత్ పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. పాడైన వైర్లను వెంటనే మార్చాలి. రైతులు వ్యవసాయ మోటార్లను ఆన్ చేసే ముందు స్టార్టర్లు, వైర్లు, స్విచ్‌లను పరిశీలించాలి. మోటార్లు, పంపుసెట్లకు సరైన ఎర్తింగ్ చేయించాలి. వ్యవసాయ భూముల్లో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చట్టవిరుద్ధం. ప్రాణాంతకం.వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి వినియోగదారులకు టీజీ ఎన్పీడీసీఎల్ అధికారుల సూచనలుపిల్లలను విద్యుత్ స్తంభాల వద్ద ఆడనీయొద్దు.. పిల్లలను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, మీటరు బోర్డుల వద్ద ఆడనీయొద్దు. పశువులను విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు కట్టెయొద్దు. షాక్‌కు గురైన వ్యక్తిని నేరుగా తాకకుండా, విద్యుత్ ప్రసారం జరగని వస్తువులతో వేరు చేయాలి. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి వైద్య సాయం అందించాలి.విద్యుత్‌పై నిర్లక్ష్యం తగదు..విద్యుత్‌పై నిర్లక్ష్యం తగదు. నాసిరకం వైరింగ్, నాణ్యతలేని విద్యుత్ పరికరాలు, ఎర్తింగ్ లేకపోవడం, అనధికారిక మరమ్మతులు, నిర్లక్ష్యమే అధిక శాతం విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రమాదాలను పూర్తిగా నివారించొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో లేదా విద్యుత్ లోపాలు గమనించిన వెంటనే టీజీ ఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలి. ఎ.ఆనందం, బి.సామ్యా నాయక్, ఎస్ఈలు వరంగల్, హనుమకొండ -
వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్ మీదుగా పొదనూర్–బరౌని –పొదనూర్ మధ్య పది ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ఈ రైళ్లను అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు నడిపించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ప్రయాణించే 5 రైళ్లు పొదనూర్–బరౌని (06021) ఎక్స్‌ప్రెస్‌గా ప్రతీ ఆదివారం పొదనూర్‌లో బయలుదేరి మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుంటుంది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ప్రయాణించే 5 రైళ్లు బరౌని–పొదనూర్ (06022) ఎక్స్‌ప్రెస్‌గా బరౌనిలో ప్రతీ బుధవారం బయలుదేరి మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లకు అప్ అండ్ డౌన్లో తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలర్పేటయ్, కట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బెతుల్, ఇటార్సీ, పిపరియా, గద్వారా, జబల్పూర్, కట్నీ, మహీర్, సంత, మాణిక్పూర్, ప్రయాగ్‌రాజ్, చౌఖీ, చూనార్, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, బాక్సర్, ఆరా, దానాపూర్, పాటలీపుత్ర, సోనాపూర్, హజ్‌పూర్, షాపూర్లో హాల్టింగ్ కల్పించారు. -
రెడ్‌క్రాస్ ఎన్నికలకు 19 నామినేషన్లు
హన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. సుబేదారిలోని రెడ్‌క్రాస్ భవన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల పరిశీలకుడు, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.శేషాద్రి, ఎన్నికల అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నామినేషన్ల పరిశీలన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు పరిశీలన ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు. -
మళ్లీ తెరపైకి ఫిరాయింపుల వివాదం!
శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026దానం తర్వాత.. కడియం సంగతేంటి? ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురుతో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.సాక్షిప్రతినిధి, వరంగల్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఉమ్మడి వరంగల్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు వేసిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వ్యవహారంలో కడియం శ్రీహరితోపాటు దానం నాగేందర్‌పై కూడా అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఇద్దరి విషయంలోనూ విచారణ జరిపి, వారి వాదనలు స్వీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గత మార్చి 11న ఇద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఫిరాయింపునకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో కడియం శ్రీహరి వ్యవహారానికి అప్పట్లో తెరపడినట్లయింది. ‘కడియం’పై ఆ ప్రభావం ఎంత? మార్చి 11న స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సెప్టెంబర్ 18న తెలంగాణ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23నుంచి ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దయినట్లుగా కోర్టు పేర్కొంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా కూడా ప్రకటించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అదే రోజు స్పీకర్ కొట్టివేసిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ విషయంలోనూ తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మొదలైంది. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 99483 93391వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువులో పేరుకుపోయిన గణపతి విగ్రహాల వ్యర్థాలునిమజ్జనానికి వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువుకు తరలుతున్న వినాయక విగ్రహాలు ‘కడియం’పై చేసిన ఫిర్యాదులేంటి? 2023, డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 2024 మార్చి 31న సీఎం రేవంత్‌రెడ్డి, అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కడియం శ్రీహరి పార్టీ మార్పు, కుమార్తె తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేయడం, బీఆర్ఎస్ కేసీఆర్ తదితరులపై చేసిన విమర్శలు కూడా అప్పట్లో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్ దానంపై హైకోర్టు వేటును సమర్థించిన సుప్రీం.. మార్చి 11న ఇద్దరినీ అనర్హతనుంచి తప్పించిన స్పీకర్ స్పీకర్ తీర్పుతో శ్రీహరికి అప్పట్లో ఊరట.. తాజాగా మళ్లీ చర్చకు ఫిరాయింపుల వ్యవహారం -
ఎంప్లాయీస్ యూనియన్ కూటమిని గెలిపించాలి
హన్మకొండ: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ (థామస్ రెడ్డి వర్గం) కూటమిని గెలిపించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ భద్రకాళి ఆలయంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వరంగల్ రీజియన్ కార్యదర్శి శ్రీనివాస్, ఎన్ఎంయూ వరంగల్ రీజియన్ కార్యదర్శి సి.హెచ్.యాకస్వామి, నాయకులు పూజలు నిర్వహించి గుర్తింపు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం హనుమకొండలోని వరంగల్–1 బస్ డిపోకు చేరుకుని ప్రచారం చేశారు. ఇక్కడి నుంచి వరంగల్–2 డిపో, వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాల యం, ములుగు రోడ్‌లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి చేరుకుని కార్మికులు, ఉద్యోగులను కలిసి కూటమిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఎంప్లాయీస్ యూనియన్ పాటుపడుతుందన్నారు. క్లాస్–3కి ఎంప్లాయీస్ యూనియన్‌కు, క్లాస్–6కు ఎన్ఎంయుకూ ఓటు వేయాలని కోరారు. రీజియన్ చైర్మన్ సంకటాల రవికుమార్, ప్రెసిడెట్ మురళి, నాయకులు వి.కె .స్వామి, ఎం.రాజు, బి.రాజు, మహేందర్, విరాట్, తదితరులు పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న -
ఊరటనిచ్చిన వర్షం
● నగరంలో చల్లబడిన వాతావరణం ● పంటలకు ప్రాణం పోసిన వానహన్మకొండ/వరంగల్ అర్బన్/న్యూశాయంపేట: ఇన్నాళ్లు వర్షాభావ పరిస్థితులతో నగర జనం ఉక్కిరిబిక్కిరైంది. బుధ, గురువారాల్లో కురిసిన వర్షానికి కురిసిన వర్షంతో ఉపశమనం లభించినట్లయ్యింది. రైతులు సాగు చేసిన పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో అత్యఽధికంగా 113.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో 104.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్లలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.ఆనందం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే సమస్యను పరిష్కరించి అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని వెల్లడించారు. అప్రమత్తమైన బల్దియా డీఆర్ఎఫ్ భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రోడ్డుపై విరిగిపడిన చెట్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డీఆర్ఎఫ్ బృందాలు గురువారం వేగంగా తొలగించి రాకపోకలను పునరుద్ధరించాయి. హనుమకొండ ఎకై ్సజ్ కాలనీ, ప్రభుత్వ టీబీ ఆస్పత్రి, దేవన్నపేట ప్రధాన రహదారి, సమ్మయ్యనగర్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ బందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రభుత్వ టీబీ ఆస్పత్రి వద్ద విద్యుత్ స్తంభం, తీగలపై పడిన భారీ చెట్లను తొలగించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శంకర్లింగం నేతత్వంలో జరిగిన ఈ చర్యల్లో ఫైర్ ఆఫీసర్ రాజేశ్వర్‌రావు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అప్రమత్తం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సూపరింటెండింగ్ ఇంజనీర్లు ఎ.ఆనందం, బి.సామ్యానాయక్ తెలిపారు. వర్షం వల్ల తలెత్తే సమస్యలు ఎదుర్కొనుదేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సిద్ధంగా ఉందని వారు వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా స్థితిని పరిశీలించాలని ఆదేశించారు. వినియోగదారులకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 87124 84506, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని కోరారు. వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచామని తెలిపారు. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలి హన్మకొండ అర్బన్: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో వర్షప్రభావం, ప్రస్తుత పరిస్థితులు, గురు, శుక్రవారాల్లో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వర్షపాతం, చెరువులు, వాగులు, వంకలు, రహదారుల పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరి ధిలో నాలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి ప్రధాన నాలాల్లో వరద సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్ర జల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై కంట్రోల్ రూమ్‌లో అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. -
వరంగల్‌లో కాస్మోస్ బ్యాంక్ శాఖ ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: పుణేకు చెందిన కాస్మోస్ సహకార బ్యాంక్ తెలంగాణలో మరో రెండు శాఖలను ప్రారంభించింది. హనుమకొండ, వరంగల్‌లో ఏర్పాటైన బ్రాంచ్ బ్యాంక్‌కు 194వది కాగా, హైదరాబాద్ ఎల్బీనగర్లో ప్రారంభమైంది 195వది. వరంగల్ బ్రాంచ్‌ను బ్యాంక్ డైరెక్టర్ అజిత్ గిజారే, ఎల్బీనగర్ బ్రాంచ్‌ను చైర్మన్ సచిన్ ఆప్టే ప్రారంభించారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో బ్యాంక్‌కు ఏడు శాఖలు ఉన్నాయని సచిన్ తెలిపారు. దక్షిణ భారత్ విస్తరణలో భాగంగా కోయంబత్తూర్, విశాఖపట్నం, విజయవాడ, హుబ్లీ, చైన్నె, తిరుప్పూర్‌లో శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా 200 శాఖలకు చేరుకోవడమే లక్ష్యమన్నారు. కొంకణ్ ప్రాంతంలోనూ శాఖలను ప్రారంభించే ప్రణాళిక ఉందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఉపాధ్యక్షుడు డా.యశ్వంత్ కాసర్, ఇతర ఉన్నతాధికారులు, ఖాతాదారులు పాల్గొన్నారు. దక్షిణ భారత్‌లో మరిన్ని శాఖలకు ప్రణాళిక -
సదనం నుంచి బాలిక దత్తత
హన్మకొండ అర్బన్ : హనుమకొండ ప్రభుత్వ బాలికల సదనంలోని బాలికను గురువారం దత్త త ప్రాధికార సంస్థ ఆదేశాల మేర కు నల్లగొండ జిల్లాకు చెందిన దంపతులకు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తన చాంబర్లో దత్తత ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు బాలికను బాగా చ దివించి, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేలా చూడాలని కో రారు. జిల్లా సంక్షేమాధికారి ఎం.విశ్వజ, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ సీహెచ్. అవంతి, ప్రభుత్వ బాలికల సదనం సూపరింటెండెంట్ ఎం.కల్యాణి, ఇన్చార్జి డీసీపీఓ ఎస్. ప్రవీణ్‌కుమార్, సోషల్ వర్కర్ సంగి చైతన్య పాల్గొన్నారు. -
యువశక్తి నాయకత్వ వికాసంలో ఎన్ఎస్ఎస్ కీలకం
కేయూ క్యాంపస్ : యువశక్తి నాయకత్వ వికాసంలో జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) కీలకపాత్ర పోషిస్తుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కేయూ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక సేవా, పర్యావరణ పరిరక్షణ, యువత నాయకత్వ వికాసంలో విశిష్టసేవలు అందిస్తూ కేయూ ఎన్ఎస్ఎస్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. యూనివర్సిటీ పరిధిలో 356 ఎన్ఎస్ఎస్ యూనిట్లతో 35,600 మంది వలంటీర్లు తమ సేవలు అందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా కేయూ ఎన్ఎస్ఎస్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. దేశాభివృద్ధిలో వికసిత్భారత్, రైజింగ్ తెలంగాణ అభివృద్ధిలో యువతశక్తి భాగస్వామ్యమే కీలకమన్నారు. తెలుగు అకాడమీ చైర్మన్, కేయూ ఎన్ఎస్ఎస్ పూర్వ కోఆర్డినేటర్ కె. వెంకటనారాయణ మాట్లాడుతూ లక్షల మంది భక్తులు పాల్గొనే మేడారం జాతరలోనూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తమ సేవలను అందిస్తున్నారన్నారు. 50వసంతాల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు అద్భుత సేవలు అందించారని పేర్కొన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ, ఎన్ఎస్ఎస్ పూర్వపు కోఆర్డినేటర్ అజ్మీరా సీతారాంనా యక్ మాట్లాడుతూ యువతను తీర్చిదిద్దే ఉద్యమ మే ఎన్ఎస్ఎస్ అన్నారు. కేయూలో ఇంకా ఎన్ఎస్ ఎస్ సేవల విస్తృతికి క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ భవన నిర్మాణానికి తనవంతుగా కృషిచేస్తానని, అందుకు కొంత స్థలం కూడా కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఎ న్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, యూని వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, కేయూ పూర్వ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు ఎం. కిష్టయ్య, జి. బాలస్వామి, ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్, చిర్రరాజు, కేయూ ఇంజనీరింగ్ కళా శాల ప్రిన్సిపాల్ ఎన్. రమణ పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవంలో కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆపండి
● కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఫైర్ వరంగల్ చౌరస్తా: పేదల ఆస్పత్రి ఎంజీఎంలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్ హడావుడి, అబద్ధాలు, నరేందర్ గొప్పలు బూటకమని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ విమర్శించారు. వరంగల్ లక్ష్మీపురంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పనులు పూర్తి చేయలేదని, స్వలాభం కోసమే నూతన ఆస్పత్రి నిర్మాణం చేపట్టి పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఆస్పత్రిలో కనీస వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని, త్వరలో సేవలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికై నా బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆపకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అయూబ్ హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అసమర్థ పాలనతోనే విద్యుత్ సంక్షోభం
● మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా ● బీఆర్ఎస్ బృందం కేటీపీపీ సందర్శనగణపురం: కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని.. దీంతో రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)ను గురువారం బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలు సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నా వినియోగించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోందన్నారు. సింగరేణి సంస్థకు జెన్కో సంస్థ రూ.52 వేల కోట్ల బకాయి పడిందని.. దీంతో సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేయకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదన్నారు. తమ నాయకుడు కేటీఆర్ మాట్లాడితే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత డబ్బు ఖర్చు అయిన ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. కేటీపీపీలో 1,100 మెగా విద్యుత్ ఉత్పత్తికిగాను కేవలం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే అవుతుందన్నారు. అధికారులను అడిగితే ఉత్పత్తి తగ్గిన విషయం వాస్తవమేనన్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని సరిపడా చేసుకునే ప్లాంట్లు ఉన్నప్పటికీ చేతగానితనంతో ఉత్పత్తి చేయలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సింగరేణి సంస్థ 2,900 కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. జెన్కోకు రోజుకు 8వేల టన్నుల బొగ్గును సింగరేణి ఇవ్వాల్సి ఉండగా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు నెలల బొగ్గు నిల్వలు ఉండేవన్నారు. ఇప్పుడు కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు లేవన్నారు. తమ ప్రభుత్వ పాలనలో 24 గంటల విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించామన్నారు. దేవాదులనుంచి గోదావరి నీటిని ఎత్తిపోసే తెలివి లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, శంకర్ నాయక్, నాయకులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, బడే నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.గంటపాటు ఉద్రిక్తత బీఆర్ఎస్ బృందాన్ని మొదట కేటీపీపీ లోపలికి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహానికి గురైన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు బారికేడ్లను నెట్టివేసి ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. స్పందించిన పోలీసులు వారి సొంత పూచీకత్తుపై ప్లాంటులోకి అనుమతించారు. ప్లాంటును సుమారు గంటకుపైగా పరిశీలించిన బృందం సభ్యులు అనంతరం అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
సేవకు సత్కారం.. ప్రతిభకు పురస్కారం
ముగ్గురు విశ్రాంత ఆచార్యులకు ప్రతిభా పురస్కారాలు● వారి సాహిత్య, సంగీత, పరిశోధన సేవలను కొనియాడిన సాహిత్యలోకం ● అక్టోబర్ 3న బాచుపల్లిలో అవార్డుల ప్రదానంహన్మకొండ కల్చరల్: తెలుగు సాహిత్యం, సంగీతం, జానపద పరిశోధన రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖలు.. విశ్రాంత ఆచార్యులు కాత్యాయనీ విద్మహే, దుడ్డు సీతారామయ్య, వరంగల్ విద్యారణ్య సంగీత నృత్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నాగపట్ల భక్తవత్సలరెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు–26 అందించనుంది. హైదారాబాద్ బాచుపల్లిలోని యూనివర్సిటీ క్యాంపస్ ప్రాంగణంలో.. అక్టోబర్ 3న వీరు పురస్కారాలు అందుకోనున్నారు. ఈ ముగ్గురు వరంగల్‌లో ప్రభుత్వ శాఖల్లో సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు. సాహిత్య పరిశోధన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సుఽధీర్ఘకాలం అధ్యాపకురాలిగా, ప్రొఫెసర్‌గా కాత్యాయనీ విద్మహే సేవలందించారు. హాస్టల్ వార్డెన్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్, తెలుగు విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్, విద్యార్ధి సంక్షేమ కేంద్రం డైరెక్టర్, మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ తదితర బాధ్యతలు నిర్వహించారు. తెలుగు సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనలు చేసిన ఆమె.. మహిళా సాహిత్యం, సాహిత్యంలో లింగ దృక్పథం, రాజకీయ ఆర్థిక భావనలపై అధ్యయనం చేశారు. తెలుగు సాహిత్యంపై 412 పరిశోధన పత్రాలు, 27 పుస్తకాలు ప్రచురించారు. 30 పుస్తక సమీక్షలు, 55 ముందు మాటలు రాశారు. 34 సాహిత్య రచనలకు సంపాదకత్వం వహించారు. దేశవ్యాప్తంగా 200కుపైగా జాతీయ స్థాయి సదస్సుల్లో పరిశోధన పత్రాలు సమర్పించి, ఉపన్యాసాలు ఇచ్చారు. ఆమె పర్యవేక్షణలో 12 మంది పరిశోధకులు పీహెచ్డీ, 31 మంది ఎంఫిల్ పట్టాలు పొందారు. యూజీసీ, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాయోజిత పలు పరిశోధన ప్రాజెక్టుల్లో పనిచేశారు. మహిళా సాహిత్యంపై నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్లు, మహిళా రాజకీయ సాధికారతపై చేపట్టిన క్షేత్రస్థాయి అధ్యయనాలు, మహిళా అధ్యయనాల జర్నల్ ప్రారంభం వంటి కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం మహిళా రచయితల సాహిత్యంపై రచనలు చేస్తూ, పలు సాహిత్య సంస్థలతో కొనసాగుతున్నారు. నిత్య పరిశోధకుడు భక్తవత్సలరెడ్డి 1995లో అప్పటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం వరంగల్ ప్రాంగణంలో ఆచార్యులుగా, డీన్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సుదీర్ఘకాలం భక్తవత్సలరెడ్డి విశేష సేవలందించారు. 2008లో ఉద్యోగ విరమణ చేశారు. 2007 నుంచి 2008 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా కొనసాగారు. గ్రామీణ విజ్ఞానం, జాతర్లు, కొలుపులు, తిరునాళ్లు, జానపద కళారూపాలు, దక్షిణ భారతీయ అనుష్టాన సంప్రదాయం మీద అనేక పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. ఆయన పర్యవేక్షణలో ఎందరో విద్యార్ధులు జానపద గిరినులపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందారు. చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా వీణా నాదం సంగీత కుటుంబంలో జన్మించిన దుడ్డు సీతారామయ్య 2011 నుంచి 2014 వరకు వరంగల్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ దేశాధినేతల, ప్రముఖుల సమక్షంలో ఆయన వీణా కచేరీలు నిర్వహించారు. పూర్వ విధ్వాంసుల సంప్రదాయంలో వీణను నిలబెట్టి వాయించే ఊర్ధ్వ వీణ పద్ధతిలో ప్రదర్శనలివ్వడం ఆయన ప్రత్యేకత. వీణలోని తానంను సులభంగా నేర్చుకునేందుకు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఎందరికో సంగీత పాఠాలు నేర్పిన ఈయన సేవలకు పురస్కారం దక్కడంపై సంగీతాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అధికార లాంఛనాలతో ఎస్సై అంత్యక్రియలు
రాయపర్తి: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన బందోబస్తుకు వెళ్లి హిట్ అండ్ రన్లో దుర్మరణం చెందిన ఎస్సై కునుసోతు వెంకన్న(57) అంత్యక్రియలు గురువారం అధికార లాంఛనాలతో తన సొంత గ్రామం రాయపర్తి మండలం కిష్టాపురంలో నిర్వహించారు. గ్రామస్తులు, పోలీసులు పెద్దఎత్తున తరలివచ్చారు. గ్రామవీధులగుండా అంతిమయాత్ర నిర్వహించి పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య హచ్చమ్మ, ఓ కుమార్తె ప్రియాంక, కుమారుడు జితేందర్ ఉన్నారు. గ్రామానికి చెందిన ఎస్సై వెంకన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తుండగా ఇటీవల మహబూబా బాద్‌కు బదిలీ అయింది. ఈ క్రమంలో హైదరాబా ద్లో బుధవారం గణేశ్ నిమజ్జన బందోబస్తుకు వెళ్లగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడి కోసం సైఫాబాద్ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. కిష్టాపురంలో తీవ్ర విషాదఛాయలు -
ట్రాన్స్‌కో కన్స్ట్రక్షన్ డీఈ సంపతిరావు సస్పెన్షన్
హన్మకొండ: టీజీ ట్రాన్స్ కో వరంగల్ జోన్ కన్స్ట్రక్షన్ డీఈ ఎల్.సంపతిరావుపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. వరంగల్ జోన్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్‌పై దౌర్జన్యం, దాడి, బెదిరించిన ఘటనలో ఎల్.సంపతి రావును సస్పెండ్ చేస్తూ టీజీ ట్రాన్స్ కో ఫైనాన్స్ కమర్షియల్, హెచ్ఆర్డీ డైరెక్టర్ శ్రీనివాస్‌లు ఓరుగంటి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్ కో వరంగల్ కార్యాలయంలో ఇన్చార్జ్ బాధ్యతలపై ఈ నెల 18వ తేదీన ఎల్.సంపతిరావు బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి, దౌర్జన్యం చేయడం, బెదిరించడంపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. దీంతో క్రమశిక్షణ చర్య ల కింద సంపతిరావును సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉన్నంత కాలం అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. 26న సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం హన్మకొండ అర్బన్ : కాళోజీ సెంటర్: జిల్లాలో 1 నుంచి 18 ఏళ్ల వయస్సు గల దివ్యాంగ, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సహాయ ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని ఈ నెల 26న నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ శంభునిపేట జీహెచ్ఎస్ ప్రాంగణంలో నిర్వహించే శిబిరంలో ఏఎల్ఐఎంసీఓ బృందం పరీక్షలు నిర్వహించి, అర్హులైన విద్యార్థులకు సమగ్రశిక్ష ద్వారా అవసరమైన ఉపకరణాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఆధార్, సదరం, యూడీఐడీ కార్డు, రేషన్‌కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఉన్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సమ్మిళిత విద్యా జిల్లా సమన్వయకులు డాక్టర్ కె.శ్రీనివాస్ (98488 78455)ను సంప్రదించవచ్చని డీఈఓ సూచించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ కాన్ఫరెన్స్‌కు కేయూ ప్రొఫెసర్కేయూ క్యాంపస్: ఐఐటీ ఖరగ్ఫూర్లోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈనెల 25, 26 తేదీల్లో జరగబోయే ఇంటర్ఫోర్ ఇండియా–26 కాన్ఫరెన్స్‌కు కాకతీయ యూనివర్సిటీ గణిత విభాగం ప్రొఫెసర్ ఆచార్య పి.మల్లారెడ్డికి ఆహ్వానం అందింది. జనరలైజ్డ్ ప్లాన్ స్టెయ్రిన్ ప్రాబ్లెమ్స్ ఇన్ పోరలాస్టిక్ మెటిరీయల్స్ అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈకాన్పెరెన్స్లో ఇన్విటైడ్ స్పీకర్‌గా మల్లారెడ్డి పాల్గొననున్నారు. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య ● హైదరాబాద్‌లో ఘటన.. మృతుడు మల్కాపూర్ వాసి చిల్పూరు: కుటుంబ కలహాలతో జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పుల్యాల మణికంఠరెడ్డి ((37) హైదరాబాద్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రాంరెడ్డి, పుష్ప దంపతుల కుమారుడు మణికంఠ తండ్రి మృతి చెందిన అనంతరం హైదరాబాద్‌లోని ఇస్నాపూర్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా జరగగా క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశా రు. మణికంఠరెడ్డి అంత్యక్రియలు గురువారం స్వగ్రామం మల్కాపూర్‌లో నిర్వహించారు. మృతురాలి వివరాలు గుర్తింపు స్టేషన్‌ఘన్‌పూర్ : కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపున వెళ్తున్న వందేభారత్ రైలు కింద పడి ఘన్పూర్–నష్కల్ రైల్వేస్టేషన్ల మధ్య ఆత్మహత్యకు పాల్పడిన యువతిని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రంగరాయగూడెం గ్రామానికి చెందిన గుండె మానస (20)గా గుర్తించారు. కాజీపేట జీఆర్ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండె రాంచంద్రు, మంజుల దంపతుల కుమార్తె మానస ఇంట్లో జరిగిన గొడవలతో మనస్తాపానికి గురై ఈ నెల 20వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్ పోలీసులు తెలిపారు. -
సింగపూర్ స్ఫూర్తితో విద్యలో మార్పులు
కాళోజీ సెంటర్: సింగపూర్ విద్యావ్యవస్థ, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణను అనుసరించడం ద్వారా రాష్ట్రంలోని పాఠశాల విద్యలో మార్పులు తీసుకురావొచ్చని ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట జెడ్పీహెచ్ఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నెల 12 నుంచి 19 వరకు సింగపూర్‌లో నిర్వహించిన తెలంగాణ ఉపాధ్యాయుల బృందం అధ్యయన పర్యటనలో ఆయన పాల్గొన్నారు. అక్కడి ఉపాధ్యాయ శిక్షణ, సాంకేతిక ఆధారిత బోధన, విద్యార్థి కేంద్రిత అభ్యసన విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విశేషాలను స్థానిక విలేకరులతో పంచుకున్నారు. సింగపూర్‌లో ఏకరూప పాఠ్యప్రణాళిక, కేంద్రీకృత విద్యా నిర్వహణ, ద్విభాషా బోధనకు ప్రాధాన్యం ఉందని తెలిపారు. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లతో డిజిటల్ అభ్యసనం, స్వయం అభ్యసనం, శారీరక విద్య, కళలు, పరిశుభ్రతతో పాటు క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, టీంవర్క్, డిజిటల్ లిటరసీ వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందిస్తున్నారని వివరించారు. సింగపూర్ ఉత్తమ బోధనా పద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడుతుందని చల్లా కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా కృష్ణారెడ్డి -
నేడు మంత్రి సీతక్క సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండ ఐడీఓసీలో జరగనున్న ఈ సమావేశంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో చేపట్టాల్సిన నివారణ, ముందస్తు చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించనున్నారు. గ్రామ పంచాయతీ, వీఓ, అంగన్వాడీ, ఇతర భవనాల నిర్మాణ పనుల పురోగతి, పూర్తి స్థితి, పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అధికా రులు తమ శాఖల తాజా గణాంకాలు, పురోగతి నివేదికలు, పెండింగ్ పనుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరు కావాలని స్పెషల్ సీఎస్ దాన కిశోర్ ఆదేశించారు. సాయి వర్ధినికీ సీపీ అభినందనలు హసన్‌పర్తి: ఇండియన్ సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికై న క్రీడాకారిణి వేల్పుల సాయి వర్ధినిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. గురువారం హనుమకొండ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్ పోలేపాక వినయ్ ఆధ్వర్యంలో కమిషనర్ సీపీ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. ఇండియన్ జట్టుకు సాయివర్ధిని ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా ప్రతినిధులు సాయివర్ధిని గురించి సీపీకి వివరించారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చైనాలో జరగనున్న ఆసియా కప్–2026 పోటీల్లో సాయివర్ధిని పాల్గొననున్నట్లు చెప్పారు. సీపీని కలిసిన వారిలో సాయి వర్ధిని తండ్రి అనిల్, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు హన్మకొండ అర్బన్: ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై హనుమకొండ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగుల సమస్యలపై హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా రెండు డీఏలు విడుదల చేస్తామని, ఈనెలాఖరులోగా పీఆర్సీ నివేదిక తెప్పించుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని చెప్పారు. సీపీఎస్ రద్దు కోసం కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగుల ఇతర డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వీలైనంత త్వరగా మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, టీఎన్జీఓస్ ప్రధాన కార్యదర్శి, జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి జిల్లా జేఏసీ పక్షాన ఆకుల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యం సానుకూలం
● తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ హన్మకొండ : విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ తెలిపారు. బుధవా రం హైదరాబాద్‌లో యాజమాన్యంతో జేఏసీ ప్రతి నిధులు చర్చలు జరిపినట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ఈ చర్చల్లో ఆర్టిజన్లకు రెగ్యులర్ ఉ ద్యోగులతో సమానంగా అన్ని హక్కులు కల్పించేందుకు యాజమాన్యం ఒప్పుకుందని తెలిపారు. త్వ రలో వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేస్తామని హా మీ ఇచ్చిందన్నారు. రిటైర్డ్ అయిన ఈపీఎఫ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యం అందించేందుకు అంగీకరించిందని, ఆర్టిజన్లకు ఎపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలుపై కమిటీ వేసి నిర్ణయం తీసుకోనున్నట్లు తె లిపారని వివరించారు. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలో ప రిష్కరించేందుకు యత్నిస్తామని హామీ ఇచ్చారన్నా రు. సమస్యల పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలి : గోపాల్‌రెడ్డి నయీంనగర్ : తనను వరంగల్– ఖమ్మం– నల్ల గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే పార్టీలకతీతంగా పనిచేసి వర్కింగ్, రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కుందూరు గోపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికై న వారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోక తమ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాజకీయ పా ర్టీల అభ్యర్థులు తమ పార్టీల ప్రయోజనాలకే పరి మితమై సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోరన్నా రు. దీనిపై నియోజకవర్గ గ్రాడ్యుయేట్లు ఆలోచించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంఘం నాయకులు కుమారస్వామి, పగడాల సరళ, శేష య్య, వెంకట్ రెడ్డి, సదానందచారి, జగదీశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కాళోజీ సెంటర్: అంతర్జాతీయ వయోవృద్ధుల దినో త్సవాన్ని పురస్కరించుకుని వయోవృద్ధుల సాధి కారత, సంక్షేమం కోసం విశేష సేవలందిస్తున్న వ్య క్తులు, సంస్థల నుంచి రాష్ట్రస్థాయి పురస్కారాల కో సం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, సమాజ అభివృద్ధి, వి ద్య, వైద్యం, ఆరోగ్యం, కళలు, సాహిత్యం, సంస్క తి, క్రీడలు, వ్యవసాయం, సైన్‌న్స్ అండ్ టెక్నాలజీ, పబ్లిక్ సర్వీస్, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన సీనియర్ సిటిజన్లు ఈ పురస్కారాలకు అర్హులన్నారు. అలాగే, వయోవృద్ధుల రక్షణ, సంక్షేమం, శారీరక, మానసిక శ్రేయ స్సు కోసం కృషి చేసిన వారు, స్వచ్ఛంద సంస్థలు , వయోవృద్ధుల సంఘాలు, విద్యాసంస్థలు, ఇతర ట్రస్ట్‌లు సంస్థాగత విభాగంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సూచించారు. దరఖాస్తులు, మార్గదర్శకాల కోసం www.wdsc. telangana. gov.in సంప్రదించాలన్నారు. పూ ర్తిచేసిన దరఖాస్తులతోపాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు,హార్డ్ కాపీలను ఈనెల 26వ తేదీ సా యంత్రం 5 గంటల్లోపు వరంగల్‌లోని జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
జనగామ రూరల్ : క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఈ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడొచ్చని జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి గౌసియా బేగం అన్నారు. బుధవారం జనగామలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అండర్–14, 17 విభాగాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాలబాలికల ఫుట్‌బాల్ క్రీడల ఎంపికలు నిర్వహించారు. సుమారు 250 మంది బాలురు, 150 మంది బాలికలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఎంపికలకు ఎంపికై , తమ ప్రాంతం, తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈపోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంపికల్లో పాల్గొంటారని జిల్లా పాఠశాల సమైక్య క్రీడల కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్ తెలిపారు. అజ్మీరా కిషన్ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, రవీందర్, దాస్రూనాయక్, ప్రేమ్ కుమార్, రవి, బండారి కిరణ్ కుమార్, లచ్చిరాం, వీర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి గౌసియా బేగం జనగామలో ఉమ్మడి జిల్లా స్థాయి ఫుట్‌బాల్ ఎంపికలు -
బాలుడికి ప్రాణభిక్ష పెట్టండి
గార్ల: 2 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అప్పటి దాకా గడపదాటని ఆ ఇల్లాలికి కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. ఫలితంగా కూలీ, ఇతర పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఉన్నంతలో బతుకున్న ఈ తరుణంలో తన 14 ఏళ్ల బాలుడికి మాయదారి రోగం బ్లడ్ క్యాన్సర్ సోకింది. ఆ ఆపరేషన్ కోసం రూ.8 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిల్లిగవ్వ లేని పరిస్థతి. ఈ క్రమంలో దాతలు ఆపన్నహస్తం అందించి తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని ఆ తల్లి వేడుకుంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాలోత్ కుమార్, కుమారి దంపతుల కుమారుడు రోహిత్ గోపాలపురం జిల్లా పరిషత్ హైస్కూ ల్లో 9వ తరగతి చదువుతున్నాడు. రోహిత్‌కు జ్వరం రావడంతో ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలింది. బాలుడిని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లి కుమారి బాలుడిని హైదరాబాద్ తీసుకెళ్లగా చికిత్స కోసం రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న ఆ తల్లి అంత డబ్బు లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంది. దాతలు ఆదుకుని తన కుమారుడికి ప్రాణబిక్ష పెట్టాలని వేడుకుంటోంది. దయార్ధ్ర హృదయులు వారు మానవత్వంతో ఆలోచించి 73968 62419 నంబర్‌కు తమకు తోచిన మేర ఫోన్ పే చేసి తన కుమారుడు రోహిత్‌కు ప్రాణం కాపాడాలని విజ్ఞప్తి చేస్తోంది. అలాగే, ప్రభుత్వం, అధికారులు స్పందించి వైద్యఖర్చులు భరించి బాలుడిని బతికించాలని తల్లి వేడుకుంటుంది. దాతలను వేడుకుంటున్న చిన్నారి తల్లి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోహిత్ ఆపరేషన్‌కు రూ.8 లక్షలు అవసరం ఆపన్న హస్తం అందించాలని విజ్ఞప్తి -
నీటి నాణ్యత పర్యవేక్షణ పటిష్టం
● దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ కాజీపేట రూరల్ : కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి 15వ తేదీల మధ్య వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, రైల్వే కాలనీల నుంచి సేకరించిన మొత్తం 225 నీటి నమూనాలు వినియోగానికి సురక్షితమని నిర్ధారించినట్లు తెలిపారు. భూగర్భ జలం, పురపాలక నీటి సరఫరా, నిల్వు ఉన్న నీరు, క్లోరినేషన్ పంపిణీ వ్యవస్థలతో సహా మొత్తం నీటి సరఫరా ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలిపారు. కాజీపేట రైల్వేస్టేషన్, కాలనీల్లో 149 సాధారణ నీటి నమూనాలను సేకరించి వాటిలో మిగిలిన క్లోరిన్ స్థాయిని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో 76 నీటి నమూనాలను సేకరించి వాటిలో మిగిలిన క్లోరిన్ స్థాయిపై పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జోన్ రైల్వేస్టేషన్లలో సరఫరా చేసే నీటి నాణ్యత ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, ప్రతీ ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని అధికారులు, సూపర్వైజర్లకు సూచించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మలా రాజారామ్ కాజీపేట రైల్వే స్టేషన్లో తాగునీటి నాణ్యత పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. -
సేవాభావం.. వ్యక్తిత్వవికాసం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న జాతీయ సేవాపథం (ఎన్ఎస్ఎస్) విద్యార్థుల్లో సేవాభావం.. వ్యక్తిత్వ వికాసం పెంపొందిస్తోంది. విద్యార్థులు వలంటీర్లుగా వ్యవహరిస్తూ చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అంశంలో రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఘనత యూనివర్సిటీకి ఉంది. కాగా, మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 1969లో సెప్టెంబర్ 24వ తేదీని జాతీయ సేవాపథం(ఎన్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించి ప్రతీ ఏడాది నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నేడు కాకతీయ యూనివర్సిటీలో ఈ వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కేయూ ఆవిర్భావం నుంచి.. కాకతీయ యూనివర్సిటీ 1976, ఆగస్టు 19న ఆవిర్భవించింది. అప్పటినుంచే ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. వర్సిటీ పరిధిలోని 11 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో 356 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు 100మంది చొప్పున మొత్తం 36,500 మంది వలంటీర్లు ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్, శ్రమదానం, మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా, రక్తదానం చేయడంలో కేయూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ముందంజలో ఉన్నారు. ఎన్ఎస్ఎస్లో కొత్త కార్యక్రమాలు కూడా.. ఎన్ఎస్ఎస్ సేవల్లో ప్రధానంగా స్వచ్ఛ భారత్, మేరా దేశ్ మేరా మిట్టి, స్వాభిమాన్ స్వచ్ఛత, స్వభావ్ స్వచ్ఛత, రాష్ట్రీయ ఏక్తాదివస్, రాష్ట్రీయ ఏక్తాదివస్, ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ దివాళీ మై భారత్’ తదితర చైతన్యకార్యక్రమాలతోపాటు యూత్, మాక్ పార్లమెంట్లు, ఆపదపమిత్ర పేరుతో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్పై కూడా శిక్షణ ఇస్తున్నారు. కేయూ పరిధిలో ఆపద మిత్ర పేరుతో ఇటీవల ప్రారంభమైన కార్యక్రమంలో 600 మంది వలంటీర్లకు శిక్షణ కొనసాగుతోంది. కేయూ ఎన్ఎస్ఎస్కు నిధులు కూడా .. ఈ విద్యాసంవత్సరం 2026–2027 నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచే నేరుగా కేయూ పరిధిలోని కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్లకు నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 75, 500 రావాల్సి ఉండగా ఇటీవల అందులో ఒక్కో యూనిట్‌కు ఆయా కళాశాలల అకౌంట్లకు నేరుగా 50శాతం నిధులు విడుదల చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయగా అక్కడి నుంచి యూనివర్సిటీకి, ఆ తర్వాత యూనివర్సిటీ అధికారులు ఎన్ఎస్ఎస్ యూనిట్లకు విడుదల చేసేవారు. ఇప్పుడు మార్పు చేశారు. రెగ్యులర్ కార్యక్రమాలకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ. 27,500, ప్రత్యేక శిబిరాలకు రూ. 35వేలు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులకు రూ. 8,500 విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ నిధులతో కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ యూనిట్లు తమ కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చు. కేయూ ఆడిటోరియంలో వేడుకలుకాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు క్యాంపస్‌లోని ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, గౌరవ అతిథులుగా తెలుగు అకాడమీ చైర్మన్ కె. వెంకటనారాయణ, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, తదితరులు పాల్గొననున్నారు.నేడు ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం కేయూ పరిధిలో 256 యూనిట్లు 35,600 మంది వలంటీర్లు -
సీకేఎంలోనూ పనిచేయని పసికందుల పరికరాలు
కాశిబుగ్గ: వరంగల్‌లోని సీకేఎం ప్రసూతి వైద్యశాలలో పసికందులకు ఉపయోగించే పరికరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. నెలలోపు పసికందులు అనారోగ్యంతో బాధపడుతున్న తక్షణమే వైద్యసేవలు అందించాల్సిన పరికరాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ బర్న్ వార్డులో ఆక్సిజన్ సమస్య, తక్కువ బరువు, శ్వాస అందని పరిస్థితిలో పసికందులకు సీ ప్యాప్ ద్వారా వైద్యసేవలు అందిస్తారు. ఈ పరికరం పనిచేయడం లేదని సమాచారం. అదేవిధంగా అవుట్ బర్న్‌లో కూడా పసికందులకు అవసరమైన రెండు ఫొటోథెరపీలు ఉండగా ఇందులో ఒకటి పనిచేయడం లేదని తెలిసింది. దీంతో జాండీస్ వచ్చిన పసికందుల వైద్యసేవలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఈ రెండు రకాల పరికరాలు చాలాకాలం నుంచి పనిచేయకున్నా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాట్లు చేసుకోవడం లేదని సమాచారం. ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో షార్ట్ సర్యూట్ వల్ల ఐదుగురు చిన్నారులు మృతిచెందినా సీకేఎం అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేడు కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ పరిశీలన
● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ: తెలంగాణలోని థర్మల్ పవర్ స్టేషన్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరు బృందాలు నేడు(గురువారం) రాష్ట్రంలోని వివిధ పవర్ స్టేషన్లను సందర్శించనున్నాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి తాను భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌ను సందర్శించనున్నట్లు చెప్పా రు. పవర్ స్టేషన్లో ప్రస్తుత పరిస్థితులు, అక్క డ జరుగుతున్న పరిణామాలను స్వయంగా ప రిశీలించి వాస్తవాలు తెలుసుకుంటామని పే ర్కొన్నారు. థర్మల్ పవర్ స్టేషన్లకు సంబంధించి వెలువడుతున్న వివిధ అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం పూర్తి వివరాలను ప్రజల ముందుంచుతామని ఎమ్మెల్యే తెలిపారు. బందోబస్తుకు వెళ్లిన ఎస్ఐ దుర్మరణం ● హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం ● ఇటీవల కొత్తగూడెం నుంచి మహబూబాబాద్‌కు బదిలీ చోరీ బైక్‌పై దర్జాగా షికారు.. ● అదాలత్ సెంటర్ వద్ద వాహనం గుర్తింపు ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14వ తేదీన ఉదయం బైక్ చోరీ జరిగింది. రంగశాయిపేట గణేశ్‌నగర్ కాలనీకి చెందిన రాపాక శ్రీకాంత్ వాకింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో గవిచర్ల క్రాస్ రోడ్డు పై బైక్ పార్క్ చేసి టీ తాగుతున్నాడు. అనంతరం బైక్ వద్దకు వెళ్లి చూడగా.. ఆ స్థలంలో కనిపించలేదు. దుండగుడు క్షణాల్లో బైక్ (ఏపీ 20 ఏఎన్4366) అపహరించాడు. ఈ ఘటనపై బుధవారం మిల్స్‌కాలనీ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శ్రీకాంత్ తెలిపారు. చోరీ అనంతరం ఓ పురుషుడు బైక్ నడుపుతుండగా, వెనుక ఓ మహిళ కూర్చుని ప్రయాణిస్తున్న దృశ్యం సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అదాలత్ సెంటర్ వద్ద చోరీ చేసిన బైక్‌పై ఇద్దరు అనుమానితులు ప్రయాణిస్తూ సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని పోలీసులు పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఫిర్యాదుదారు శ్రీకాంత్ పేర్కొన్నాడు. -
‘ఎల్ఐసీ’ స్కాలర్షిప్..
బచ్చన్నపేట : పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య నభ్యసించడానికి అవస్థలు పడకుండా భారతీయ జాతీయ బీమా (ఎల్ఐసీ ) సంస్థ అండగా నిలుస్తూ స్కాలర్షిప్లు అందిస్తోంది. ప్రతీ సంవత్సరం ఒక్కో విద్యార్థికి రూ. 50 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకం కింద అత్యంత ప్రతిభావంత విద్యార్థులకు అందించనున్న ఆర్థిక సాయం కోసం తన అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ కేటగిరీ విద్యార్థులు అర్హులు.. ● జనరల్ కేటగిరీ విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2026–27 విద్యా సంవత్సరంలో డిగ్రీ లేదా ఏదైనా వృత్తి విద్యా కోర్సు మొదటి సంవత్సరంలో ప్రదేశం పొందిన వారు అర్హులుగా పరిగణిస్తారు. ● రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2026–27 విద్యా సంవత్సరానికి ఐటీఐ, వృత్తి విద్య లేదా డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదాయ వివరాలు.. ● దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.50 లక్షలు మించకూడదు. ● దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 30 వరకు ఉంది.స్కాలర్ షిప్ ఇచ్చేది ఇలా..ఎంబీబీఎస్ బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్ విద్యార్థులకు సంవత్సరానికి రూ. 50 వేలు, బీఈ, బీటెక్, బీఆర్చ్ విద్యార్థులకు సంవత్సరానికి రూ. 40 వేలు, ఇతర డిగ్రీ, డిప్లొమా వారికి రూ. 20 వేలు, ఇంటర్మీడియట్, ఒకేషనల్ విద్యార్థులకు రూ. 15 వేల చొప్పున స్కాలర్ షిప్ అందిస్తారు. ప్రతీ సంవత్సరం రెండు విడతలుగా నేరుగా నెఫ్ట్ ద్వారా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ స్కాలర్ షిప్ పీజీ లేదా తత్సమాన కోర్సు విద్యార్థులకు వర్తించదు. ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి సూచిస్తున్న కార్పొరేషన్ ప్రతినిధులు -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ అర్బన్/వరంగల్ అర్బన్/విద్యారణ్యపురి: భారీ వర్షాలు కురుస్తున్నందున నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్, కమిషనర్ టి.వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర సాయం కోసం జీడబ్ల్యూఎంసీని ఆశ్రయించాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. పారిశుద్ధ్య సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం, ఎలక్ట్రికల్ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వంతెనలు, చెరువులు, జలాశయాలు, రోడ్లు, పాత భవనాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నేడు విద్యాసంస్థలకు సెలవు భారీ వర్షాల కారణంగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద ఆదేశాల మేరకు నేడు (గురువారం) అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల డీఈఓలు, ఎల్వీ గిరిరాజ్‌గౌడ్, రంగయ్యనాయుడు బుధవారం రాత్రి వేర్వేరు ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 24న ప్రకటించిన సెలవుకు బదులు అక్టోబర్ 10న రెండో శనివారం పనిదినంగా పరిగణించాలని వారు స్పష్టం చేశారు. గ్రేటర్లో వర్షపు నీటితో నిండిన లోతట్టు ప్రాంతాలు ఇబ్బందులు పడిన వాహనదారులు, ప్రజలు హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం -
వర్షంతో తడిసిముద్దయిన భక్తజనం
గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం బారులుదీరిన వాహనాలువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో ఈనెల 24 నుంచి నిర్వహించనున్న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఎంపిక పోటీలు వర్షం కారణంగా వాయిదా వేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా నిర్వహణ కార్యదర్శి వాసుదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు ఇటీవల వాయిదా పడిన రెజ్లింగ్ అండర్ 14, 17 ఎంపికలు కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది ప్రకటించనున్నట్లు తెలిపారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం గణపతి నిమజ్జనం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో మూల మహాగణపతికి అభిషేక పూజలు చేశారు. ఉత్సవమూర్తికి పల్లకీసేవ నిర్వహించారు. ఇందులో సినీ నటుడు, కవి తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్, అర్చకుడు గంగు ఉపేంద్రశర్మతో పాటు వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, శ్రవణ్‌కుమార్, కాశీలింగాచారి, వేముగంటి దత్తుశర్మ, భక్తులు ఢమరుక వాయిద్యాలు, మంగళహారతులతో కాషాయజెండాలతో విఘ్నగణపతిని, స్వామివారి త్రిశూలాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రాచీన కోనేటిలో త్రిశూలస్నానం (తీర్థోత్సవం) జరిపారు. అనంతరం రుద్రేశ్వరుడి సన్నిధిలో త్రిశూలాన్ని యథాస్థానంలో ఉంచారు. అనంతరం ఉత్సవ మహాగణపతి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఊరేగించి పద్మాక్షి గుండంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: నగరంలోని న్యూసైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వచ్చే నెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ కటంగూరి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు బుధవారం కళాశాల ఆవరణలో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ జాబ్‌మేళాలో 50కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్.కమలాకర్, తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆలిండియా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జయరాం, వివిధ కంపెనీల ప్రతినిధులు, కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆషాద్ఖాన్ పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల విద్యార్థుల బోధనకు అతిథి అధ్యాపకుల నియమకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ విభాగంలో రెండు పోస్టులకు, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ ఒక పోస్టుకు, ఎంఏ తెలుగు ఒక పోస్టుకు అర్హులైన అధ్యాపకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో 55 శాతానికి తక్కువ కాకుండా మార్కులు కలిగి ఉండాలని, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు. పీహెచ్డీ, నెట్, బోధనలో అనుభవం కలిగినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 26 సాయంత్రం 4:30 గంటల్లోగా దరఖాస్తులు కళాశాలల్లో సమర్పించాలని సూచించారు. రెండు భాగాలైన తెప్ప చిన్నవడ్డేపల్లి చెరువులో భారీ విగ్రహాన్ని తెప్పపై నుంచి నిమజ్జనం చేస్తున్న క్రమంలో అదుపుతప్పి ఒకవైపు పడింది. దీంతో తెప్ప రెండు భాగాలుగా విడిపోయింది. పలువురు సిబ్బంది నీటిలో పడిపోయారు. విగ్రహం ఎవరిమీద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హనుమకొండ నగరంలో నిమజ్జన శోభాయాత్రలో చిందులేస్తున్న యువతనగర పరిధి 17 చెరువుల వద్ద రూ.2 కోట్ల నిధులు వెచ్చించి ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. ఆయా ప్రాంతాల్లో 30 క్రేన్లను అందుబాటులో ఉంచారు. వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యాకాధికారి చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, ‘కుడా’ చైర్పర్సన్ గుండు సుధారాణి, కమిషనర్ టి.వెంకన్న, ఎస్ఈ రాజ్‌కుమార్, ఆయా విభాగాల అధికారులతో కలిసి ఘనంగా నిమ్జనాన్ని ప్రారంభించారు. రంగసముద్రం చెరువు వద్ద ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. ● గ్రేటర్లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర ● కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు ● చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద చిన్న అపశ్రుతి వినాయక శోభాయాత్రలో స్టెప్పులేస్తున్న యువతులు, చిన్నారులు, మహిళలుగ్రేటర్ వరంగల్ నగరంలో బుధవారం వైభవంగా నినాయక నిమజ్జనోత్సవం జరిగింది. వాడవాడలా కొలువుదీరన గణపయ్యలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళ హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. నిమజ్జనానికి తరలివెళ్తున్న వినాయకుల ఎదుట మహిళలు, యువతులు కోలాటాలతో ఆడిపాడి సందడి చేశారు. గణనాథుడికి ఘన వీడ్కోలు పలికారు. ఈసారి డీజేలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో డప్పుచప్పుళ్లు, బ్యాండ్ మేళాలు, బాజాభజంత్రీలు, భజనలతో సాంస్కృతిక శోభ నెలకొంది. ఓ వైపు వర్షం.. మరో వైపు నిమజ్జనం ఓ వైపు నగరంలో మోస్తరు వర్షం కురుస్తున్నప్పటికీ మరో వైపు నిమజ్జనం హోరెత్తింది. ● గొర్రెకుంట కట్టమల్లన్న, గుండు చెరువు అగర్తల, బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి, మడికొండ, తదితర చెరువుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లతో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశారు. ● పెద్ద క్రేన్లు, తెప్పలు, బారికేడ్లు, గజ ఈతగాళ్లు, పోలీసులు, గ్రేటర్ వరంగల్ ఇంజనీర్లు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. ● వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచి భక్తులకు తాగునీరందించారు. ● వర్షం కారణంగా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సేవలు అందించారు. ● ఆయా ప్రాంతాల్లో హనుమకొండ, వరంగల్ అదనపు కలెక్టర్లు ఎన్.రవి, ఎల్.కిషోర్, వైవీ.గణేశ్, బల్దియా కమిషనర్ వెంకన్న, డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లు తదితరులు పరిశీలించారు. గణపయ్యను తీసుకెళ్లడానికి గంగమ్మ వర్షమై వచ్చింది. ఘణనాథుడి పాదాలు తాకాలని మేఘాలు కరిగి నేలను చేరాయి. వాన చినుకులు భక్తుల నెత్తిన అక్షింతలయ్యాయి. తన్మయత్వం చెందిన యువత ఆడిపాడి సందడి చేశారు. కురుస్తున్న వానను సైతం లెక్కచేయకుండా గ్రేటర్ వరంగల్ నగరంలో వినాయక శోభాయాత్ర, నిమజ్జనం బుధవారం వైభవంగా జరిగింది. ఆదిదేవుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మధ్యాహ్నం నుంచే చెరువుల వద్ద వాహనాలు బారులుదీరాయి. – వరంగల్ అర్బన్/హన్మకొండ అర్బన్/ హసన్‌పర్తి/ఖిలా వరంగల్/కాశిబుగ్గకాశిబుగ్గ: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని వరంగల్ డీఎంహెచ్ఓ రాజారెడ్డి ఆదేశించారు. వరంగల్ వెంకట్రామ జంక్షన్‌లోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనల అమలు, వివిధ రికార్డులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించారు. ఎస్టీపీ, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తనిఖీ చేశారు. అలాగే, డయాగ్నోస్టిక్స్ విభాగం, జనరల్ వార్డులు, ఐసీయూలను పరిశీలించి, పేషంట్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ టారిఫ్ బోర్డులో ప్రదర్శించిన ఫీజుల మేరకు పేషంట్లను నుంచి చార్జీలు వసూలు చేయాలని, మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. పేషంట్లకు అవసరమైన డయాగ్నోస్టిక్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలన్నారు. హాస్పిటల్లో అందిస్తున్న సేవలు, టారిఫ్‌లు, వైద్యులు, సిబ్బంది వివరాలను కౌంటర్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. స్కానింగ్ నిర్వహించే హాస్పిటల్స్, స్కానింగ్ కేంద్రాలు తప్పకుండా పీపీఎన్డీటీ యాక్ట్ 1994 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ చట్టం ప్రకారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నిషేధమని, ఎవరైనా చేసినా, ప్రోత్సహించినా, చేయమని అడిగినా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, 3 నెలల నుంచి 5 నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్నకుమార్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు. వరంగల్ డీఎంహెచ్ఓ రాజారెడ్డి సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు -
వచ్చేనెల 18 నుంచి ‘సూపర్’లో ఓపీ సేవలు!
కాశిబుగ్గ: వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వివిధ శాఖల రాష్ట, జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కదిలారు. రాష్ట్రస్థాయి అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులు సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళ్లడానికి తగిన ప్రణాళిక సిద్ధ్దం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి మాదిరిగా రాత్రింబవళ్లు ఆస్పత్రి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 18న ఓపీ సేవలను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంఈ, కలెక్టర్ పర్యవేక్షణలో.. తాజాగా బుధవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి డీఎంఈ డాక్టర్ వాణి అధికారులతో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎంఓ, డీఏంఈ, హెల్త్ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులతో పాటు ఎల్అండ్టీ, ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం. వీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పర్యవేక్షణలో పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు వైద్యసేవలు త్వరగా అందించేందుకు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు పాటిస్తూ.. ఇటీవల హైదరాబాద్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సీరియస్‌గా చెప్పారు. 30 రోజుల్లో 24 గంటలు పనిచేస్తూ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రస్థాయిలోని ఐఏఎస్ అధికారులు సైతం టీంలుగా ఏర్పడి పనులను పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇటీవల ఎంజీఎంలో చోటు చేసుకున్న ఘటనలు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను సూపర్ వేగంతో పూర్తిచేసేందుకు కదిలారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 18న ఓపీ సేవలు ప్రారంభం చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా రెండు రోజుల ముందు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రాథమికంగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో దసరా పండుగ సందర్భంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ‘సూపర్’ ఆస్పత్రి పనుల పరిశీలన వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని డీఎంఈ డాక్టర్ వాణి బుధవారం పరిశీలించారు. వివిధ నిర్మాణ పనులు తనిఖీ చేశారు. పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఎప్పటి వరకు పూర్తి చేయవచ్చని సంబంధిత అధికారులను, కంపెనీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆస్పత్రి ఓపీ పేషంట్లు, ఇన్ పేషంట్లు వైద్యసేవల ఏర్పాట్లపై చర్చించారు. ఎంజీఎం నుంచి పేషంట్లను ఇక్కడికి తరలిస్తే వైద్యసేవలకు ఇబ్బందులు రాకుండా ఎలా ఏర్పాట్లు చేయాలని దానిపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో పేషంట్లకు ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించే దిశగా వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఎల్అండ్టీ, ఆర్అండ్బీ, ఎన్పీడీసీఎల్, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు ఉన్నారు. ప్రారంభించేందుకు అధికారుల కసరత్తు దసరా కానుకగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం? సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం -
ప్రమాదం నుంచి పాఠం
● జీఎంహెచ్‌లో గతంలో షార్ట్‌సర్క్యూట్ ● అప్పటినుంచి పటిష్ట భద్రత ఏర్పాట్లు హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సుమారు తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఘటన అధికారులను మేల్కొల్పింది. అక్టోబర్ 31, 2017న సాయంత్రం 6గంటలకు జనరేటర్ జంక్షన్ వద్ద విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఆస్పత్రి గందరగోళంగా మారింది. అప్పుడే పుట్టిన చిన్నారులను ఎత్తుకుని బాలింత బంధువులు పరుగులు తీయగా, గర్భిణులు, రోగి బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. సుమారు రెండు గంటల పాటు ప్రసూతి ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. శిశు సంజీవనిలో 20 బెడ్లు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి పైఅంతస్తులోని శిశు సంజీవని ప్రత్యేక నవజాత శిశు చికిత్స కేంద్రంలో బెడ్లు ఉన్నాయి. నలుగురు పిల్లల వైద్య నిపుణులు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తుండగా.. ఇద్దరు రెగ్యులర్‌గా విధుల్లో ఉన్నట్లు జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం 15మంది నవజాత శిశువులు స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. -
విద్యుత్ పొదుపుతో ఆర్థిక మదుపు
హన్మకొండ: విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం వల్ల కేవలం విద్యుత్ బిల్లు మాత్రమే తగ్గదని, కుటుంబ ఆర్థిక స్థితి, విద్యుత్ వ్యవస్థ స్థిరత్వం, సహజ వనరుల పరిరక్షణ, పర్యావరణం వంటి అనేక అంశాల్లో మేలైన ప్రయోజనం కలుగుతుందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్లు ఎ.ఆనందం, సామ్యానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీని 24 డిగ్రీల సెల్సి యస్, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద విని యోగించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. గీజర్లు, వాటర్ హీటర్లు, ఇసీ్త్ర పెట్టెలు వంటి అధిక విద్యుత్ వినియోగ పరికరాలను అవసరమైన మేరకే ఉపయోగించాలని సూచించారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో మంగళవారం నిర్వహించిన వరంగల్, హనుమకొండ జిల్లాల స్థాయి సబ్‌జూనియర్స్, జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 550 మంది అథ్లెట్లు హాజరయ్యారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్ఎస్ వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలబాలికల పోటీల్లో, ఆసిఫాబాద్‌లో జరగనున్న సబ్‌జూనియర్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ముగింపు వేడుకలకు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సర్టిఫికెట్లు అందించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఊర యుగేంధర్‌రెడ్డి, బాధ్యులు పీడీలు కిషన్ కృష్ణమూర్తి, రజనీకాంత్, కోచ్‌లు పాల్గొన్నారు. ఖిలా వరంగల్: విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ఆపద మిత్రల పాత్ర కీలకమని టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ ఎన్వీఎస్. శ్రీనివాస్‌రావు అన్నారు. మామునూరు 4వ బెటాలియన్ ఆవరణలో ఏడు రోజులుగా నిర్వహించిన యువ ఆపద మిత్ర శిక్షణ మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా కమాండెంట్ హాజరై 102 మంది శిక్షణార్థులు శిక్షణ పత్రాలు అందించి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతీ అంశాలతో విపత్తు సమయాల్లో బాధితులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఏసీ రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, రవి, రాజ్‌కుమార్, రాంప్రసాద్, శిక్షణార్థులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ విద్యార్థులు ప్రజాసేవే కెరీర్‌గా ఎంచుకోవాలని నిట్ పూర్వ విద్యార్థి, ఐఏఎస్, కమిషనర్ బెంగళూరు నార్త్ సిటీ కార్పొరేషన్ పొమ్మాల సునీల్‌కుమార్ అన్నారు. నిట్ క్యాంపస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘టాక్ ఆన్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్’ అంశంపై ఐఏఎస్ పొమ్మాల సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. నిట్ వరంగల్ క్యాంపస్‌లో 2002వ బ్యాచ్ ట్రిపుల్ఈ విద్యార్థినైన తాను ఐఏఎస్‌గా ఎంపికవడం నిట్‌లోని అత్యుత్తమ బోధనతోనే సాధ్యమైందన్నారు. ముందుగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మొక్కను అందించి క్యాంపస్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కిశోర్‌కుమార్, శ్రీనివాస్‌రావు, బెనర్జీబాబు పాల్గొన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట–మోటమర్రి సెక్షన్లో మంగళవారం రైల్వే అధికారులు కవచ్ ట్రయల్స్ ప్రారంభించారు. భారత రైల్వే ప్రతిష్టాత్మక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞనం కవచ్ వ్యవస్థను నిర్మించి ట్రయల్స్‌కు సిద్ధం చేసి నడిపించారు. సికింద్రాబాద్‌కు చెందిన డీఎస్టీఈ యుగేంధర్, ఏటీఎస్టీఈ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్ఐఎల్–0 ట్రయల్స్ నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్‌ను దక్షిణ మధ్య రైల్వే సీఎస్‌టీఈ ప్రాజెక్ట్స్ ఎం.కోటేశ్వర్రావు, డీపీఎస్టీఈ జి.కుమారన్ పర్యవేక్షిస్తున్నట్లు వారు తెలిపారు. కాజీపేటలో చేపట్టిన ట్రయల్స్‌లో కాజీపేట స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
పసికందులకు.. పరికరాల కొరత!
సాక్షి, వరంగల్/కాశిబుగ్గ: పసికందుల ప్రాణాలను కాపాడాల్సిన ఎంజీఎం నవజాత శిశు చికిత్సా కేంద్రంలో మౌలిక వసతుల కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నుంచి నెలలోపు శిశువులను అత్యవసర చికిత్స కోసం ఇక్కడికి తీసుకొస్తుండగా.. అవసరమైన స్థాయిలో ప్రాణరక్షక పరికరాలు లేవన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్‌లోని నవజాత శిశు విభాగంలో అగ్ని ప్రమాదం జరిగి చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఎంజీఎంలో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది. మూడు యూనిట్లున్నా శిశువులకు తప్పని తిప్పలు.. ఎంజీఎంలోని నవజాత శిశు చికిత్స విభాగంలో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో రెండు యూనిట్లు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో ఒక యూనిట్ పనిచేస్తోంది. 40 పడకల సామర్థ్యమున్న ఈ యూనిట్లలో నెలలోపు పసికందుల్లో కామెర్లు, శ్వాస సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఫిట్స్, తక్కువ బరువుతో పుట్టిన వారు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు చికిత్స అందిస్తారు. ఎన్ఐసీయూలో అత్యంత సీరియస్ కేసులకు వెంటిలేటర్, తక్కువ బరువున్న శిశువులకు వార్మర్లు, శ్వాస ఇబ్బందులకు సీపాప్ తదితర పరికరాలు కీలకం. ఇవి అవసరానికి తగిన సంఖ్యలో లేవని ఆరోపణలు వస్తున్నాయి. ఒక వార్మర్లో వెచ్చదనం కోసం ఒకరిని పడుకోబెట్టాల్సి ఉండగా ఇద్దరిని పడుకోబెడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కొన్ని పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నా యి. సరిపడా వెంటిలేటర్లు, సీపాప్ సరిపోక శిశువుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయనే విమర్శలున్నాయి. కొన్ని పరికరాలు పనిచేయకున్నా ప్రత్యామ్నాయాలు లేక అటు వైద్యులు, ఇటు శిశువులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్ని పరికరాలు అవసరం? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? వాటిలో పనిచేస్తున్నవి ఎన్ని? అనే వివరాలపై ఆస్పత్రినుంచి సరైన సమాధానం రావ డం లేదు. పరికరాల కొరతపై అధికారులు, సిబ్బంది పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా బడ్జెట్ సమస్యల వల్ల పరిష్కారం ఆలస్యమవుతోందని తెలిసింది. ఎంజీఎం ఎస్ఎన్సీయూ, ఎన్ఐసీయూపై ఆందోళన ఇంక్యుబేటర్లు, వార్మర్లు, సీపాప్, వెంటిలెటర్ల కొరత అవసరమైనన్ని పరికరాలు లేకపోవడంతో తిప్పలు ఫలితంగా అత్యవసరంగా వైద్యం అందించడంలో ఇబ్బందులు విద్యుత్, ఫైర్ సేఫ్టీ ఆడిట్‌పై లేని స్పష్టతరిమ్స్ ఘటనతో సేఫ్టీపై ప్రశ్నలు..ఆదిలాబాద్ రిమ్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత, ఫైర్ ప్రివెన్షన్ ఆడిట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో ఎంజీఎంలో ఫైర్ అలారం వ్యవస్థ, ఫైర్ ఎక్స్టింగ్విస్ట్టర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, విద్యుత్ వైరింగ్, జనరేటర్, ఏసీ యూనిట్లు, ఎలక్ట్రికల్ లోడ్, వార్షిక ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ జరుగుతున్నాయా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దల వార్డులతో పోలిస్తే నవజాత శిశు విభాగం పరిస్థితి పూర్తిగా భిన్నం. నడవలేని, స్వయంగా బయటకు రాలేని పసికందులు ఇంక్యుబేటర్లు, వార్మర్లలో ఉంటారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వారిని పరికరాలతో సహా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. అందుకే వైద్య పరికరాల లభ్యతతోపాటు అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా కీలకమని, ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ప్రాణాలతో బయటకు తీసుకెళ్లడం ముఖ్యమని వైద్యవర్గాలంటున్నాయి. దీనిపై ఎంజీఎం ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వీడ్కోలుకు వేళాయె!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్‌లో నేడు (బుధవారం) వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలోని 19 చెరువుల వద్ద నిమజ్జనం జరగనుంది. అందుకోసం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రముఖంగా చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం, గొర్రెకుంట కట్టమల్లన్న, గుండు చెరువు అగర్తల, మామునూరు బెస్తం చెరువు వద్ద నిమజ్జనం జరగనుంది. హనుమకొండ, కాజీపేటలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చె రువు, గోపాల్పూర్, భీమారం, కడిపికొండ, మడికొండ, సోమిడి, ఎల్లాపూర్, గుండ్ల సింగారం, రాంపూర్, సింగారం, చల్ల చెరువు వద్ద నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాఖల వారీగా ఏర్పాట్లు ఇలా.. ● మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో 30 క్రేన్లు ఏర్పాటు చేశారు. వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద 7 క్రేన్లను, ఉర్సు రంగసముద్రం 6, బెస్తం చెరువు 2, ఖిలా వరంగల్ అగర్తలా ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. హనుమకొండ సిద్ధేశ్వర గుండం వద్ద 1, బంధం చెరువుల వద్ద 3, హసన్‌పర్తి పెద్ద చెరువు 2, కడిపికొండ, భీమారం, చల్ల చెరువు వద్ద ఒకటి తదితర విలీన గ్రామాల్లో క్రేన్లను అందుబాటులో ఉంచారు. ● బల్దియా ఆధ్వర్యంలో రోడ్లు చదును చేసి, ప్యాచ్ వర్క్‌లు, రోడ్డు విస్తరణకు రూ.కోటి ఖర్చు చేశారు. అన్ని చెరువుల వద్ద విద్యుత్ లైట్లతో జిగేల్మనేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో మంచి నీరు సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ● ఎన్పీడీసీఎల్ అధికారులు నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్లను, జనరేటర్లను అందుబాటులో ఉంచారు. ● ఆర్అండ్బీ శాఖ నేతత్వంలో ఆరు కేంద్రాలలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ● మత్స్య శాఖ నుంచి 1,200 మంది గజఈతగా ళ్లు, 26 తెప్పలు, బ్యాలెన్సింగ్‌ల ద్వారా సేవలు అందించనున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ఐదుగురు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ● మెడికల్ అండ్ హెల్త్ శాఖ ప్రతి నిమజ్జన కేంద్రం వద్ద ఉచితంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. ● మెడికల్ అండ్ హెల్త్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, 108 వాహనాలు ఏర్పాటు చేశారు. ● పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు, శాంతిభద్రత పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ చేయనున్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలో నేడు వినాయక నిమజ్జనం జల వనరుల వద్ద 32 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లు శోభాయాత్ర దారిలో వీధిదీపాలు, ప్రధాన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాట్లు పూర్తి చేసిన బల్దియా అధికారులుహన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్‌బాజ్‌పాయ్, సత్యశారద సూచించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్నతో కలిసి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ టెలికాన్ఫన్స్‌లో అధికారులకు సూచనలిచ్చారు. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో
హన్మకొండ చౌరస్తా: ‘గాంధీ కుటుంబం గురించి ఇష్టారీతిన మాట్లాడితే సహించేదిలేదు, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డితో కలిసి కాంగ్రెస్ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ కుటుంబ సభ్యులను సరిగ్గా పెంచడం చేతకాని నీకు, మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు దొంగ గాంధీల పేర్లు పెట్టొద్దనే నైతికత లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై నాయిని మండిపడ్డారు. సోమవారం వరంగల్ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. దసరాలోపు రేవంత్‌రెడ్డి వరంగల్‌కు రానున్నట్లు, కేయూ 50 ఏళ్ల వేడుకలు, ఆర్ట్స్ కాలేజీ శతాబ్ధి ఉత్సవాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ బ్రోకర్‌గా హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో హోటల్ అద్దెకు తీసుకుని బిల్లు ఎగ్గొట్టాడని ఎద్దేవా చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తాను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ౖచైర్‌పర్సన్ పులి ప్రియాంక, మాజీ కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, శ్రీమాన్, విజయశ్రీ, రవీందర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మార్క విజయ్, తాడిశెట్టి విద్యాసాగర్, తోట పవన్, అర్శం అశోక్, తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
ఎంజీఎం వద్ద ఉద్రిక్తత
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్ప్రతిలో వసతుల పరిశీలన, రోగుల ఇబ్బందులను తెలుసుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన కాలికి, చేతికి గాయమైంది. తీవ్రనొప్పితో కన్నీరుపెట్టుకున్నారు. పెచ్చులూడిన ఘటనలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మానవతా దృక్పథంతో వచ్చిన వినయ్‌భాస్కర్‌ను ఎందుకు పంపించరు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మహిళలు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజులక్రితం ఆస్పత్రిలో భవనం పైపెచ్చులు ఊడి రోగులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలోకి ఎవరూ రాకుండా పోలీసులు మొదటి గేట్, రెండో గేట్‌తో పాటు మార్చురీ గేట్ సైతం మూసేశారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మార్చురీ గేట్పక్కనే ఉన్న ప్రాంతం నుంచి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒకేసారి తరలిరావడంతో తోపులాట జరిగింది. వినయ్‌భాస్కర్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వినయ్భాస్కర్పై పడడంతో కాలికి, చేతికి గాయలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు తనపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు కడుపులో తంతూ, కాళ్లు తొక్కారని కన్నీరుపెట్టారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలిస్తుండగా, తనను ఎంజీఎంకు తీసుకెళ్లాలంటూ మొరపెట్టుకున్నారు. కానీ, శాంతిభద్రతల దృష్ట్యా ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతున్న వినయ్‌భాస్కర్‌ను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో.. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పోతన నగర్ జంక్షన్ వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ ధర్నాలో వినయ్‌భాస్కర్ పాల్గొని, పోలీసులు, అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సీఐ కరుణాకర్‌రావు వారికి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. సీపీఎం నాయకుల ఆందోళన ఎంజీఎంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆస్పత్రి గేట్ వద్ద ఆందోళన చేశారు. లోపలికి రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి కొత్త ఆస్పత్రిని ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పోలీసుల పహారాలో ఎంజీఎం.. ఎంజీఎం ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు బందోబస్తును పెంచారు. మీడియా ప్రతినిధులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆస్ప్రతికి ఉన్న మూడు గే ట్లను బంద్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషంట్లను చూసేందుకు వచ్చిన అటెండెంట్లకు వెతలు తప్పలేదు. వారిని కూడా వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులను వారి ఐడెంటిటీ కార్డు పరిశీలించిన తర్వాతే లోనికి పంపించారు. మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను అడ్డుకున్న పోలీసులు కాలికి, చేతికి గాయం.. ఆస్పత్రిలో చికిత్స పోలీసులు కడుపులో తన్నారని కన్నీరు పెట్టిన దాస్యం -
ట్రాన్స్‌కోలో వివాదాలు
హన్మకొండ: టీజీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ట్రాన్స్‌కో) వరంగల్ జోన్ కార్యాలయంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులను బెదిరించి బలవంతంగా ఉత్తర్వులు మార్పించడాన్ని ట్రాన్స్ కో యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఒకే తేదీతో ఇద్దరు డీఈలకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వడం, ఇన్చార్జ్ బాధ్యతల ఉత్తర్వులు పొందడంలో జరిగిన దౌర్జన్యంపై సోమవారం ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి హనుమకొండలోని టీజీ ట్రాన్స్‌కో వరంగల్ జోన్ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు చేరుకుని జరిగిన ఘటన, దౌర్జన్యం, ఇన్చార్జ్ ఉత్తర్వుల జారీపై రోజంతా వివరాలు సేకరించారు. విజిలెన్స్ నివేదిక అనంతరం పూర్తిస్థాయిలో శాఖాపరమైన విచారణ చేపట్టనున్నారు. ఏం జరిగిందంటే.. ట్రాన్స్‌కో వరంగల్ జోన్ కార్యాలయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జనగామ డీఈగా పని చేస్తున్న ఐ.సుదాకర్‌రావు ఈనెల 5 నుంచి 19 వరకు సెలవులో వెళ్లారు. ఈవిభాగంలో పాలనాపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా జాప్యం కాకుండా ఉండేందుకు ఈనెల 10న వరంగల్ ఎంఆర్టీ అండ్ ట్రాన్స్ఫార్మర్ డీఈ టి.రాజుకు ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ మురళీసాగర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన టి.రాజు సజావుగా విధులు నిర్వహిస్తుండగా.. ఈనెల 18న వరంగల్ కన్స్ట్రక్షన్ డీఈ ఎల్.సంపతిరావు తనపై దౌర్జన్యం చేసి బలవంతంగా పాత (10వ) తేదీతో టి.రాజుకు అప్పగించిన బాధ్యతలు రద్దు చేస్తూ, తనకు అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు దొత్తిడి తీసుకొచ్చి ఉత్తర్వులు ఇప్పించుకున్నారని వరంగల్ జోన్ చీఫ్ ఇంజనీర్ మురళీసాగర్ టీజీ ట్రాన్స్‌కో గ్రిడ్ ఆపరేషన్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇద్దరు డీఈలకు ఈ నెల 10వ తేదీతో అదనపు బాధ్యతలు అప్పగించినట్లు మెమోలు జారీ అయ్యాయి. ఆంతర్యమేంటి? విచిత్రమేంటంటే జనగామ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డీఈ ఐ.సుధాకర్‌రావు ఈ నెల 19వ తేదీ వరకు సెలవు పెట్టారు. అయితే ఈనెల 18న అంటే ఒక రోజు ముందుగా బలవంతంగా ఎల్.సంపతిరావు అదనపు బాధ్యతలు పొందడంలోని ఆంతర్యమేంటని ట్రాన్స్ కో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అప్పటికే అదనపు బాధ్యతలు చేపట్టిన టి.రాజు పాలనాపరమైన ఫైళ్లపై సంతకాలు చేయడం, కార్యకలాపాలు కొనసాగడం జరిగాయి. ఈనెల 18న పాత (10వ) తేదీతో అదనపు బాధ్యతలు పొందిన డీఈ గతంలో జరిగిన కార్యకలాపాలు ఎలా మేనేజ్ చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికి అదనపు బాధ్యతలు వివాదంగా మారాయి. 15 రోజుల అదనపు బాధ్యతలపై ఇంజనీర్స్ పరువు తీసుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ మొత్తం ఘటనను యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఒకే తేదీతో ఇద్దరికి ఇన్చార్జ్ బాధ్యతలు సెలవుపై వెళ్లిన డీఈ స్థానంలో మరో విభాగం డీఈకి అదనపు బాధ్యతలు జూనియర్‌కు ఎలా ఇస్తారని బాధ్యతలు పొందిన మరో డీఈ దౌర్జన్యంగా బాధ్యతలు తీసుకున్నారని ఫిర్యాదు విజిలెన్స్ అధికారుల విచారణ -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణికి అందిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ రవి అర్జీలు స్వీకరించారు. జిల్లా, రెవెన్యూ డివిజనల్, మండల స్థాయిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 298 అర్జీలు అందా యి. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎ ప్పటికప్పుడు పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వర్చువల్ విధానంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడి అర్జీల పరిష్కారంపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌లు అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ● వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్ ● 243 వినతుల స్వీకరణ న్యూశాయంపేట: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దని, త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎల్.కిశోర్‌కుమార్ అన్నారు. సోమవారం గ్రీవెన్స్‌లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 243 వినతులు రాగా, అందులో రెవెన్యూకు సంబంధించి 60, జీడబ్ల్యూఎంసీ 84, గృహ నిర్మాణ శాఖ 35, ఇతర శాఖలకు సంబంధించి 64 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత శాఖల దరఖాస్తులను అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.దరఖాస్తులు ఇలా..కలెక్టరేట్లో 130 దరఖాస్తులు ఆర్డీఓ కార్యాలయంలో 32 దరఖాస్తులు మండల కార్యాలయాల్లో 136 దరఖాస్తులు మొత్తం 298 దరఖాస్తులు హనుమకొండ కలెక్టర్ చాహత్ గ్రీవెన్స్‌కు 298 అర్జీలు -
పరిష్కారంలో అలసత్వం వద్దు
వరంగల్ అర్బన్: ప్రజలు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని, సత్వరమే పరిష్కారం చూపించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న పేర్కొన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో కమిషనర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గతవారం ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కార స్థితిగతులను కమిషనర్ విభాగాల వారీగా సమీక్షించారు. బల్దియా గ్రీవెన్స్‌కు మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల వివరాలుటౌన్ ప్లానింగ్ 41 ఇంజనీరింగ్ 29 ఆరోగ్యం, పారిశుద్ధ్యం 10 రెవెన్యూ 08 నీటి సరఫరా 05 హార్టికల్చర్ 01 బల్దియా కమిషనర్ వెంకన్న గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్‌కు 94 అర్జీలు -
పీస్ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ను నమ్ముకుని పనిచేస్తున్న పీస్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, సబ్‌స్టేషన్ నిర్మాణాలకు భూములు ఇచ్చిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీయూఈఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లర్లు, ఎస్పీఎం కార్మికులు, అన్మ్యాన్డ్ వర్కర్లు ధర్నా చేశారు. ముందుగా పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు ధర్నా చేశారు. అనంతరం హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్, ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతిరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహజ్యోతి, ఆన్‌న్‌లైన్ చెల్లింపుల కారణంగా బిల్ కలెక్టర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.4 వేలకే పరిమితమైందని తెలిపారు. జీఓ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎన్.స్వామి, ఎస్.చంద్రారెడ్డి, ఆంజనేయులు, ఎం.ప్రసాద్, శ్రీనివాస్, టి.రేఖ, డి.వీరన్న, డి.సదానందం, సోమేశ్, సందీప్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు. టీయూఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వర్రావు -
‘సూపర్ స్పెషాలిటీ’ పనులు వేగవంతం చేయాలి
కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ వాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, హాస్పిటల్ పనుల పురోగతిని పరిశీలించారు. అందుబాటులోకి రానున్న వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే, నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తిచేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ వార్డు పరిశీలన.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డును ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ పరిశీలించారు. ఆదివారం ఈ వార్డులో ఉన్న పలువురు పేషంట్లు, అటెండెంట్లపై సీలింగ్ పెచ్చులు ఊడిన విషయం విదితమే. దీంతో నేరుగా తెలుసుకోవడానికి వార్డుకు వచ్చారు. లోపలికి మీడియాను, ఇతర అధికారులను అనుమతించకుండా జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఆమె వెంట డీఎంఈ డాక్టర్ వాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ -
ఓసీ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ డిమాండ్ హన్మకొండ అర్బన్: రామప్ప ప్రపంచ వారసత్వ ప్రదేశం, రామప్ప చెరువు, పరిసర పర్యావరణానికి ముప్పు కలిగించే వెంకటాపూర్ పీవీ నరసింహారావు ఓపెన్న్కాస్ట్ గని ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ డిమాండ్ చేసింది. సోమవారం హనుమకొండ ప్రగతినగర్‌లోని ట్రస్ట్ కార్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మేయర్ డాక్టర్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు హాజరై మాట్లాడుతూ రామప్ప దేవాలయం, చెరువు, పరిసర సహజ, జల, భౌగోళిక వ్యవస్థలను సమగ్రంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపాదిత గనిపై నిర్ణయం తీసుకునే ముందు సమగ్రంగా అధ్యయనాలు నిర్వహించాలని కోరారు. ప్రతిపాదిత గనిలో 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగే అవకాశం ఉన్నందున భూగర్భ జల ప్రవాహం, రామప్ప చెరువు నీటి మట్టం, కట్ట భద్రతపై అధ్యయనం చేయాలని నిపుణులు సూచించారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్న్మెంటల్ ప్రొటెక్షన్ అధ్యక్షుడు కాజీపేట పురుషోత్తం, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, ధర్మప్రకాశ్, ప్రొఫెసర్ శ్రీనివాసాచార్యులు, వాటర్‌మ్యాన్ వి.ప్రకాష్, రామ్మోఆన్రావు, జె.శ్రీధర్‌రావు ఉన్నారు. -
క్రీడలకు ప్రాధాన్యం..
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు నిజామాబాద్‌లో టీజీ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం జట్టు విజేతగా నిలిచింది. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విజేతలు, చీఫ్ జనరల్ మేనేజర్ వి.వేణుబాబు, చీఫ్ ఇంజనీర్ ఎ.సురేందర్, జి.గణేశ్.. సీఎండీని కలిసి ట్రోఫీ అందజేశారు. కాగా, ఓపెన్ డబుల్స్‌లో వి.వేణుబాబు, సురేందర్ ప్రథమ స్థానం సాధించగా, ఓపెన్ సింగి ల్స్‌లో వి. వేణుబాబు తృతీయ స్థానం సాధించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మోహన్రా వు, తిరుపతిరెడ్డి, సి.ప్రభాకర్, జీఎం ఎం.హేమంత్ కుమార్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఐసీఎస్‌యూ వార్డులో.. కాశిబుగ్గ: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆనాడు ఎంతో అందంగా కనిపించిన ఎంజీఎం ఆస్పత్రి భవనాల సముదాయం నేడు శిథిలావస్థకు చేరింది. అధికారులు సకాలంలో శాశ్వత మరమ్మతు పనులు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. పెద్దాస్పత్రి కావడం, పేషంట్ల రద్దీ పెరగడంతో అధికారులు పాత భవనంలోని వార్డుల్లో పేషంట్లకు చికిత్స అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు పేషంట్లకు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు స్పందిస్తూ చర్యలు తీసుకోవడం తప్ప శాశ్వత మరమ్మతుల జోలికి వెళ్లకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని రోగుల అటెండెంట్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, ఆదివారం ఎంజీఎంలోని ఆరోగ్యశ్రీ వార్డులో జరిగిన సీలింగ్ ఊడిన ఘటనలో పేషంట్లు, అటెండెంట్లు, శానిటేషన్ సిబ్బంది గాయపడ్డారు. సోమవారం సాక్షి మెయిన్‌లో ‘సీలింగ్ పెచ్చులు ఊడాయి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్రస్థాయిలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చోంగ్త్, డీఎంఈ వాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం కదిలివచ్చారు. ఆరోగ్యశ్రీ వార్డులో జరిగిన సంఘటన వివరాలపై ఆరా తీశారు. బర్న్స్ వార్డులో కరువైన ఏసీలు.. పాత భవనంలోని ఆరోగ్యశ్రీ వార్డుతో పాటు మరికొన్ని వార్డులు కూడా శిథిలావస్థ దశకు చేరుకుంటున్నాయి. అలాగే, కొన్ని వార్డుల్లో సీలింగ్ పెచ్చులు ఊడిపోయే దుస్థితి నెలకొంది. ఓ వార్డు వాష్ వద్ద స్లాబ్ పైనుంచి నెలరోజుల నుంచి నీళ్లు కారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ముఖ్యంగా ఎంజీఎం సూపరింటెండెంట్ పాత చాంబర్ పక్కనే ఉన్న బర్న్స్ వార్డుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అసలే కాలిన గాయాలతో బాధపడుతున్న పేషంట్లకు ఏసీలు లేకపోగా, ఉన్న వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఓ వార్డులో అయితే సీలింగ్ పెచ్చులు ఊడి ఉన్నాయి. పక్కనే ఫ్యాన్ తిరుగుతుంది. దీంతో మిగిలిన పెచ్చులు పేషంట్లపై పడిపోయే ప్రమాదం నెలకొంది. అలాగే, ఐసీఎస్‌యూ వార్డులో పేషంట్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ వార్డు కావడంతో పేషంట్లు నడవలేని పరిిస్థితి ఉంటుంది. ఇందులో చికిత్స పొందుతున్న ఇద్దరు పేషంట్ల వద్ద సీలింగ్ పెచ్చులు ఊడి ఉన్నా అఽధికారులు పట్టించుకోవడం లేదు. వార్డు సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక న్యూ మెడికల్ వెస్ట్, మేల్ సర్టికల్ ఈస్ట్, మేల్ సర్జికల్ వెస్ట్ వార్డుల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. పక్కనే ఉన్న వాష్‌రూంలు, ఓ బాతురూం వద్ద నెలరోజుల పైనుంచి స్లాబ్ లీకేజీతో నీళ్లు కారుతున్నా పట్టించుకునేవారు కరవయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాంతం దారుణంగా నడవలేని పరిస్థితి ఉన్నా ఎవరూ కన్నెత్తి చూడడం లేదని అటెండెంట్లు ఆరోపిస్తున్నారు. అలాగే, ఎంఆర్డీలో కూడా కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాగా, ఆరు నెలల క్రితం ఏఎంసీ వార్డు వరండా నుంచి వెళ్తున్న స్వీపర్ తలపై పెచ్చులూడి గాయపడగా కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. మేల్ సర్జికల్ వార్డు సమీపంలోని వాష్ రూం వెళ్లే మార్గంలో నీటి లీకేజీ, మేల్ సర్జికల్ వార్డు పక్కన పగుళ్లు వచ్చిన గోడ బర్న్స్ వార్డులో ఊడిన స్లాబ్ పెచ్చులుఎంజీఎంలో శిథిలావస్థకు చేరిన పలు విభాగాలు అధ్వానంగా ఐసీఎస్‌యూ, బర్న్స్, మేల్ సర్జికల్ వార్డులు పాత భవనాల్లో భయంభయంగా రోగులు, అటెండెంట్లుప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోండి.. పేషంట్లకు, అటెండెంట్లకు, సిబ్బందికి ప్రమాదాలు జరగకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఉరుకులు, పరుగుల మీద వచ్చిన అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు పేషంట్ల భద్రత కోసం అన్ని వార్డులు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
శ్వేతార్క గణపతికి పూజలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఉత్తిష్ట గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజు ఆదివారం మూలమహాగణపతిని శ్రీశ్వేతార్క గణపతిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, అర్చకుడు ప్రణవ్ ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు చందుపట్ల సత్యపాల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, గుజ్జ సంపత్‌రావు, ప్రభాకర్ గౌడ్ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలకసంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని రెవెన్యూ డివిజన్, ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. న్యూశాయంపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వరంగల్ జిల్లాలో ఈనెల 21, 22, 23, 24 తేదీల్లో నాలుగు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అధికారులు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నేడు, రేపు జిల్లావ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, 23, 24 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాశిబుగ్గ: బెంగళూరులో జరిగిన రెటీనా సర్జికల్ సర్క్యూట్ కాన్ఫరెన్స్‌కు వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ప్రొఫెసర్, డాక్టర్ వగ్జె శ్రీకుమార్ వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా లీడింగ్‌లో ఉన్న పది కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో డాకర్ శ్రీకుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన లూమినా రెటినా–26 కాన్ఫరెన్స్‌లో ఆధునాతన సర్జికల్ రెటీ నా విధానాలు, శస్త్ర చికిత్సలపై ప్రధానంగా దృష్టి సాధించి, వ్యవహరించే తీరుపై ఆయన తర్ఫీదు పొందారు. కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలికల టోర్నీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిజామాబాద్, మహబూబ్‌నగర్ జట్లు తలపడగా.. 09–03 తేడాతో నిజామాబాద్ జట్టు ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. మూడోస్థానం కోసం జరిగి న మ్యాచ్‌లో వరంగల్ జట్టు నల్లగొండ జట్టుపై 5–0 తేడాతో విజయం సాధించింది. పోటీలలో ప్రతిభ చూపినవారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. వారి కమ్మర్పల్లి మినీ స్టేడియంలో ఐదురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. గోవిందరావుపేట: మండల పరిధిలోని లక్నవరంలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులు సరస్సు అందాలను వీక్షించారు. అనంతరం బోటు షికారుతో పాటు జిప్ లైన్‌పై సైక్లింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. -
పీఆర్సీ అమలు చేయాలి : డీటీఎఫ్
విద్యారణ్యపురి: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని డీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపక జ్వాల సంపాదకుడు డాక్టర్ ఎం గంగాధర్, జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా కమిటీ బాధ్యులు గోవర్ధన్, అల్లం మల్లయ్య, ఎస్.సుమ, ఎం.హర్షవర్ధన్‌రెడ్డి, చిన్నేశ్వరరావు పాల్గొన్నారు. -
స్క్రీనింగ్ టెస్ట్‌కు మిశ్రమ స్పందన
హసన్‌పర్తి: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు మిశ్రమ స్పందన లభించింది. వరంగల్ కమిషనరేట్ పరిధి సీకేఎం కళాశాల, హనుమకొండలోని ఎస్వీఎస్ కళాశాల, జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాల(యశ్వంతపురం రోడ్), పరకాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1,966 మంది పేర్లు నమోదు చేసుకుంటే 975 మంది మాత్రమే పరీక్షకు (54.7 శాతం) హాజరయ్యారు. కాగా, పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ శ్వేతతో పాటు డీసీపీలు పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. కోటను సందర్శించిన సీపీ ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తన కుటుంబ సభ్యులతో సందర్శించారు. ఈసందర్భంగా నాలుగు కీర్తితోరణాల్లోని అద్భుతమైన శిల్పకళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఆతర్వాత ఖుష్‌మాహల్, రాతి, మట్టికోట, ఏకశిలగుట్ట అందాలు వీక్షించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను గైడ్ దేనబోయిన రవియాదవ్ సీపీ శ్వేతకు వివరించారు. చరిత్రను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని సీపీ శ్వేత పేర్కొన్నారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు. -
అట్టహాసం.. స్నాతకోత్సవం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఆదివారం నిట్ 24వ స్నాతకోత్సవ సంబురం అట్టహాసంగా ముగిసింది. పీజీ పట్టాలందుకున్న విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఆనందోత్సాహంతో మెడలోని కండువాలు ఎగురవేశారు. పీజీ, పీహెచ్డీ పూర్తి చేసుకున్న 1,067 మంది విద్యార్థులు ఆదివారం డిగ్రీ పట్టాలను బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. తొలిరోజు శనివారం టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్‌కుమార్ చేతుల మీదుగా 945 మంది యూజీ విద్యార్థులు అందుకున్నారు. రెండు రోజుల స్నాతకోత్సవంలో మొత్తం 1,997 మంది డిగ్రీ పట్టాలు అందుకున్నారు. నిట్ విద్యార్థులు ప్రత్యేకం నిట్ విద్యార్థులు ప్రత్యేకంగా నిలవాలని, పీజీ పూర్తి చేసుకున్న వారి కోసం దేశం ఎదురుచూస్తోందని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్.మోహన్‌రెడ్డి తెలిపారు. నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతూ పరిశ్రమల్లో అనుభవాన్ని సాధించి, స్వయంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి తోటి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. బాధ్యత నిర్వర్తించే సమయమిది.. పట్టాలు అందుకున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులు కన్నకలలను నెరవేర్చే సమయం ఆసన్నమైందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్‌లోని అత్యాధునిక బోధన, సౌకర్యాలు వినియోగించుకుని పట్టాలు అందుకున్న పీజీ విద్యార్థులు తాము నిట్ జెన్ జీ అని దేశం చెప్పుకునేలా ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. ముగిసిన నిట్ 24వ కాన్వొకేషన్ పట్టాలు అందుకున్న 1,067 మంది పీజీ విద్యార్థులు డిగ్రీ పట్టాలందించిన నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి డైరెక్టర్ గోల్డ్ మెడల్ సాధించిన ఆడెపు అంజలి, జలుమేడి భరణి ఉత్తమ పీహెచ్డీ థీసిస్, ఉత్తమ ఎంటెక్ డిసర్టేషన్ గోల్డ్ మెడల్స్ ప్రదానం -
కదిలిస్తే కన్నీళ్లే..
వానాకాలంపై వరుణుడి చిన్నచూపుసాక్షి ప్రతినిధి, వరంగల్: వరుణుడు ముఖం చాటేసినా.. రైతు మాత్రం సాగును వీడలేదు. చినుకు కోసం ఆకాశం వైపు చూస్తూనే.. పంటను కాపాడుకునేందుకు చెమటోడుస్తున్నాడు. వర్షాభావం, కరెంట్ కోతలు వెంటాడుతున్నా పంటలు పండుతాయనే ధీమాతో ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో రైతులను కదిలిస్తే చాలు కన్నీళ్లే వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో ఈ వానాకాలం పరిస్థితి దారుణంగా మారింది. వ్యవసాయశాఖ తాజా గణాంకాలు సాగు పరిస్థితి, రైతు పట్టుదలకు అద్దం పడుతోంది. ఆరు జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. గురువారం నాటికి 14.34 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే దాదాపు 90 శాతం సాగు పూర్తయింది. ఇదే సమయంలో సాధారణంగా కురవాల్సిన 4,763.6 మిల్లీమీటర్ల వర్షపాతానికి 3,516.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. మొత్తంగా 26.2 శాతం లోటు వర్షపాతం నెలకొంది. పత్తి వైపే రైతు మొగ్గు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి 102 శాతం సాగు నమోదవడం గమనార్హం. ములుగు జిల్లాలో మాత్రం 80 శాతంతో అత్యల్ప సాగు నమోదైంది. వర్షాభావ ప్రభావం వరి సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆరు జిల్లాల్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 9,21,445 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 6,77,538 (73.5 శాతం) ఎకరాల్లోనే సాగైంది. నీటి లభ్యతపై అనిశ్చితి, వర్షాల కొరత కారణంగా వరి సాగు సాధారణ లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉంది. నీటి పరిస్థితిని బట్టి రైతులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు పత్తి సాగు మాత్రం సాధారణ లక్ష్యాన్ని దాటింది. ఉమ్మడి వరంగల్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 5,54,387 ఎకరాలు కాగా.. 5,62,162 (101.4శాతం) ఎకరాల్లో సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10,18,774 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 8,48,193 (83.3 శాతం) ఎకరాల్లో సాగు నమోదైంది. చినుకు కోసం ఎదురుచూపు.. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. బోర్లు, బావులు, ఇతర నీటి వనరుల సాయంతో పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షాభావం అధికంగా ఉన్న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హనుమకొండలో సాధారణ వర్షపాతం 730.1 మిల్లీమీటర్లు కాగా 422.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 42.1 శాతం లోటు ఏర్పడింది. వరంగల్‌లో సాధారణ వర్షపాతం 773.6 మిల్లీమీటర్లు కాగా 484 మిల్లీమీటర్లు నమోదై 37.4 శాతం లోటు కనిపించింది. వర్షాభావ ప్రభావం భూగర్భజలాలపైనా కనిపిస్తోంది. ఈ నెల మొదటి పక్షం నాటికి జిల్లాలవారీగా భూగర్భజల మట్టం ఇలా నమోదైంది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10.22 మీటర్ల లోతు కాగా, జనగామలో 9.50 మీటర్లు, హనుమకొండలో 6.83 మీటర్లుగా నమోదైంది. అలాగే, వరంగల్‌లో 6.28 మీటర్లు, ములుగులో 5.13 మీటర్లు, మహబూబాబాద్ జిల్లాలో 4.70 మీటర్లుగా భూగర్భ జలమట్టం ఉంది. ఒకవైపు 26.2 శాతం వర్షాభావం.. మరోవైపు 90 శాతానికి చేరిన సాగు. వరి సాగు లక్ష్యానికి ఇంకా దూరంగా ఉన్నా.. పత్తి మాత్రం సాధారణ విస్తీర్ణాన్ని దాటింది. 3,71,3181,29,8243,59,2811,04,4853,34,4793,26,5482,81,9432,38,9642,39,6722,11,6702,14,9732,13,435మహబూబాబాద్భూపాలపల్లిహనుమకొండజనగామములుగువరంగల్సాధారణ సాగు ఇప్పటివరకు సాగు వర్షాభావం, కరెంట్ కోతలతో రైతులు సతమతం ఆరు జిల్లాల్లో 26.2 శాతం వర్షాభావం 14.34 లక్షల ఎకరాల్లో పంటలు ఉమ్మడి వరంగల్‌లో 90 శాతం సాగుఆరు జిల్లాల్లో సాగు లెక్కలు (ఎకరాల్లో) -
సులభంగా.. వేగంగా
హన్మకొండ: డిజిటల్ విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఆదరణ పెరుగుతోంది. హనుమకొండ జిల్లాలో ప్రతి ఏటా 10 శాతం వృద్ధి సాధిస్తోంది. విద్యుత్ వినియోగదారులు బిల్లులను సులభంగా, వేగంగా, ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా చెల్లించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) డిజిటల్ చెల్లింపు విధానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఇంటి వద్ద నుంచే తమ విద్యుత్ బిల్లులను చెల్లించే సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. డిజిటల్ సౌకర్యం రాకముందు వినియోగదారులు బిల్ కౌంటర్ల వద్దకు చేరుకుని వరుసలో నిలబడి బిల్లులు చెల్లించే వారు. ప్రస్తుతం ఆ ఇబ్బందులు తప్పాయి. అందుబాటులో యాప్‌లు.. ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మారాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ తదితర డిజిటల్ చెల్లింపు యాప్‌లతోపాటు టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్లలోని ఈ యాప్‌ల ద్వారా వినియోగదారులు విద్యుత్ బిల్లును సులభంగా చెల్లిస్తున్నారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పరిధిలోని వివిధ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో వినియోగదారులు తమకు అనుకూలమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకుని బిల్లులను సులభంగా చెల్లించవచ్చని విద్యుత్ అధికారులు తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా.. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని, విద్యుత్ బిల్లుకు సంబంధించిన యూఎస్సీ నంబర్‌ను నమోదు చేయాలి. తద్వారా ప్రతి నెలనెలా విద్యుత్ బిల్లును సులభంగా చెల్లించడంతో పాటు బిల్లు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. డిజిటల్ విధానంలో బిల్లులు చెల్లించడం వల్ల ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తం, బిల్లు వివరాలపై ముందస్తు సమాచారం పొందొచ్చు. సౌకర్యంగా చెల్లింపులు.. హనుమకొండ సర్కిల్లో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో 20,06,649 మంది వినియోగదారులు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించగా, 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 21,13,263 మందికి పెరిగింది. హనుమకొండ జిల్లాలో ఎల్టీ, హెచ్‌టీ కలుపుకుని మొత్తం విద్యుత్ సర్వీస్‌లు 5,00,623 ఉన్నాయి. ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులు 3,70,724 మంది, వాణిజ్య వినియోగదారులు 49,280 మంది, పరిశ్రమలు 2,152, కుటీర పరిశ్రమలు 500, వ్యవసాయ సర్వీస్‌లు 69,335 ఉన్నాయి.డిజిటల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఆదరణ హనుమకొండ జిల్లాలో 2024–2025లో 20,06,649 మంది చెల్లింపు 2025–26 ఆర్థిక సంవత్సరంలో 21,13,263 మందికి పెరుగుదలడిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణ.. విద్యుత్ బిల్లుల డిజిటల్ చెల్లింపులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇంటి వద్ద నుంచి క్షణాల్లో బిల్లులు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులందరు అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా, సులభంగా, సకాలంలో బిల్లులు చెల్లించాలి. – బి.సామ్యానాయక్, ఎస్ఈ, టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ -
ఆదాయం నిల్!
సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026‘గ్రేటర్’లో వ్యాపార సైన్ బోర్డుల సొమ్ము పక్కదారివరంగల్ అర్బన్: విద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతున్న వరంగల్ మహా నగరంలో ప్రచార ప్రకటనలు హోరెత్తుతున్నాయి. భవన అంతస్తుల మేరకు వ్యాపార ప్రకటనలు నిలువెల్లా వెలుస్తున్నాయి. కానీ, బల్దియాకు ఆదాయం మాత్రం సున్నా. ప్రచార బోర్డులకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసినా బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది ఏడాదికోసారి ప్రకటనల పేరుతో వసూళ్లను మరిచి మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో సుమారు 35 వేలకు పై చిలుకు వ్యాపార సంస్థల సైన్ బోర్డులున్నట్లు అంచనా. వీటి ద్వారా బల్దియాకు ప్రతీ ఏడాది రూ.3 కోట్లకుపైగా ఆదాయం సమకూరాల్సి ఉంది. కానీ, పదేళ్లుగా ఒక్క రూపాయి రావడం లేదు. ప్రతీ ప్రచార బోర్డుకు అనుమతి, పన్ను కట్టాలి.. బల్దియాకు వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయాల్లో ప్రకటనలది ఒకటి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్‌కు గుర్తింపు ఉంది. వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి బాట పడుతోంది. వాణిజ్య హోర్డింగులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలు(గ్లో సైన్ బోర్డులు) ముందు పెట్టుకున్న బోర్డులనుంచి ప్రకటనలు భారీగా వెలుస్తున్నాయి. జీడబ్ల్యూఎంసీ నిబంధనల ప్రకారం దుకాణాల నేమ్ బోర్డు స్క్వేర్ మీటర్ ఆధారంగా లెక్కించి నిర్దేశించిన సొమ్మును ప్రతీ ఏడాది చెల్లించాలి. కానీ, అనుమతి తీసుకోకపోవడంతోపాటు పన్నులు చెల్లించడం లేదు. వ్యాపార సంస్థలపై వల్లమాలిన ప్రేమ నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాల దుకాణాలముందు పెట్టుకున్న బోర్డులనుంచి ప్రకటనల పన్నులను వసూలు చేసేందుకు టెండర్ నిర్వహించి, ప్రైవేట్ సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. 2012–13 ఏట పన్నుల రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 2013–14 నుంచి టెండర్లు పిలవకుండా టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వసూలు చేస్తున్నారు. 2013–14లో గ్లో సైన్ బోర్డుల ద్వారా రూ.13.30 లక్షలు వసూలు చేశారు. 2014–15లో రూ. 52.39 లక్షలు, 2015–16లో రూ.9.54 లక్షలు, 2016–17లో రూ.4.57 లక్షలు వసూలు చేశారు. కానీ, గత పదేళ్లుగా డబ్బులు వసూలు చేయడం లేదు. రూ.20 కోట్ల ఆదాయానికి గండి.. గత పదేళ్లుగా ప్రకటనల బోర్డు ఆదాయాన్ని విస్మరించడంపై బల్దియాకు సుమారు రూ.20 కోట్ల మేర ఆదాయం నష్టపోవాల్సి వచ్చింది. ఆస్తి పన్ను చెల్లించకపోతే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల తలుపులు, కిటికీలు, టీవీలు, ఫర్నిచర్ జప్తు చేస్తూ పరువు తీస్తారు. కానీ, వ్యాపార నిర్వాహకుల నుంచి గ్లో సైన్ బోర్డుల ప్రకటనల పన్నులు వసూలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన వ్యాపార వాణిజ్య సంస్థల వల్ల ఏడాదికి సుమారు రూ.3 కోట్లకు పైగా ఆదాయం రాకుండా పోతున్నట్లు అంచనా. వరంగల్ జేపీఎన్ రోడ్డులో దుకాణాలకు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులు పదేళ్లుగా వసూలు చేయని టౌన్‌ప్లానింగ్ విభాగం బల్దియా ఆదాయానికి భారీగా గండి ప్రభుత్వ నిబంధనలు లెక్క చేయకపోవడంపై విమర్శలుదుకాణాల ఎదుట పెట్టుకున్న ప్రకటనల పన్నులను వసూలు చేసేందుకు గ్రేటర్ టౌన్ ప్లానింగ్‌లో ప్రత్యేకంగా విభాగం లేదు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, చైన్మెన్లకు వసూళ్ల బాధ్యతలు కట్టబెట్టారు. సర్కిళ్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని వసూలు చేయాల్సి ఉంది. కానీ, వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్దకు ప్రకటనల పన్నుల కోసం వెళ్తున్న వీరు బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. యజమానులనుంచి ఎంతోకొంత తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రేటర్ టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రకటన పన్నుల వసూళ్లపై బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్‌ను వివరణ కోరగా.. ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. -
ఉనికిచర్ల టు భీమారం
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం భీమారం శివారులో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూమిని గుర్తించారు. ఇప్పటికే ఈ భూమి సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఆమోదం వచ్చాక పనులు చేపట్టనున్నారు. ఏడాది క్రితం వరంగల్‌కు స్పోర్ట్స్ స్కూల్‌తోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఉనికిచర్లలో (జాతీయ రహదారికి పక్కనే) భూమిని అధికారులు గుర్తించారు. స్టేషన్ ఘన్‌పురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తన నియోజకవర్గంలోనే స్పోర్ట్స్ స్కూల్ నిర్మించాలని పట్టుబట్టారు. ఉనికిచర్లలోని సర్వే నంబర్ 325లో సుమారు 30 ఎకరాల భూమిని స్పోర్ట్స్ స్కూల్, స్డేడియానికి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. సేకరించే క్రమంలో అక్కడ భూమి వివాదంగా మారింది. దీంతో ఈ స్కూల్‌ను భీమారానికి షిఫ్ట్ చేశారు. భీమారంలోని సర్వే నంబర్ 70లో సుమారు 22 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి అందించారు. కలెక్టర్ పరిశీలన కాగా, స్పోర్ట్స్ కోసం భీమారం శివారులో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని ఇటీవల హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. సుమారు 35 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఈభుమిలో కస్తూర్బా గాంధీ విద్యాలయం, ఎస్టీ మహిళా హాస్టల్‌తో పాటు చేపల ఉత్పిత్తి కేంద్రం ఉన్నట్లు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వం 22 ఎకరాల అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఇటు 563 జాతీయ రహదారి, అటూ 163 జాతీయ రహదారికి అనుకుని ఈ ప్రతిపాదిత స్థలం ఉన్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. నిధులు మంజూరు.. స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభం కాకపోవడం వల్ల స్పోర్ట్స్ స్కూల్ తరగతులు జవహర్లాల్ నెహ్రూ స్డేడియం భవనంలో తాత్కాలికంగా ప్రారంభించారు. స్పోర్ట్స్ స్కూల్ తరలింపు 22 ఎకరాల భూమి గుర్తింపు రూ.150 కోట్లు మంజూరు -
విద్యుదాఘాతంతో రైతు మృతి
● ఆదివారంపేటలో ఘటన గూడూరు: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు ఆదివారంపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూనావత్ వాల్యానాయక్ (60) తన ఇంటి వద్ద సంపుపై అమర్చిన విద్యుత్ మోటారు పై ఉన్న తాడు తీస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి పెద్ద కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సెకండ్ ఎస్సై యాదవరెడ్డి తెలిపారు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
బల్దియా కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆదివారంలోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్, విలీన గ్రామాల పరిధి చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్య చర్యలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. ఎస్ఈ రాజ్‌కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్, సంజయ్‌కుమార్, మహేందర్, సంతో శ్‌బాబు, మాధవీలత, డీఈ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు. యూజీడీ పనులపై దృష్టి సారించాలి.. నగరంలో యూజీడీ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ) పనులను గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. పీఎంయూ ఏర్పాట్లను పరిశీలించారు. పనులు వేగవంతం చేయండిహసన్పర్తి: హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారి మార్గమధ్యలోని కిట్స్ కళాశాల జంక్షన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కమిషనర్ వెంకన్న ఆదేశించారు. శనివారం కిట్స్ కళాశాల జంక్షన్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
పటిష్ట విద్యుత్ ఏర్పాట్లు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డిహన్మకొండ: వినాయక నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యుత్ శాఖపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండలోని బందం చెరువు, సిద్ధేశ్వర గుండం, వరంగల్‌లోని ఉర్సుగుట్ట నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించారు. విద్యుత్ సరఫరా ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక నిమజ్జన కేంద్రాలు, ప్రధాన ఊరేగింపు మార్గాలు, గణేశ్ మండపాల వద్ద విద్యుత్ తీగల సరిజేత, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, స్టే వైర్లు, సర్వీస్ వైర్లు తదితర విద్యుత్ మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు బి.సామ్యనాయక్, ఎ.ఆనందం, డీఈలు జి.సాంబరెడ్డి, ఎస్.మల్లి కార్జున్ ఏడీఈలు పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎం.ఇంద్రసేనారెడ్డి, చంద్రమోహన్, ఏఈలు పాల్గొన్నారు. -
పగలు ఆటో డ్రైవింగ్.. రాత్రి చోరీలు
హసన్‌పర్తి: పగలు ఆటో నడుపుతూ రాత్రివేళ చో రీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చోరీ వివరాలను ఇన్స్పెక్టర్ రవికుమార్ వె ల్లడించారు. నగరంలోని ఏనుమాముల బాలాజీనగర్‌కు చెందిన పస్తం ఐలుకుమార్ హనుమకొండ బాలసముద్రంలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో డబ్బు సరిపోక పార్కింగ్ చేసి ఉన్న వాహనాల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు కేయూసీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎర్రగట్టు గుట్ట వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా 16 బ్యాటరీలు చోరీ చేసినట్లు అంగీకరించాడు. వాటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు. గతంలో సెల్ఫోన్లు చోరీ చేసి జైల్‌కు కూడా వెళ్లినట్లు తెలి పారు. నిందితుడి పట్టుకున్న కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై నవీన్‌కుమార్, సిబ్బంది అహ్మద్‌పాషా, రాజశేఖర్‌ను సీపీ శ్వేత అభినందించారు. -
బీఆర్ఎస్ నేతల విషప్రచారాన్ని నమ్మొద్దు
● టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానవతా రాయ్వరంగల్ చౌరస్తా: 22–ఏ నిషేధిత జాబితాలోని భూముల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి, వరంగల్ – హనుమకొండ సమన్వయకర్త కోటూరి మానవతారాయ్ విమర్శించారు. శనివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్లాది ఎకరాల ప్రజల భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చిందంటూ బీఆర్ఎస్ నేతలు విషప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. 22–ఏ సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు అయూబ్, ఇనగాల వెంకట్రాంరెడ్డి భూదాన్, వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, ఓబీసీ సెల్ చైర్మన్ ఓర్సు తిరుపతి, మహిళ జిల్లా అధ్యక్షురాలు కర్ణాటీ పార్వతమ్మ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, జిల్లా అధికార ప్రతినిధులు నిమ్మానిశేఖర్ రావు, ఎర్ర యాకూబ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కమలుద్దీన్, వర్ధన్నపేట టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్, నాయకులు రహమతుల్లా, మహిబూద్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన ఆనందం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ 24వ స్నాతకోత్సవ సంబురం అంబరాన్నంటింది. నిట్ క్యాంపస్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న కాన్వొకేషన్ మహోత్సవంలో తొలిరోజు శనివారం 930 మంది యూజీ, 22 మంది ఎగ్జిట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. గౌరవ అతిథిగా నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హాజరై అధికారికంగా స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్, డిగ్రీ పట్టాలు అందించారు. వ్యక్తిత్వానికి దిక్సూచి.. నిట్ విద్యార్థులు వ్యక్తిత్వానికి దిక్సూచిగా నిట్ విద్యార్థులు నిలవాలని, వ్యక్తిత్వమే భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్‌కుమార్ తెలిపారు. టెక్నికల్ స్కిల్స్, డిగ్రీలు, రెజ్యూమ్ ఒక వ్యక్తి కెరీర్‌కు సాఫ్ట్వేర్ వంటివి కాగా, వ్యక్తిత్వం, నిజాయతీ, విశ్వసనీయత హార్డ్‌వేర్ వంటి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవనం కొనసాగించాలన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమలోని ఈల్డ్‌ను ఉదాహరణగా తీసుకుని వైఫల్యాలను అధిగమించి లక్ష్యాన్ని సాధించాలన్నారు. మైక్రో గ్రిడ్, వ్యవసాయ సెన్సార్లు, సురక్షిత తాగునీరు అందించడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం నూతన ఆవిష్కరణలతోనే సాధ్యమని తెలిపారు. ఏఐ యుగంలోనూ ఇంజనీర్ల పాత్ర కీలకం నేటి ఏఐ యుగంలోనూ ఇంజనీర్ల పాత్ర కీలకమైందని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్.మోహన్‌రెడ్డి తెలిపారు. ‘ద రోల్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఇన్ ద ఏఐ ఎరా’ అంశంపై మాట్లాడారు. వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇంజనీర్ల బాధ్యతలు మరింతగా విస్తరిస్తున్నాయని, సమాజానికి సేవ చేయడానికి నిట్ విద్యార్థులు ముందుండాలన్నారు. విద్యార్థుల జీవితాల్లో నూతన అధ్యయనం స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలను అందుకోవడం విద్యార్థుల జీవితాల్లో నూతన అధ్యాయానికి నాంది అని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్‌లో విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరంలో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ వెహికిల్స్, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంటెక్ విభాగంలో నూతన కోర్సులు ప్రారంభించినట్లు తెలిపారు. క్యాంపస్ సెలక్షన్స్‌లో యూజీ విద్యార్థులు 93.94 శాతం, పీజీ విభాగంలో 80.78 విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారని అత్యధిక ప్యాకేజీ రూ.1.27 కోట్లు నమోదైనట్లు తెలిపారు. నేడు పట్టాలందుకోనున్న పీజీ విద్యార్థులు.. నిట్ వరంగల్‌లో 24వ స్నాతకోత్సవంలో భాగంగా రెండో రోజు ఆదివారం పీజీ (బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ)పీహెచ్డీ విద్యార్థులు బెస్ట్ పీహెచ్డీ ఽథీసిస్, బెస్ట్ ఎంటెక్ అవార్డులతో పాటు రోల్ ఆఫ్ హనర్ గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. పీజీ విభాగంలో 945 పీజీ, 100 పీహెచ్డీ, 22 ఎగ్జిట్ డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు.మాట్లాడుతున్న నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టెక్సాస్ ఎండీ సంతోశ్కుమార్స్నాతకోత్సవంలో పాల్గొన్న నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టెక్సాస్ ఎండీ సంతోశ్‌కుమార్, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, అధ్యాపకులునిట్లో అంబరాన్నంటిన 24వ స్నాతకోత్సవం పట్టాలందుకున్న 930 యూజీ, 22 ఎగ్జిట్ డిగ్రీ విద్యార్థులు నేడు 1,067 మంది పీజీ విద్యార్థులకు ప్రదానం -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
ఖిలా వరంగల్: క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.రామచంద్రం అన్నారు. శనివారం వరంగల్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల క్రీడామైదానంలో వాగ్దేవి కళాశాల ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేయూ యూనివర్సిటీ అండ్ కాలేజ్ 2026–27 క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం హాజరై క్రీడోత్సవాలను ప్రారంభించారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 780 మంది మహిళా క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. 21 తేదీ వరకు పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ టి.శాస్త్రి, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ వాణిదేవి, హెచ్.సుదర్శన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సునీల్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14, 17, 19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు శనివారం ముగిశాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో రజిత, రాజేశ్వరి, స్వరూప, పార్థసారథి, ప్రశాంత్, శేఖర్, సురేశ్, రజనీకాంత్, బాలమురళీకృష్ణ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కొనసాగుతున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూలమహాగణపతిని శ్రీహేరంబగణపతిగా అలంకరించి దూర్వాయుగ్మ పూజ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలగణపతిని శ్రీహేరంబగణపతిగా అలంకరించి దూర్వాపత్రాలతో (గరిక) లక్షవినాయక నామాలతో లక్షగరిక పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కాగితోజు శివలింగాచారి, సోమ సురేశ్, ఎర్రోళ్ల వంశీ, కట్ల రాజు, వృక్షాల చంద్రశేఖర్ ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం నృత్యగురువు బొంపల్లి సుధీర్‌రావు శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలోని మణికంఠ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 316 కిలోల బాహుబలి లడ్డూను తయారు చేసి పెద్ద ఎత్తును ఊరేగించారు. లడ్డూదాత బయ్య స్వప్న–అశోక్ ఇంటి వద్ద పోచమ్మ గుడి నుంచి మహాగణపతి మండపం వరకు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, భక్తి పాటలు, కీర్తనలతో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు బాహుబలి లడ్డ్డూను ఆసక్తిగా తిలకించారు. కమల గణనాథుడికి 108 రకాల నైవేద్యం వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలోని సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో కొలువుదీరిన కమల గణనాథుడికి ఈ ఏడాది రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. శనివారం సంస్థ అధినేత, వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు. -
ప్రతీ పౌరుడికి హక్కులు అందేలా పనిచేయాలి
మరిపెడ/మరిపెడ రూరల్: ప్రజలకు న్యాయవస్థను మరింత చేరువ చేయడంతోపాటు పెండింగ్ కేసులు పరిష్కారంలో వేగం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, మహబూబాబాద్ జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ అన్నారు. బార్, బెంచ్ మధ్య సమన్వయం బలోపేతం అయిప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి–కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాన్ని జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్, జస్టిస్ ఎన్. రాజేశ్వర్‌రావు, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ మాట్లాడుతూ న్యాయవాదులు కేవలం కక్షిదారుల తరఫున వాదించేవారే కాకుండా ‘ఆఫీసర్ ఆఫ్ ది కోర్టు’గా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మరిపెడ కోర్టు పరిధిలో ప్రస్తుతం 1,903 కేసులు ఉన్నాయని, మరోమారు తాము కోర్టును సందర్శించే సమయానికి కనీసం 1,000 కేసులు పరిష్కరించేలా పని చేయాలన్నారు. భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయ రక్షణలు సమానంగా అందేలా చూడడం న్యాయవ్యవస్థ బాధ్యతని పేర్కొన్నారు. సామాజిక స్పృహతో వ్యవహరించాలి.. నేటి కార్పొరేట్ కల్చర్ యుగంలో న్యాయవాదులు సామాజిక స్పృహ కలిగి కక్షిదారులకు న్యాయం చేయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరావు అన్నారు. దేశంలో రోజురోజుకూ కక్షిదారులు పెరిగి పోతున్నారని, నేటికి దేశ వ్యాప్తంగా 5.3 కోట్ల కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం అత్యంత ఆవశ్యకమన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తన స్వగ్రామం సూదనపల్లి వాసిగా మరిపెడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, స్వగ్రామ ప్రాంతంలో న్యాయస్థానం ఏర్పాటవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరిపెడకు తగ్గిన దూరభారం.. మరిపెడ ప్రజలు కోర్టు పేషీల కోసం 45 కిలో మీటర్లు ప్రమాణం, సమయం, ఖర్చు చేసి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, జస్టిస్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మరిపెడలో కోర్టు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత వాసులకు సత్వర సేవలు అందుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. మధుసూదన్‌రావు అన్నారు. ఈ కోర్టు పరిధిలో మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, సీరోలు మండలాలకు సంబంధించి నాలుగు పోలీస్ స్టేషన్లకు చెందిన 2,000 కేసులు జ్యుడీషియల్‌కు కేటాయిస్తారన్నారు. అంతకు ముందు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్, కలెక్టర్ స్నేహశబరీశ్ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డి.కె.మురళీమోహన్, న్యాయమూర్తులు శాలిని షాకెల్లి, స్వాతిమురారి, కృష్ణతేజ్, ధీరజ్‌కుమార్, జీవన్‌కుమార్, మహతి వైష్ణవి, అఖిల్, దిలీప్‌కుమార్ నాయక్, సూర్యచంద్రకళ, కిరణ్లాల్, చండేశ్వరీదేవి, జోస్స్న, ఎస్పీ శబరీశ్, తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ మరిపెడలో నూతన సివిల్ కోర్టు ప్రారంభం -
వైద్య, న్యాయ సేవలందించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.రామకృష్ణ సునీతహన్మకొండ అర్బన్: వినికిడి లోపం ఉన్న పిల్లలు, దివ్యాంగులకు అవసరమైన వైద్య సేవలు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎం.రామకృష్ణ సునీత అధికారులను ఆదేశించారు. ప్రపంచ బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మల్లికాంబ మనోవికాస కేంద్రంలో వినికిడి లోపం ఉన్న పిల్లలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహించారు. మల్లికాంబ మనోవికాస కేంద్రం పిల్లలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.రామకృష్ణ సునీత, ఈఎన్టీ వైద్య నిపుణుడు డాక్టర్ సుదీప్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.వెంకట హైమపూజిత, మల్లికాంబ మనోవికాస కేంద్రం వ్యవస్థాపకురాలు బి.రామలీల, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎం.ప్రదీప్, అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు అనూష, శ్రీవల్లి శైలజ, మధులిక తేజ, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్, ప్రొఫెసర్ పద్మ, బండ సదానందరావు, కొడం కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
లర్నర్స్ ల్యాండ్ స్కూల్ అధినేత తాళ్ల మల్లేశం కన్నుమూత
కాశిబుగ్గ: లర్నర్స్ ల్యాండ్ స్కూల్, తాళ్ల పద్మావ తి విద్యాసంస్థల అధినేత తాళ్ల మల్లేశం శని వారం రాత్రి (73) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ చార్‌బౌళిలోని లర్నర్స్ల్యాండ్ కాలనీలో కన్నుమూశారు. ఆయన మృతికి పలు పాఠశాలల కరస్పాండెంట్లు, కాలనీ వాసులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనకు భార్య ఝాన్సీ, కుమారులు వంశీ, తరుణ్ ఉన్నారు. కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య నయీంనగర్ : కుటుంబ కలహాలతో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమకొండ దీన్‌దయాల్ నగర్లో కానిస్టేబుల్ బి.అనిల్ భార్య శిరీష (36) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ బి. అనిల్ హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఫింగర్ ప్రింట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన శిరీష మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, శిరీషకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు అవసరం
కేయూ క్యాంపస్: భారతదేశ అభివృద్ధికి మరిన్ని నూతన ఆవిష్కరణలు అవసరమని, అందుకనుగుణంగా జిజ్ఞాస పెంపొందించుకోవాలని హైదరాబాద్‌లోని సెయింట్ టెక్నాలజీస్ చైర్మన్, పద్మశ్రీ బి.వి మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో విద్యార్థుల, వివిధ విభాగాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ప్రతీ ఏడాది సుమారు కోటిమంది ఉద్యోగ మార్కెట్లో ప్రవేశిస్తున్నారన్నారు. దేశానికి ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ గొప్ప అవకాశమన్నారు. జనాభాలో సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉండడం దేశానికి బలమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యంత వేగంగా మారుతుందోన్నారు. దీనివలన ఇప్పటికి ఉన్న వ్యాపార నమూనాలు, ఉద్యోగాల స్వరూపం కూడా మారిపోతోందన్నారు. చాట్బాట్లు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతిక సాధనాలను ముప్పుగా కాకుండా ఉత్పాదతకంగా వినియోగించుకోవాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్డీ బి. వెంకట్రాంరెడ్డి, రూసా నోడల్ అధికారి ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెయింట్ టెక్నాలజీస్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ బి.వి మోహన్‌రెడ్డి -
ఆరుగురు సూపరింటెండెంట్లకు ఏఆర్లుగా పదోన్నతి
● కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఆరుగురు సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పిస్తూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, వారికి పోస్టింగ్ ఉత్తర్వులు కూ డా వీసీ కె. ప్రతాప్‌రెడ్డితో కలిసి అందజేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు పొందిన కె. భూపాల్‌రెడ్డి పరీక్షల విభాగం, ఎం. సునీల్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎం. భాస్కర్ క్యాంపస్‌లోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల, బి. ప్రభాకర్ కేయూ హాస్టల్ ఆఫీస్, కె. శ్రీనివాస్ పబ్లికేషన్ సెల్, జి. సురేశ్‌బాబుకు అకౌంట్స్ విభాగంలో పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఇద్దరికి లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ –1గా పదోన్నతి కాకతీయ యూనివర్సిటీలో లైబ్రరీ అసెస్టెంట్ గ్రేడ్ –2గా పనిచేస్తున్న ఇద్దరికి అసిస్టెంట్ గ్రేడ్ –1గా పదోన్నతులు కల్పి స్తూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ‘లా’ కాలేజీలో లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్–2గా పనిచేస్తున్న సుమలతకు, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్‌కళాశాలలో లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ –2గా పనిచేస్తున్న అశోక్‌కు లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ –1గా పదోన్నతి కల్పించారు.అలాగే వారిద్దరికి కాకతీయ యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీలో పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు.. కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అందులో ముగ్గురికి సీనియర్ కోటా కింద, మరొకరికి టెస్ట్ కోటాలో పదోన్నతి కల్పించారు. హనుమకొండలోని సుబేదారి యూనివర్సిటీ పీజీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ బోథ్రాజుకు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ క్యాంపస్‌లోని హాస్టల్ ఆఫీస్‌లో పోస్టింగ్ ఇచ్చారు. వీసీ పేషీలో సీనియర్ అసిస్టెంట్ సి. రవికి సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. అకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ వినయ్‌కు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించి దూరవిద్య కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చారు. కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలోని సీనియర్ అసిస్టెంట్ మదార్అలీకి సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించిఅదే ఇంజనీరింగ్ కళాశాలలో పోస్టింగ్ ఇచ్చారు. వీరికి వీసీ ప్రతాప్‌రెడ్డి ,రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు అందజేశారు. 49మంది పార్ట్‌టైం లెక్చరర్ల నియామకంకాకతీయ యూనివర్సిటీలో 2026–2027విద్యాసంవత్సరానికి వివిధ విభాగాలు, ‘లా’ కళాశాలకు 49మంది పార్ట్‌టైం లెక్చరర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి రిజిస్ట్రార్ వి.రామచంద్రం జాబితా వెల్లడించి నోటీస్ బోర్డుపై ప్రదర్శించారు. కొన్నినెలల క్రితం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సెలక్షన్ కమిటీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారు. కెమిస్ట్రీ విభాగంలో 9మంది, కంప్యూటర్ సైన్స్ విభాగం ఏడుగురు, కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగం 14మంది, ఇంగ్లిష్ విభాగం ఇద్దరు, జియాలజీ ఒకరు, యూనివర్సిటీ ‘లా’ కాలేజీలో నలుగురు, లైబ్రరీ సైన్స్విభాగంలో ఒకరు, ఫిజిక్స్‌లో ఐదుగురు, పొలిటికల్ సైన్స్‌లో ఒకరు, సైకాలజీ ఇద్దరు, సొషియాలజీ ఒకరు, తెలుగులో ఒకరు, జువాలజీలో ఒకరిని ఎంపిక చేశారు. వీరికి ఈనెలాఖరులోపు ఆయా విభాగాల అధిపతులు ఉత్తర్వులు ఇవ్వాల్సింటుంది. -
పర్యాటక దినోత్సవానికి కార్యాచరణ
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో పర్యాటక, విద్యా, పురావస్తు, అటవీ తదితర శాఖల అధికారులతో ప్రపంచ పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 24న ఉదయం 6 గంటలకు హనుమకొండ కలెక్టరేట్లో యోగా పోటీలతో ప్రారంభమై 27వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, అదనపు కలెక్టర్ రవి, జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందరెడ్డి, డీఈఓ గిరిరాజ్‌గౌడ్, హనుమకొండ ఏసీపీ నరసింహరావు, అడిషనల్ డీఆర్డీఏ వెంకటేశ్వర్లు, జీడబ్ల్యూఎంసీ సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇరిగేషన్ ఈఈ మంగిలాల్, డీఐఈఓ గోపాల్, కేంద్ర పురావస్తు అధికారి అజిత్‌కుమార్, ఏఎస్ఎస్ అధికారి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలిఎంపీ ల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ దేవిక చౌహాన్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, పంచాయతీరాజ్ ఈఈ రాజగోపాల్రావు, డీఈలు శ్రీనివాసరావు, శిరీష, యుగంధర్, రామ్‌దేవ్, సాంకేతిక సలహాదారు నరేందర్‌రెడ్డి, టీజీఐడీసీ ఏఈ ఎండీ అజీజ్‌ఖాన్, పంచాయతీరాజ్ ఏఈలు, అధికారులున్నారు. -
రెడ్‌క్రాస్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల
● హనుమకొండ జిల్లాలో 9,896 మంది, వరంగల్ జిల్లాలో 3,234 మంది ఓటర్లు ● ఈనెల 24న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 4న ఎన్నికలుహన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.నవీన్‌కుమార్ విడుదల చేశారు. జాబితాలో మొత్తం 9,896 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతీ నామినేషన్‌ను ఇద్దరు అర్హత కల్గిన సభ్యులు ప్రతిపాదించాలి, సమర్థించాలి. 25న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికై న మేనేజింగ్ కమిటీ సభ్యులకు ఓటింగ్ నిర్వహించి జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, రాష్ట్ర పాలక మండలి సభ్యులు, కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయం, సుబేదారి, హనుమకొండలో జరుగుతుంది. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 20 నుంచి రూ.2 వేలు చెల్లించి పొందవచ్చు. సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటల నుంచి రెడ్‌క్రాస్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ అభ్యర్థికి గరిష్ఠంగా రెండు నామినేషన్లు మాత్రమే ఆమోదిస్తారు. నామినేషన్ పత్రంతో పాటు రూ.10 వేలు నాన్ రీఫండబుల్ భద్రతా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. వరంగల్ జిల్లాలో.. న్యూశాయంపేట: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఎన్.వసంత శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సొసైటీలో మొత్తం 3,234 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. -
ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
హసన్‌పర్తి: వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర కొనసాగుతుండడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ చెప్పారు. భారీ వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ఉండేందుకు ట్రైసిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. భారీ వాహనాల మళ్లింపు ఇలా.. ● ములుగు–భూపాలపల్లి వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలు ఆరెపల్లి రింగ్ రోడ్డు నుంచి చింతగట్టు మీదుగా.. ● భూపాలపల్లి – పరకాల నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కరుణాపురం వయా వెంకటాపూరం, ఐనవోలు మీదుగా ● భూపాపల్లి–పరకాల నుంచి నర్సంపేటకు వెళ్లే వాహనాలు కొత్తపేట–రెడ్డిపాలెం మీదుగా.. ● కరీంనగర్ – ఖమ్మం వెళ్లే వాహనాలు చింతగట్టు ఓఆర్ఆర్ మీదుగా కరుణాపురం, వెంకటపూరం మీదుగా.. ● ఖమ్మంనుంచి కరీంనగర్–హైదరాబాద్ వైపునకు వెళ్లే భారీ వాహనాలు పున్నేలు క్రాస్ రోడ్డు, ఐనవోలు, వెంకటపూర్, కరుణాపురం మీదుగా.. ● హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు కరుణాపురం, వెంకటపూర్, ఐనవోలు, పున్నేలు క్రాస్‌రోడ్డు మీదుగా.. ● నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాలు సిటీ అవతల నిలిపివేయాలి. నిమజ్జనం సందర్భంగా భారీ వాహనాలకు అనుమతి లేదు. ● హైదరాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్లే వాహనాలు కరుణాపురం నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఆరెపల్లి వయా ఆత్మకూరు, కటాక్షపూర్, మల్లంపల్లి మీదుగా.. ● నర్సంపేట నుంచి వరంగల్, హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు వయా మల్లంపల్లి, కటాక్షపూర్, ఆత్మకూరు, ఆరెపల్లి ఓఆర్ఆర్ మీదుగా.. సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం అనంతరం న్యూశాయంపేట వైపునకు న్యూశాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాల వాహనాలు హంటర్‌రోడ్డు, అదాలత్, హనుమకొండ చౌరస్తా, మీదుగా .. ఎకై ్సజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు బంధం చెరువులో నిమజ్జనం చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపునకు.. శోభాయాత్ర వెళ్లే మార్గాల్లో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో వాహనాలు నిలుపరాదు. ఇందుకు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ శ్వేత కోరారు. నిమజ్జన వేళ నగరంలో వాహనాల మళ్లింపు 23 నుంచి 25వ తేదీ వరకు అమలు భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ములుగు, పరకాల వైపు నుంచి హనుమకొండ వైపునకు వచ్చే ఆర్టీసీ బస్సులు వయా పెద్దమ్మ గడ్డ నుంచి కేయూసీ, సీవీఓ, అంబేడ్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్, మీదుగా బస్టాండ్ హనుమకొండ బస్టాండ్ నుంచి బయల్దేరి ములుగు, కరీంనగర్ వైపునకు వెళ్లే బస్సులు వయా ఏషియన్ శ్రీదేవిమాల్, అంబేడ్కర్ సెంటర్, సీపీఓ ద్వారా కేయూసీ జంక్షన్ మీదుగా.. హనుమకొండ బస్టాండ్ నుంచి బయల్దేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా.. వరంగల్ బస్టాండ్ నుంచి హనుమకొండ వైపు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జి నుంచి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట అదాలత్, బాలసముద్రం రోడ్డు మీదుగా.. కాజీపేట నుంచి వరంగల్ వైపునకు వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలు ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి చర్చి, కేయూసీ జంక్షన్, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు, ఎంజీఎం, జెమిని, పోతన జంక్షన్, అండర్ బ్రిడ్జి, హెడ్ పోస్టాఫీస్, వరంగల్ బస్టాండ్, వెంకట్రామ సర్కిల్ వరంగల్ నుంచి కాజీపేట వైపునకు వెళ్లే కార్లు, ఇతర చిన్నవాహనాలు వెంకట్రామ సర్కిల్, వరంగల్ బస్టాండ్, హెడ్ పోస్టాఫీస్, అండర్ బ్రిడ్జి పోతన జంక్షన్, జెమిని, ఎంజీఎం, ములుగు రోడ్డు, పెద్దమ్మ గడ్డ, కేయూసీ జంక్షన్, వడ్డేపల్లి చర్చి, ఫాతిమా జంక్షన్ -
టీబీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ఆరోగ్యశాఖతో సమన్వయం చేస్తూ టీబీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో టీబీ ముక్త్ అభియాన్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు తమ పరి ధిలో టీబీ ముక్త్ అభియాన్ కమిటీలను ఏర్పాటు చేసి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, వైద్యారోగ్యశాఖాధికారి బి.రాజారెడ్డి, నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డాక్టర్ సంధ్యారాణి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరబాయి, టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్‌జోషి, డీఆర్డీఓ నాగపద్మజ, జెడ్పీ సీఈఓ వసంత, ఎన్సీసీ కమాండర్ కెప్టెన్ సదానందం, ఎస్.కీర్తనమాల, మండల ప్రత్యేకాధికారులు, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలి.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపునీటిని ఒడిసి పట్టేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫాంపాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ పనులు చేపట్టాలని సూచించారు. 39,855 మంది హియరింగ్ పూర్తి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,94,395 మందికి నోటీసులు జారీ చేయగా 39,855 మంది హియరింగ్ పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. నోటీసులపై నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పూర్తిచేసి తదుపరి ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. -
ప్రతీ పౌరుడికి హక్కులు అందేలా పనిచేయాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ ● మరిపెడలో సివిల్ కోర్టు ప్రారంభంమహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి–కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్‌రావు, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావు ప్రారంభించారు. ప్రజలకు న్యాయవస్థను మరింత చేరువ చేయడంతోపాటు పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. – మరిపెడ/మరిపెడ రూరల్ -
డీలర్లకు యూపీఐ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలి
హన్మకొండ/ఖిలావరంగల్: రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు యూపీఐ లావాదేవీలపై చార్జీల నుంచి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు కోరారు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ రైతులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డీలర్లపై అదనపు లావాదేవీల వ్యయాలు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. యూపీఐ చెల్లింపులపై డీలర్లకు ప్రత్యేక మినహాయింపు లేదా రాయితీ విధానం అమలు చేయాలని సూచించారు. -
గ్రాడ్యుయేట్ ఓటు.. దరఖాస్తు చేయకుంటే చేటు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్‌ను విడుదల చేయడంతో కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు సైతం మళ్లీ ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాత జాబితాలో పేరు ఉన్నదనే కారణంతో కొత్త జాబితాలో పేరు ఆటోమేటిక్‌గా కొనసాగదు. 2021లో 5.05 లక్షల మంది.. 2024 ఉప ఎన్నికలో తగ్గిన ఓటర్లు.. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. అప్పటి జాబితాలో 5,05,565 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,32,634 మంది పురుషులు, 1,72,864 మంది మహిళలు, 67 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 1,81,313 మంది ఓటర్లు నమోదయ్యారు. ఆ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంనుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో 2024లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. 2024 ఉప ఎన్నిక తుది ఓటర్ల జాబితాలో 4,61,806 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు ఇతర ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎంతమంది? 2021 ఎన్నికతో పోలిస్తే 2024 ఉప ఎన్నిక నాటికి ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు మరోసారి కొత్తగా పట్టభద్రుల ఓటర్ల జాబితాను రూపొందించనుండడంతో ఈసారి ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటారు? తుది జాబితాలో ఓటర్ల సంఖ్య ఎంతకు చేరుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అర్హత ఉన్న ప్రతీ పట్టభద్రుడు ఫారం–18 దరఖాస్తు చేయడం కీలకం. నవంబర్ 6 తర్వాత మిగిలిన ప్రక్రియ కొనసాగి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఓటర్ల నమోదుపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు.. పోటాపోటీగా నమోదు చేయించేందుకు వ్యూహరచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021 ఎన్నికలకంటే ఈసారి 15 నుంచి 25 శాతం వరకు ఓటర్లు పెరగవచ్చన్న చర్చ జరుగుతోంది. అవసరమైన అర్హతలు ఉండాలి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించనున్నారు. ఇందుకోసం అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులో ఫారం–18 సమర్పించాలి. గతంలో ఇదే నియోజకవర్గంలో ఓటు వేసినవారు, ప్రస్తుతం ఓటు ఉన్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఓటు హక్కు పొందేందుకు డిగ్రీ ఉంటే సరిపోదు. ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణీత అర్హత తేదీ నాటికి పట్టభద్రుడై ఉండడంతోపాటు అవసరమైన అర్హతలతో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఓటుకు మళ్లీ ‘ఫారం–18’ సమర్పించాల్సిందే ఈనెల 28న నోటీస్.. నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 25న ముసాయిదా.. డిసెంబర్ 30న తుది జాబితా -
మహాగణపతికి లక్ష పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు శుక్రవారం మూల మహాగణపతికి లక్ష పుష్పార్చన, శ్రీమహాలక్ష్మి యాగం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, పూజలు చేశారు. భక్తురాలు మంజుల అందజేసిన వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు మహేంద్ర కపూర్, రాజ్కరాని ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం నృత్యగురువు దేవులపల్లి శ్రీవిద్య శిష్య బృందం కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. హన్మకొండ: ఉపాధి శిక్షణ ద్వారా మహిళలు సాధికారత సాధించవచ్చని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల వెంకట హైమా పూజిత అన్నారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన కుట్టు, మగ్గం వర్క్‌లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. నూతన బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హనుమకొండ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల వెంకట హైమ పూజిత హాజరై మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలు పేదరికాన్ని జయించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ ఓరుగంటి రమేశ్, వరంగల్ జిల్లా ఎయిడ్స్ ప్రాజెక్ట్ కంట్రోల్ కార్యాలయం జిల్లా మేనేజర్ స్వప్న మాధురి, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, సిస్టర్ అల్బాట, ఫైనాన్స్ మేనేజర్ ఎం.అజయ్ కుమార్, ఫీల్డ్ కో–ఆర్డినేటర్ ఈసంపల్లి సుదర్శన్, ట్రైనర్ స్వప్న, భాగ్యలక్ష్మి, లత పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: పెన్షనర్లు తమ వివరాలను ఆన్లైన్లో సమర్పించాలని డిప్యూటీ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్‌కుమార్ కోరారు. పెన్షనర్ల సంఘాలతో డీటీఓ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా 93 శాతం మంది ఉద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని, పెన్షనర్లు ఇప్పటివరకు 25 శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, మిగతా వారు చేసుకోవాలని కోరారు. వివరాలను https:// ifmis. telangana. gov. in/ pension /#/ ehct& form వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు తూపురాని సీతారాం, ఈ.నరసింహారెడ్డి, కుడూరు గోపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, ఏటీఓలు వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎం.డి.అన్వర్ హుస్సేన్, ఎస్టీఓలు దయాకర్‌రావు, చంద్రశేఖర్, ఆడిటర్లు ఖాజా, వేణు, సంతోశ్, శశికళ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కొంతకాలంగా పదోన్నతి కోసం నిరీక్షిస్తున్న సూపరింటెండెంట్లలో ఆరుగురికి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించనుంది. కొన్ని నెలల క్రితం 12 మంది సూపరింటెండెంట్లు దరఖాస్తులు చేసుకున్నారు. వారికి రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు సమాచారం. కేయూ పాలక మండలి ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. అయితే, 12 మంది సూపరింటిండెంట్ల విద్యార్హతలకు సంబంధించి విద్యార్హతల సర్టిఫికెట్ల జెన్యూనిటీ కోసం సంబంధిత వర్సిటీలకు కూడా పరిశీలన కు పంపినట్లు సమాచారం. నేడు (శనివారం) కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీకి రానున్నారు. ఆరుగురి సూపరింటిండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్వర్లులు ఇస్తూనే వారికి వివిధ చోట్ల పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
విద్యా రుణాలపై అవగాహన కల్పించాలి
న్యూశాయంపేట: విద్యా రుణాలపై అవగాహన పెంచి, విద్యార్థులకు రుణాలు అందించేలా సహకరించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా క్రెడిట్‌ప్లాన్ పురోగతిపై సమీక్షించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ గడ్డం జీవన్‌కుమార్ ప్రగతిని పీపీటీ ద్వారా వివరించారు. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విద్య తదితర ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని చైర్మన్ బండా ప్రకాశ్ సూచించారు. అనంతరం వార్షిక క్రెడిట్ పుస్తకాలను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ వసంత, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ క్రెడిట్ ప్లాన్ పురోగతిపై వరంగల్ కలెక్టరేట్లో సమీక్ష -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవ న నిర్మాణ సముదాయం, మౌలిక వసతులు, విద్యుత్, పారిశుద్ధ్యం, తదితర పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణా లు పాటించకపోతే చర్యలు తీసుకోవా లని సూ చించారు. ముఖ్యంగా పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసి, ఆస్పతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆ దేశించారు. సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్‌రెడ్డి, డి ప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్ రాజకుమార్, ఎ న్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం, ఆర్ అండ్ బీ ఈఈ రాజేందర్, ఆర్డీఓ సుమ, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు డైరెక్టర్ సర్వాణన్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని పాల్గొన్నారు.రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా కర్నపెల్లిలో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాలొనే జిల్లా జట్టు శుక్రవారం బయల్దేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబశివరావు హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు రాజేందర్, సాంబమూర్తి, సుమలత, కోచ్ వినయ్ కుమార్, పీడీలు రాజు, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ‘ఎఫ్ఎల్ఎన్’లో దరఖాస్తుల ఆహ్వానం కాళోజీ సెంటర్: ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) సెల్లో ఖాళీగా ఉన్న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఒకటి, ఎస్జీటీ మూడు పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ డీఈఓ బి.రంగయ్య నాయుడు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతి పోస్టుకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈఓ తదితరులతో కూడిన కమిటీ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారని వివరించారు. ఎల్ఎఫ్ఎల్ పోస్టుకు కనీసం రెండేళ్ల హెడ్మాస్టర్ అనుభవంతో పాటు మొత్తం 10 ఏళ్ల సర్వీసు ఉండాలని, క్లస్టర్, మండల, జిల్లా లేదా రాష్ట్రస్థాయిలో రిసోర్స్ పర్సన్/ట్రైనర్‌గా పనిచేసిన అనుభవం, నాయకత్వం, శిక్షణ నిర్వహణ సామర్థ్యాలు, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నారు. ఎస్జీటీ పోస్టులకు తెలుగు, ఇంగ్లిష్, గణిత విభాగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారని, కనీసం ఐదేళ్ల బోధనా అనుభవం, రిసోర్స్ పర్సన్/ట్రైనర్‌గా అనుభవం, ఎఫ్ఎల్ఎన్ బోధనా విధానంపై అవగాహన, ఎంఎస్ ఆఫీసర్ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, అభ్యర్థుల వయస్సు 56 సంవత్సరాలకు మించకూడదని తెలిపారు. ప్యానల్ ఇన్న్స్పెక్షన్ టీంలలో సభ్యులుగా ఉన్న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఎస్జీటీలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని స్పష్టం చేశారు.● వరంగల్ కలెక్టర్ సత్యశారద ● సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల పరిశీలన -
కేయూలో న్యూపీజీ హాస్టల్ వద్ద ఘర్షణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని న్యూపీజీ హాస్టల్ మెస్ వద్ద గురువారం రాత్రి తాగునీటిని వినియోగించుకునే సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివా దం పరస్పర వాగ్వాదాల నుంచి చేయిచేసుకునేవరకు వెళ్లింది. ఇందులో ఓ విద్యార్థి సమాచారంతో అక్కడకు వచ్చిన నాన్బోర్డర్తోపాటు పలువురు మరో విద్యార్థిని కొట్టారని సమాచారం. విషయం తెలుసుకున్న కాకతీయ యూనివర్సి టీ పోలీసులు చేరుకుని విద్యార్థులకు సర్దిచెప్పేయత్నం చేశా రు. విద్యార్థిపై చేయిచేసుకున్న నాన్బోర్డర్పై ఓ విద్యార్థి చేయి చేసుకున్నాడని తెలిసింది. అయితే నాన్బోర్డర్ వచ్చి క్యాంపస్ విద్యార్థిని కొట్టడంపై కొందరు విద్యార్థులు శుక్రవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నాన్‌బోర్డర్ల సమస్యను పరిష్కరించి హాస్టల్ మెస్‌కు రాకుండా చూడాలని రిజిస్ట్రార్‌ను కోరారు. దీంతో వివాదానికి గల కారణాలపై రిజిస్ట్రార్ ఆరా తీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఐ రవికుమార్, ఎస్సై విజయ్ నాన్బోర్డర్లపై నిర్ణయం తీసుకుంటే తాము సహకరిస్తామని రిజిస్ట్రార్‌కు చెప్పారు. ఈవిషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను సాక్షి వివరణ కోరగా ఇద్దరు విద్యార్థుల మధ్య మెస్ వద్ద వివాదం తలెత్తిందని తెలిపారు. నాన్‌బోర్డర్ల రాకతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందన్నారు. పోలీసులు విచారణ జరిపి ఎవరిది తప్పనేది తేల్చి చర్యలు తీసుకుంటారని తనవద్దకు వచ్చినవారికి చెప్పినట్లు వివరించారు. కేయూ పోలీస్టేషన్ ఎస్సై విజయ్ను వివరణ కోరగా న్యూ పీజీ హాస్టల్ మెస్ వద్ద విద్యార్థుల మధ్య జరిగిన గొడవ సద్దుమణిగేలా చేశామని తెలిపారు. అయితే విద్యార్థులెవరూ పోలీస్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మెస్వద్ద ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వైరం పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం పరస్పర ఆరోపణలతో రిజిస్ట్రార్ దృష్టికి.. -
కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట మీదుగా వరంగల్ నుంచి సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రయాణించే పలు రైళ్లు ఆపరేషన్ కారణాల వల్ల ఈ నెల 20వ తేదీన రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన రైళ్ల వివరాలు సికింద్రాబాద్–వరంగల్ (67761) పుష్పుల్, వరంగల్–సికింద్రాబాద్ (67762) పుష్పుల్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ (12757) ఎక్స్‌ప్రెస్, సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (12758) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. వరంగల్ మీదుగా 8 పండుగ ప్రత్యేక రైళ్లు వరంగల్ మీదుగా ఈ నెల 19 శనివారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు పండుగకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కోసం 8 సర్వీస్‌లుగా ప్రయాగ్‌రాజ్–తిరుణెలివెళ్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా.. ఈ నెల 19 శనివారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 4 సర్వీస్‌లుగా ప్రయాగ్‌రాజ్–తిరుణెలివెళ్లి (04171) మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లు వరంగల్‌కు చేరుకుని వెళ్తాయి. ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు 4 సర్వీస్‌లుగా తిరుణెలివెళ్లి–ప్రయాగ్‌రాజ్ (04172) మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లు వరంగల్‌కు చేరుకొని వెళ్తాయి. ఈ రైళ్లకు అప్ అండ్ డౌన్ రూట్లో మాణిక్పూర్, సంత, కట్నీ, జబల్పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పాడి, జోలర్పెట్టాయ్, సేలేమ్, నమక్కల్, కౌసర్, దిండిగల్, మధురై, విరుదునగర్, సతర్, కోవిల్పట్టిలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. వరంగల్ మీదుగా 8 పండుగ ప్రత్యేక రైళ్లు -
22న వరంగల్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 22న వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యు గంధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు 26, 27 తేదీల్లో జేఎన్ఎస్లో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో, సబ్ జూనియర్ విభాగం 8, 10, 12 సంవత్సరాల బాలబాలికలు మంచిర్యాలలో జరిగే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటా రని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే అథ్లెట్లు 22న ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో, ఎంట్రీ ఫీజు రూ.100తో జేఎన్‌ఎస్‌కు హాజరు కావాలని సూచించారు. విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు యుగంధర్ రెడ్డి (9866564422), కృష్ణమూర్తి (9000354465) నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల జిల్లా కమిటీ కాశిబుగ్గ: వరంగల్ జిల్లా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల జిల్లా కమిటీ నూత న కార్యవర్గాన్ని శుక్రవా రం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండపల్లి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా నల్లబెల్లి అనిల్, ఉపాధ్యక్షుడిగా మోటే మహేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దాంతోజు కుమారస్వామి, ట్రెజరర్‌గా గంట రజని, సభ్యులుగా నూనె ఆనంద్,పాలకుర్తి అనిల్ తేజ, సాంబారి రాజేష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వినీత, కోమల, బేబీ రాణి, కరుణాకర్, స్వాతి ఎన్నియ్యారు. నాణ్యమైన వైద్య సేవలందించాలి ● వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి కాశిబుగ్గ: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందిస్తూ, రికార్డులను ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి అన్నారు. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య మిషన్ సేవలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. -
ఉరేసుకుని యువకుడి..
● ఫ్లెక్సీ దుకాణం నిర్వహిస్తున్న గణేష్‌యాదవ్ హన్మకొండ చౌరస్తా/నయీంనగర్: హనుమకొండలోని రాంనగర్‌కు చెందిన పెద్దబోయిన గణేష్‌యాదవ్(35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. హనుమకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్‌యాదవ్ స్థానిక నయీంనగర్‌లో మౌనిక యాడ్స్ పేరుతో ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణం నడుపుతున్నాడు. షాప్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రమ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, గణేష్‌యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. -
ఎస్జీఎఫ్ ఎంపిక పోటీలు ప్రారంభం
● హాజరైన 800 మంది క్రీడాకారులు వరంగల్ స్పోర్ట్స్: 70వ పాఠశాల క్రీడల సమాఖ్య అండర్– 14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను హనుమకొండలోని జేఎన్ఎస్ శుక్రవారం నిర్వహించారు. అండర్–14, 17 విభా గాల్లో షూటింగ్, స్కేటింగ్, హ్యాండ్ బాల్, గట్క, టేబుల్ టెన్నిస్, హాకీ, బాక్సింగ్‌లో ఎంపికలు నిర్వహించారు. అండర్–19 కేటగిరీలో హ్యాండ్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నీస్, బేస్‌బాల్, గట్క, షూటింగ్లో ఎంపికలు నిర్వహించారు. ఇంటర్ ఆర్జేడీ గోపాల్, డీఐఈఓ శ్రీధర్ పోటీలను ప్రారంభించారు. 800 మంది క్రీడాకారు లు పాల్గొన్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీధర్, ఎస్జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు తెలియజేశారు. ప్రభాకర్‌రెడ్డి, పార్థసారథి, బరుపాటి గోపి, కోట సతీష్ పాల్గొన్నారు. -
హెచ్ఐవీపై అవగాహన పెంచాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: హెచ్ఐవీ, ఎయిడ్స్, లైంగిక వ్యాధులు, టీబీ, రక్తదానంపై యువతకు విస్తృత అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ నుంచి నిట్ హనుమకొండ వరకు నిర్వహించిన అవగాహన బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాను హెచ్ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ప్రతి గర్భిణి మొదటి, రెండో, మూడో త్రైమాసికాల్లో తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.రవి, జిల్లా అదనపు వైద్యాధికారి టి.మదన్మోహన్రావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాధవరెడ్డి, నెహ్రూనాయక్, హెచ్‌ఈఈఓ సందెల శ్రీనివాస్, డీపీఎంఓలు రవీందర్, దేవీసింగ్, సువార్త, సబ్ యూనిట్ అధికారి విప్లవ్‌కుమార్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లు, సిబ్బంది, డీపీఎం మాధురి, కమలాకర్, రామకృష్ణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కళాజాత బృందం పాల్గొన్నారు. -
మామునూరుకు మరో కీలక అడుగు
2028 నాటికి విమానాల టేకాఫ్ లక్ష్యంగా ప్రాజెక్టు ముందుకుసాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులవైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విడుదల చేసిన తాజా టెండర్ డాక్యుమెంట్, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు ఓరుగల్లు గగన విహారానికి సరికొత్త రూపురేఖలను అద్దనున్నాయి. ఇప్పటికే రూ.203.49 కోట్లతో రన్ వే ఆధునికీకరణ నుంచి టర్మినల్‌కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ అప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు టెండర్లు పిలిచిన ఏఏఐ...తాజాగా రూ. 213.59 కోట్ల అంచనా వ్యయంతో నూతన డొమెస్టిక్ టర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ కం టెక్నికల్ బ్లాక్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈ అండ్ ఎం వర్క్‌షాప్ వంటి కీలక మౌలిక వసతుల కల్పనకు టెండర్లు పిలిచింది. ఇందుకు సంబంధించి ఈనెల 28న వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. నవంబర్ 3 వరకు బిడ్ల సమర్పణకు గడువు ఉంది. ఈ పనులను 18 నెలల కాలవ్యవధిలో పూర్తి చేయాలని గడువు విధించారు. ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు ఇలా.. ● కాకతీయ శైలిలో ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 949.44 ఎకరాల ఎయిర్పోర్ట్ ప్రణాళిక విస్తీర్ణాన్ని సిద్ధం చేశారు. ఎయిర్‌బస్–320 వంటి పెద్ద ప్రయాణికుల విమానాలతో పాటు భారీ కార్గో విమానాలు కూడా దిగేలా 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్‌వేను ఆధునికీకరిస్తున్నారు. ● ఫేజ్–1 కింద సుమారు 6,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న టర్మినల్ భవనం ద్వారా ఏటా 3.5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించవచ్చు. లోపలి అలంకరణలో కాకతీయ తోరణం శైలిని, తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా శిల్పాలు, చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ● ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వరంగల్ నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ కారిడార్లకు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యాటక రంగంలో రామప్ప దేవాలయం, వరంగల్ కోటకు సందర్శకులను పెంచుతుంది. 2028 నాటికి విమానాల టేకాఫ్ లక్ష్యంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వరంగల్ రూపురేఖలను మార్చనుంది. ఇప్పటికే రూ.203.49 కోట్లతో నిర్మాణ పనులకు టెండర్ తాజాగా రూ. 213.59 కోట్ల అంచనా వ్యయంతో మరో టెండర్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే మారనున్న వరంగల్ రూపురేఖలు -
విద్యార్థుల్లో మేధాశక్తికి గణితం కీలకం
కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ విద్యార్థుల్లో మేధాశక్తికి గణితం కీలకంగా ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం గణితం విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి (ఎంటీటీఎస్) మ్యాథ్స్‌మెటిక్స్ ట్రైనింగ్ అండ్ టాలెంట్ సెర్చ్ ఓవర్చ్యూర్ –2026 ప్రోగ్రాంలో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గణతాన్ని కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా నిత్యజీవితంలో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉపయోగపడే నైపుణ్యాలుగా భావించాలన్నారు. హైదరాబాద్‌లోని ఐఐటీ ప్రొఫెసర్ సుకుమార్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణితాన్ని సులభతరంగా నేర్చుకోవచ్చని వివరించారు. కేయూ ఓఎస్డీ ఆచార్య వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాథమిక గణితంలోని భావనలు, సూత్రాలపై అవగాహన ఎంతో అవసరమని అన్నారు. పోటీ పరీక్షలకు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవహారాల్లో గణిత పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి, యూనివర్సిటీలోని గణితం విభాగం అధిపతి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ నాగయ్య, గణిత విభాగం అధ్యాపకురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, రవికుమార్, అంజన్‌రావు, డాక్టర్ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్ మాట్లాడారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
వెదురుతో పర్యావరణ పరిరక్షణ
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థ్ధికాభివృద్ధికి దోహదపడే విలువైన సహజ వనరుగా వెదురు నిలుస్తుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా వెదురుతో తయారు చేసిన వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిశ్ర్కుమార్, వైవీ గణేశ్, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, జెడ్పీ సీఈఓ వసంత, పశుసంవర్థక శాఖ అధికారి బాలాజీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి.. జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్ (నేషనల్ డిజిటల్ లైవ్‌స్టాక్ మిషన్) లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పథకాల అమలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ వసంత, డీపీఓ కల్పన, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి టి.బాలాజీ, వ్యవసాయశాఖాధికారి విజయభాస్కర్, విజయ డెయిరీ డీడీ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రసూతి ఆస్పత్రి పరిశీలన ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు కరీమాబాద్‌లోని సీకేఎం ప్రభుత్వ అనుబంధ ప్రసూతి ఆస్పత్రిని శుక్రవారం కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఆపరేషన్ థియేటర్లో పరికరాలు ఎలా ఉన్నాయి, ఆస్పత్రి భవనం పరిసరాలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, ఆస్పత్రి పనితీరును సమీక్షించారు. అలాగే, కరీమాబాద్‌లోని డ్రగ్స్ స్టోర్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.లక్ష్మీదేవి, ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ కె.సత్యజిత్‌రే, తహసీల్దార్ ఇక్బాల్ ఉన్నారు. -
శనివారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
నిట్ వరంగల్‌లో నేడు, రేపు పట్టాల ప్రదానంకాజీపేట అర్బన్: కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏళ్ల కల నెరవేరనుంది. విద్యార్థుల శ్రమ, అకుంఠిత దీక్షకు నేడు(శనివారం), రేపు (ఆదివారం) పట్టాభిషేకం జరగనుంది. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో 24వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యాంపస్‌లోని హోమీ బాబా సెమినార్‌హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో డిగ్రీ పట్టాల స్వీకరణ కీలక ఘట్టం అన్నారు. స్నాతకో త్సవం గురించి ఆయన తెలిసిన వివరాల ప్రకారం.. నిట్ 24వ కా న్వొకేషన్–26లో రెండు రోజుల పాటు 1,997 మంది యూజీ, పీజీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. తొలి రోజు శనివారం ఉదయం 10 గంటల నుంచి స్నాతకోత్సవం ప్రారంభం అవుతుంది. యూజీ విద్యార్థులు 930 మంది పట్టాలు స్వీకరిస్తారు. రెండో రోజు ఆదివారం పీజీ, పీహెచ్డీ విద్యార్థులు 1,067 మంది పట్టాలు అందుకుంటారు. ముఖ్య అతిథి టెక్సాస్ ఇండియా ఎండీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్‌కుమార్ హాజరై పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సంలో నిట్ చైర్పర్సన్ సేయాంట్ సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్, డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అధ్యత వహించనున్నారు. ప్రతీ విభాగంలో టాపర్లకు గోల్డ్‌మెడల్, ఓవరాల్ టాపర్‌కు ఇన్స్టిట్యూట్ గోల్డ్‌మెడల్‌తో పాటు ఇంజనీరింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలకు ‘ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆటోమెటిక్ కంట్రోల్ టెక్నాలజీస్ టు ఏవియేషన్ అండ్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్’ అంశంపై పరిశోధనలకు డాక్టర్ పద్మనాభన్ కె.మీనన్‌కు, ‘డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, అడ్వాన్సింగ్ ఇండియాస్ సెమీ కండక్టర్ అంబీషన్స్ త్రూ విజనరీ టెక్నాలజీ లీడర్ షిప్’ అంశంపై పరిశోధనలకు ఆనంద్ రామమూర్తికి గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాలు అందజేయనున్నారు. పట్టాల అందజేత ఇలా..డైరెక్టర్స్ గోల్డ్ మెడల్–అకడమిక్ విభాగం రోల్ ఆఫ్ హానర్ గోల్డ్‌మెడల్– సిద్ది బర్పూటే–బీటెక్ మెకానికల్ గోల్డ్ మెడల్ ప్రతి విభాగంలో.. బీటెక్..) ప్రియాంషుకుమార్సింగ్– సివిల్ నీలజాల జోషి – ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వలుస రఘువరణ్– మెకానికల్ దొండపాటి లోకేశ్వర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మదగాని సాత్విక్ – మెటలర్జీ సిద్ది బర్పూటే – కెమికల్ జయంతి అంషు – కంప్యూటర్ సైన్స్ అమన్ అబ్ధులాసమద్ ఇనామ్దార్ బయోటెక్నాలజీనిట్ వరంగల్ 24వ కాన్వొకేషన్ మహోత్సవంలో డిగ్రీ పట్టాలు స్వీకరించే విద్యార్థులు బాయ్స్ తెల్లటి కుర్తా పైజామా, గర్ల్స్ తెల్లటి కుర్తా పైజామా లేదా తెల్లటి చీర, విద్యార్థులు వారికి కేటాయించిన కండువాను మెడలో ధరించాలి. తెల్లటి వస్త్రాలతో పాటు చెప్పల్ లేదా షూస్ వేసుకుని హాజరు కావాలని నిట్ వరంగల్ నిబంధన పెట్టింది. అందుకోనున్న 1,997 మంది విద్యార్థులు విద్యార్థి జీవితంలో పట్టాల స్వీకరణ కీలక ఘట్టం : నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ నిట్ 24వ స్నాతకోత్సవానికి సిద్ధం ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇండియా ఎండీ సంతోశ్‌కుమార్ డిగ్రీ విద్యార్థులుయూజీ (బీటెక్) 930 పీజీ 945 పీహెచ్డీ 100 ఎగ్జిట్ డిగ్రీ 22 (మూడేళ్ల కోర్సు) -
రూ.1.38 కోట్ల పాతనోట్లు స్వాధీనం
● 8మంది నిందితుల అరెస్ట్ కాజీపేట: కేంద్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల క్రితం రద్దు చేసిన రూ.1.38 కోట్ల విలువ చేసే పాత కరెన్సీ నోట్లను రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాజీపేట చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలోని వ్య క్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో సోదాలు చేశారు. దీంతో 2016లో ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముల్లా అబ్బాస్ (47), మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన బాసవేని మల్లేష్, కరీంనగర్జిల్లా జమ్మికుంటకు చెందిన తంగళ్ల కృష్ణమోహన్, సిద్దిపేటకు చెందిన కుక్కల సంపత్, హనుమకొండకు చెందిన రైనాకుల శ్రీధర్, పల్లపు రాజు, వరంగల్ కరీమాబాద్‌కు చెందిన మహంకాళి శ్యాంసుందర్, నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకాల గణేష్‌లను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నోట్ల సరఫరాకు సహకరించినట్లు చెప్పారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉండగా, పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ తెలిపా రు. సమావేశంలో సీఐ శ్యాంసుదర్, ఎస్సైలు మౌని క, శివ, తాళ్లపల్లి యాదగిరి, శ్రీనివాస్, సిబ్బంది సునిత, అశోక్‌కుమార్, శ్రీధర్, క్రాంతికుమార్, కుమారస్వామి, విష్ణు, వినయ్ పాల్గొన్నారు. -
కక్కుర్తి పడితే ఖతమే..!
సాక్షి, వరంగల్: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు మ్యూల్ ఖాతాల కేంద్రంగా జరుగుతుండడంతో ఈ ఖాతాదారులపై కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో 185 సైబర్ నేరాలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్న ఖాతాలు వరంగల్‌లో ఉన్నట్టుగా ధ్రువీకరించిన కేసులో ఇప్పటికే వరంగల్ సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్, మీల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేసిన 22 మంది సభ్యుల్లో ఏజెంట్లతోపాటు మ్యూల్ ఖాతాదారులుండడం కలవరానికి గురిచేస్తోంది. ముద్ర లోన్, ఇతర రుణాల కోసమంటూ డబ్బు అవసరమున్న విద్యార్థులు, రైతులు, కార్మికులను గుర్తించి బ్యాంక్ ఖాతా తెరిచి సంబంధిత పత్రాలు, ఏటీఎం కార్డు ఇస్తే కమిషన్ ఇస్తామంటూ నమ్మబలికి ఆ ఖాతాలను సైబర్ నేరాల కోసం వినియోగిస్తుండడం సంచలనం రేపుతోంది. దీంతో కమిషన్ కోసం కక్కుర్తి పడితే కటకటాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కమీషన్ కోసం ఇతరులకు మీ అకౌంట్ ఇచ్చి అది నేరానికి ఉపయోగించినట్లు తేలితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. ‘మ్యూల్ ఖాతా’ అంటే.. మోసపూరితంగా వచ్చిన డబ్బును సైబర్ నేరగాళ్లు నేరుగా తమ ఖాతాల్లోకి తీసుకోకుండా, ఇతరుల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తారు. ఇలాంటి ఖాతాలను ‘మ్యూల్ అకౌంట్’గా పిలుస్తారు. నేరాల ద్వారా వచ్చిన డబ్బు ఈ ఖాతాల్లోకి చేరిన తర్వాత పలు ఖాతాలకు బదిలీ చేయడం, నగదుగా మార్చడం లేదా ఇతర మార్గాల్లో తరలిస్తారు. ప్రస్తుతం నమోదైన కేసులో కూడా ఇలాంటి ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అందించే ప్రత్యేక నెట్వర్క్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధ్యవర్తి, ఏజెంట్లుగా వ్యవహరించేవారికి ఖాతాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వస్తే అసలు ఖాతాదారుడికి రూ.6,000 నుంచి రూ.8,000 మధ్య ఇస్తున్నట్లు సమాచారం. సైబర్ ముఠాల మూడంచెల వ్యూహం.. ● ఎర: కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి ముద్ర రుణం’ కింద రూ.50,000 ఇప్పిస్తామంటూ నకిలీ పత్రాలతో నమ్మిస్తారు. ● కమీషన్: బ్యాంక్‌లో మీతోనే అకౌంట్ ఓపెన్ చేయించి.. పాస్‌బుక్, ఏటీఎం, సిమ్ కార్డు తీసుకుని రూ.6,000 నుంచి రూ.8,000 చేతిలో పెడతారు. ● నేరం: ఆ అకౌంట్లను (మ్యూల్ ఖాతాలు) దేశవ్యాప్తంగా జరిగే కోట్ల రూపాయల ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, నల్లధనాన్ని మళ్లించడానికి వాడుకుంటారు. ఆశపడి బ్యాంక్ ఖాతాలిస్తే నేరమే.. కేసులు, ఆపై జైలుకు తప్పదంటున్న పోలీసులు తాజాగా వరంగల్ పోలీసులు ఛేదించిన కేసు చెబుతున్నదిదే..మ్యూల్ ఖాతాదారులైతే మూల్యం చెల్లించాల్సిందే..ఏం చేయాలి? 1. రుణాల కోసం నేరుగా గుర్తింపు పొందిన మధ్యవర్తులను నమ్మొద్దు. 2.మీ ఆధార్, పాన్ కార్డులను దేనికై నా ఇస్తే,వాటిపై ఏ అవసరం కోసం ఇస్తున్నారో పెన్నుతో రాయాలి. 3.మీ ప్రమేయం లేకుండా అకౌంట్ ఓపెన్ కార్డును ఇతరులకు వాడుకోమని హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి చెక్ చేయాలి. 4.సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. ఏం చేయకూడదు? 1.రూ.50 వేల లోన్ ఆశ చూపే లోకల్ బ్రోకర్లు, అధికారిక బ్యాంకులనే ఆశ్రయించాలి. 2. కమీషన్ వస్తుందని ఆశపడి బ్యాంక్ పాస్‌బుక్, ఏటీఎం కార్డు, పిన్ ఇతరులకు ఇవ్వొద్దు. 3.మీ పేరు మీద తీసుకున్న సిమ్ అయిందని అనుమానం వస్తే వెంటనే ఇవ్వొద్దు. 4.నా అకౌంట్‌తో నేనేం మోసం చేయలేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. -
దయాహృదయులు స్పందించారు..
వర్ధన్నపేట: మెడిసిన్‌లో సీటు వచ్చినా.. ఫీజు చెల్లంచే స్థోమత లేక ఆందోళనలో ఉన్న వర్ధన్నపేటకు చెందిన పేద విద్యార్థి అఖిలకు ‘ఆపన్న హస్తం అందించరూ..’ అనే శీర్షికన శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. విద్యార్థిని చదువుకు తమవంతు సాయం అందించడంలో భాగంగా.. నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖలో ప్రముఖ కాంట్రాక్టర్ గుజ్జ సుమన్‌రావు రూ. లక్ష, పట్టణంలోని వీరభధ్ర ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం రూ.25 వేలు, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రూ.35 వేలు, టీపీసీసీ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావు, ఆరోగ్య శాఖ అధికారి నెహ్రునాయక్, రాజమణి దంపతులు రూ.10 వేల చొప్పున అందించారు. వీరితోపాటు మరికొంతమంది తమకు తోచిన సాయం అందించారు. దీంతో తన చదువుకు సాయం అందించేందుకు ముందుకొచ్చిన దాతలకు, తన విషయంపై కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు అఖిల కృతజ్ఞతలు తెలియజేసింది. ఆపన్న హస్తం అందించిన దాతలు సాక్షి, దాతలకు కృతజ్ఞతలు తెలిపిన మెడికల్ విద్యార్థిని -
ఆత్మగౌరవానికి సాక్ష్యం ‘ప్రజాపాలన’
హన్మకొండ: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, పోరాట పటిమకు ప్రజాపాలన దినోత్సవం సజీవ సాక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధా న కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తేదీ స్వాతంత్య్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. నిజాం పాలన, ఫ్యూడల్ వ్యవస్థ, రజాకార్ల అరాచకాల మధ్య తెలంగాణ ప్రజలు తలవంచకుండా తమ హక్కుల కోసం పోరాడారని తెలిపారు. 1930, 1940 దశకాల్లో కమ్యూనిస్టులు, ప్రజాసంఘాల నాయకత్వంలో సాగిన ఉద్యమాలు తెలంగాణ విముక్తి పోరాటానికి పునాది వేశాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా కొనసాగిందన్నారు. ప్రజల సుదీర్ఘ పోరాటంతో అప్పటి కేంద్ర హోం మంత్రి వల్లబాయి పటేల్ నాయకత్వంలో జరిగిన సైనిక ఆపరేషన్‌తో నిజాం పాలన ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో భాగమైందన్నారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీఈలు కె.తిరుమల్ రావు, అశోక్, అన్నపూర్ణ, వెంకటరమణ, గౌతమ్ రెడ్డి, మల్లికార్జున్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీలు రమేశ్, శ్రీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కేయూలో ప్రజాపాలన దినోత్సవం.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనం ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్డీ బి. వెంకట్రాంరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్, ఎం. సుదర్శన్, చిర్ర రాజు, ప్రిన్సిపాళ్లు టి. మనోహర్, నర్సింహాచారి, ఎస్. నర్సింహాచారి, అవెన్యూ ప్లాంటేషన్ ఇన్చార్జ్ బి. వెంకటగోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
కేదారి కుటుంబానికి మంత్రి పరామర్శ
హన్మకొండ: ఇటీవల అగ్నిప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి దంపతుల కుటుంబాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే నాయిని కోరిక మేరకు మంత్రి పొంగులేటి.. లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించారు. ఉద్యమ కాలంలో కేదారి అందించిన సేవలను ఎమ్మెల్యే నాయిని.. మంత్రికి వివరించి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరారు. స్పందించిన మంత్రి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. 20న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ హసన్‌పర్తి: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్ట్‌కు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్ సహకారంతో పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వ రంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు httpscœ/form,gle/eD2e5jNfebo5prg8 వెబ్సైట్లోవివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆదివారం (ఈనె20న) ఉద యం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్న ట్లు చెప్పారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాల, హనుమకొండలోని ఎస్వీఎస్ కళాశాల, జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాల, పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘భద్రకాళి’ ఆదాయం రూ.72 లక్షలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 76 రోజులకు రూ.72,30,387 ఆదాయం లభించిందని వరంగల్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. 628 యూఎస్ఏ డాలర్లు, 5 కెనడా డాలర్లు, 110 యూఏఈ దిరమ్స్, 10 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పౌండ్స్, 60 బ్యాంక్ ఆఫ్ అరేబియా మానిటరీ అథారిటీ, 10 యూరోలు లభించాయని తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో వరంగల్ జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ పరిశీలకురాలు ఎన్.కవిత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ఆలయ సిబ్బంది, శ్రీలక్ష్మీ శ్రీనివాస సేవాట్రస్ట్ జి.కృష్ణారెడ్డి, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవాసమితి జి.నవీన్, 200 మంది సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.


