బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి
ఖిలా వరంగల్: మిల్లింగ్ చేసిన బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 30 డిఫాల్ట్ మిల్లర్లకు సంబంధించి వివరాలను సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు. వరంగల్ ఆర్టీఓ సుమ, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్, సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
న్యూశాయంపేట: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జనరల్ అబ్జర్వర్ శివకుమార్‌నాయుడు సమక్షంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పోలింగ్ సిబ్బంది రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ సుమ, డీపీఓ కల్పన పాల్గొన్నారు.
మీడియా సెంటర్ ప్రారంభం
ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
కలెక్టరేట్‌లో సామాజిక న్యాయ దినోత్సవం
కలెక్టరేట్ సమావేశహాల్‌లో సామాజిక న్యాయదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.


