ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడాపోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడాపోటీలు

Feb 11 2026 8:57 AM | Updated on Feb 11 2026 8:57 AM

ముగిస

ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడాపోటీలు

ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడాపోటీలు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి : డీఎంహెచ్‌ఓ ‘స్కిల్‌డిజైర్‌’తో కేయూ ఎంఓయూ

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో హనుమకొండ జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌ హాజరై రెజ్లింగ్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలని సూచించారు. సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలకు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్‌ అశోక్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేసి మాట్లాడారు. రెండు రోజులపాటు 45 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపా రు. జిల్లా పరిధిలోని 16 మండలాల నుంచి మూడు వేల మంది క్రీడాకారులు హాజరైనట్లు వివరించారు. పోటీల నిర్వహణకు సహకరించిన ఆయా క్రీడా సంఘాల బాధ్యులు, పీఈటీలు, కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

ఎంజీఎం: ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం తీరును పరిశీలించి మాట్లాడారు. 8 అంశాల్లో మహిళలకు పరీక్షల తీరుపై అవగాహన కలిగించాలని, రెఫర్‌ కేసులను ఫాలోఅప్‌ చేస్తూ వారికి తగిన సేవలందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించి, సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గర్భిణుల నమోదు, వైద్యపరీక్షలు, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి ప్రోత్సహించడం, ప్రసవానంతరం సేవలందించాలని ఆయన సూ చించారు. వైద్య సేవలకు సంబంధించిన రికా ర్డులు, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని ఆయన సమీక్షించారు. అలాగే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన మరమ్మతు పనులను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. వైద్యాధికారి మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: హైదరాబాద్‌లోని స్కిల్‌డిజైర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో మంగళవారం కేయూ ఎంఓయూ కుదుర్చుకుంది. కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి సమక్షంలో అవగాహన పత్రాలను రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, స్కిల్‌డిజైర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్‌ మార్చుకున్నారు. ఈ ఒప్పందం ఒక సంవత్సర కాలం ఉంటుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరగుపర్చడం, నైపుణ్యాలను అందించడం, ఉపన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాపులు, పరస్పర జ్ఞానమార్పిడిని ప్రోత్సహించడం ఎంఓయూ ఉద్దేశం అని రిజిస్ట్రార్‌ తెలిపారు. కార్యక్రమంలో సైన్స్‌డీన్‌ జి.హనుమంతు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆచార్య టి.మనోహర్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ అఫైర్స్‌ డీన్‌ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్‌ ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కోలా శంకర్‌ పాల్గొన్నారు.

ముగిసిన జిల్లాస్థాయి  సీఎం కప్‌ క్రీడాపోటీలు1
1/2

ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడాపోటీలు

ముగిసిన జిల్లాస్థాయి  సీఎం కప్‌ క్రీడాపోటీలు2
2/2

ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడాపోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement