ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
పరకాల: పరకాల మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహశబరీష్ తెలిపారు. పరకాలలోని గణపతి డిగ్రీ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరి శీలించారు. పోలింగ్, కౌంటింగ్‌కు ఎంతమంది పోలీ సులను నియమించారని అదనపు కలెక్టర్ ఎన్.రవి, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్యను అడిగి తెలుసుకున్నారు.
పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద
న్యూశాయంపేట: నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు.


