సైద్ధాంతిక విలువలకు ప్రతీక ‘చరఖా’
సాక్షిప్రతినిధి, వరంగల్: మహాత్మా గాంధీ సైద్ధాంతిక విలువలను తెలిపేదే చరఖా అని ఏఐసీసీ నేత, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఈ చరఖా ద్వారా గాంధీ ఆలోచనలను వ్యక్తపర్చవచ్చని, దూది నుంచి నూలు దారాన్ని ఎలా తీస్తామో సమాజంలో ఉన్న సమస్యలను వీడడానికి మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండలోని డీసీసీ భవన్‌లో శుక్రవారం సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. హనుమకొండలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని గాంధీ వర్ధంతి రోజున నిర్వహించడం సంతోషాన్నిచ్చింందన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలపై నాయకులతో భేటీ..
సర్వోదయ చరక సంఘటన్‌ను హనుమకొండలో ప్రారంభించిన మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై మార్గదర్శనం చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా.. అన్నింట్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా చూడాలని ఆమె సూచించారు.
గాంధీ చూపిన మార్గమే
నేటికీ దిశానిర్దేశం
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్


