జీవన శైలిలో మార్పుతోనే క్యాన్సర్
ఎంజీఎం: జీవనశైలిలో మార్పుతోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వడ్డేపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. జిల్లాలో 692 క్యాన్సర్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతుందని పేర్కొన్నారు. సదస్సులో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కవిత, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.రవి, కిరణ్‌సింగ్, డాక్టర్ శ్రీనివాస్‌రావు, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, వైద్యాధికారి మాలిక, డీఈఎంఓఅశోక్‌రెడ్డి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 23 కేంద్రాల్లో (నాన్ ప్రొఫెషన్‌నల్) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. క్యాంపస్‌లోని పలు కేంద్రాలను పరీక్షల విభాగం అధికారులు సందర్శించారు. పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ కె.మమత పరిశీలించారు.
పలు పరీక్షలు వాయిదా..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 7, 10వ తేదీల్లో నిర్వహించనున్న బీటెక్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదావేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. ఈపరీక్షలను ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని, 10న నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు, 11న నిర్వహించా ల్సిన ఎంబీఏ పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. ఈమార్పును కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
విద్యారణ్యపురి: పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలని హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ కోరారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోచంపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్నందున బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని హెచ్‌ఎం సరోజన, ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల ఆవరణ పచ్చగా ఉండడంతో హెచ్‌ఎం ఉప్పలయ్యను అభినందించారు.
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను మంగళవారం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నల్ల రాతిలో శిల్పులు చెక్కిన శిల్పకళాసంపదను తిలకించారు. అనంతరం ఖుష్‌మహల్, శృంగారపు బావి, ఏకశిలగుట్ట, రాతిమట్టికోట అందాలను వీక్షించారు. కోట గైడ్ రవియాదవ్ కాకతీయుల శిల్పకళాసంపద, విశిష్టతను ఆయనకు వివరించారు. కోట అందాలను అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది, టీజీటీఎస్‌టీడీసీ అజయ్ తదితరులు ఉన్నారు.
జీవన శైలిలో మార్పుతోనే క్యాన్సర్
జీవన శైలిలో మార్పుతోనే క్యాన్సర్
జీవన శైలిలో మార్పుతోనే క్యాన్సర్


