సమ్మక్క–సారలమ్మ జాతరతోనే ఆదివాసీల గుర్తింపు
హన్మకొండ కల్చరల్: మేడారం హుండీల్లో భక్తుల వింత కోరికల చీటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ జనజాతర, కుంభమేళాతోనే ఆదివాసీలకు ప్రభుత్వం, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్వయం కృషితో గుర్తింపు లభించిందని ఓ ఆదివాసీ భక్తుడు హుండీలో చీటీ రాసి వేశాడు. ‘సురేఖమ్మ నీ మంచి మనసుతో మాకు న్యాయం చేయండి, మేడారం సమ్మక్క సారలమ్మ కోసం మీ కృషి అంతాఇంతా కాదు. మేడారం జాతర ఉన్నంతకాలం మీరు గుర్తుండిపోతారు. కొన్ని గుళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. అమ్మా వాటిని పట్టించుకోండి. ఖర్చు మీది... కష్టం మాది తక్కువ వేతనమైన ఫర్వాలేదు, మాకు న్యాయం చేయండి. అమ్మ మా కష్టాలనుంచి ఆదుకోండి’ అంటూ లేఖలో వివరించాడు.
అమ్మా నా కొడుక్కి ఆఫర్ లెటర్ ఇప్పించు..
‘సమ్మక్క సారలమ్మ తల్లి మాపై దయ చూసి మీ ఆశీర్వాద దీవెనలతో నా కొడుక్కు ఉద్యోగ ఆఫర్ లెటర్ ఇప్పించు తల్లి. వచ్చే జాతరకు నీకు నా కొడుకెత్తు బంగారం(బెల్లం) మొక్కులు చెల్లించుకుంటా’ అని ఓ భక్తురాలు చీటీ రాసి హుండీలో వేసింది.
సురేఖమ్మ మీ త్యాగం వృథా పోదు..
మేడారం హుండీల్లో
ఓ ఆదివాసీ భక్తుడి లేఖ


