వేసవి ప్రణాళిక సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వేసవి ప్రణాళిక సిద్ధం

Feb 8 2026 7:14 AM | Updated on Feb 8 2026 7:14 AM

వేసవి

వేసవి ప్రణాళిక సిద్ధం

వేసవి ప్రణాళిక సిద్ధం కోటను సందర్శించిన విదేశీ ప్రతినిధులు

హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ అర్బన్‌: వేసవిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మిషన్‌ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతేడాదిలో తాగునీటి సమస్యలు ఎదురైన గ్రామాలు, తీసుకున్న పునరుద్ధరణ చర్యలు, జిల్లాకు అవసరమైన నీటి సామర్థ్యం, నీటి వనరుల స్థితిగతులపై అధికారులను కలెక్టర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర నివేదికను మిషన్‌ భగీరథ ఈఈలు, జిల్లా పంచాయతీ అధికారి త్వరితగతిన అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు ప్రతీ ఇంటికి తాగునీరు అందుతుందా లేదా? అని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, ఈఈ రామాంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్‌, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్‌ భగీరథ డీఈలు, ఏఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌: ఖిలా వరంగల్‌ కోటను హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో ‘ఫారం డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ అంశంపై శిక్షణ పొందుతున్న 15 దేశాల ప్రతినిధులు సందర్శించారు. శిల్పకళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఖుష్‌మహల్‌, శృంగారపు బావి, ఏకశిలగుట్ట, రాతి మట్టికోట అందాలను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను అసిస్టెంట్‌ టూరిజం ప్రమోషన్‌ ఆఫీసర్‌ సూర్యకిరణ్‌ వారికి వివరించారు. కేంద్ర పురావస్తు శా ఖ సిబ్బంది, టీజీటీడీసీ అజయ్‌ ఉన్నారు. గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ కుటుంబసమేతంగా కోటను సందర్శించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్‌ రవియాదవ్‌ వివరించారు.

వేసవి ప్రణాళిక సిద్ధం1
1/1

వేసవి ప్రణాళిక సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement