బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని శనివారం వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సీనియర్ అసిస్టెంట్ మధుకర్ హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి నివాసంలో మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్‌బాబు, మున్నూరు కాపు సంఘం నాయకులు గండ్రతి రాజు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 1వ తేదీన గుజరాత్ పీజియన్ క్లబ్ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని భరూచ్‌లో నిర్వహించిన ఆలిండియా పీజి యన్ షోలో కాజీపేటలోని బాపూజీనగర్‌కు చెందిన సయ్యద్ షకీర్‌కు చెందిన పావురాలు గ్రాండ్ చాంపియన్లుగా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 14 రకాల ఫ్యాన్సీ పీజి యన్ జాతులు ప్రదర్శనలో పాల్గొనగా షకీర్ పది పీజియన్లను పోటీల్లో నిలిపారు. పోటీల్లో పాల్గొన్న పది పీజియన్ జాతుల్లో హంగేరియన్ జెయింట్ హౌస్, లాహోర్ పీజియన్లు ఫిమేల్, మేల్ కేటగిరీలో గ్రాండ్ చాంపియన్ కైవసం చేసుకోవడంతో పాటు మరో ఐదు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి బహమతులు అందుకున్నాయి.
హన్మకొండ చౌరస్తా: ‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడం మనందరి బాధ్యత, అంతర్గత విభేదాలు వీడి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి’ అని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య.. సిబ్బందికి సూచించారు. హనుమకొండ 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్, రికార్డులు పరిశీలించిన అనంతరం ఔట్ రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా 44 మంది పిల్లలకు, గర్భిణులకు 62 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గుర్తించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఇటీవల సిబ్బంది మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి ఘటనలు పునరావృతం అయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 9, 10 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్ శుక్రవారం తెలిపారు. జేఎన్ స్టేడియంలోని డీఎస్‌ఏ కార్యాలయంలో క్రీడా సంఘాల బాధ్యులు, పీఈటీలతో శనివారం సీఎం కప్ క్రీడా పోటీల సన్నాహక సమావేశం నిర్వహించారు. క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, శ్రీనివాసరెడ్డి, రమేశ్‌రెడ్డి, సాంబయ్య, రాజేందర్, రామ్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, పీఈ టీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీఈటీలు, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం


