శుభకార్యానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
● చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడి మృతి
నర్సంపేట రూరల్ : శుభకార్యానికి వెళ్లొస్తూ ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. బైక్.. చెట్టును ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన శనివారం చెన్నారావుపేట మండలం ఖాధర్‌పేట శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన బొమ్మగాని అనిల్‌గౌడ్ (39) భార్యాపిల్లలతో కలిసి తొర్రూరులో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శుభకార్యం నిమిత్తం శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. కార్యక్రమం పూర్తయిన అనంతరం తిరిగి అదే రోజు రాత్రి బైక్‌పై తొర్రూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖాధర్‌పేట శివారులోని మలుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో పక్కనే ఉన్న వరి పొలంలో పడ్డాడు. శనివారం ఉదయం పొలానికి నీరు పారించేందుకు వచ్చిన రైతు చూడగా అనిల్ మృతిచెంది కనిపించాడు. దీంతో రైతు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై రాజేశ్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య రజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.
శుభకార్యానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..


