తెప్పోత్సవానికి హంసవాహసం రెడీ | - | Sakshi
Sakshi News home page

తెప్పోత్సవానికి హంసవాహసం రెడీ

Feb 15 2026 12:47 PM | Updated on Feb 15 2026 12:47 PM

తెప్ప

తెప్పోత్సవానికి హంసవాహసం రెడీ

కాళేశ్వరం : మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో ఆదివారం రాత్రి 7గంటలకు తెప్పోత్సవం నిర్వహించడానికి దేవాదాయశాఖ హంసవాహనాన్ని సిద్ధం చేసింది. రాత్రి గంటపాటు పూజా కార్యక్రమాలతో ఉత్సవమూర్తులను జలవిహారం చేయించనున్నారు. కల్యాణం, తెప్పోత్సవానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రి న్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. దీంతో అధికారులు ఏర్పా ట్లు ముమ్మరం చేస్తున్నారు. శనివారం సాయంత్రం కాటారం సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌ పనులు పరిశీలించారు. వీఐపీఘాట్‌, సాధారణ ఘాట్‌ వద్ద ఏర్పాట్లు చూశారు. సబ్‌కలెక్టర్‌ వెంట ఈఓ మహేశ్‌, సర్పంచ్‌ మోహ న్‌రెడ్డి, ఎంపీడీఓ రవీంద్రనాథ్‌, ఎంపీఓ భవాని, కార్యదర్శి సత్యనారాయణలు ఉన్నారు. కల్యాణ మండపం, వేదికలను డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, నాగార్జునరావు, ఎస్సై తమాషారెడ్డి పరిశీలించారు.

ఆర్ట్‌ ఉపాధ్యాయుడి అద్భుత కళాఖండం

చాక్‌పీస్‌పై శివలింగం

మల్హర్‌(కాటారం): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాల ఆర్ట్‌ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్‌ అద్భుత కళాఖండంతో భక్తి చాటుకున్నాడు. చాక్‌పీస్‌ పై 1.3 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న శివలింగాన్ని రూపొందించాడు. గత శివరాత్రి సందర్భంగా చాక్‌పీస్‌లతో 1.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న 109 శివలింగాలను, ప్రపంచంలోని అతి చిన్న జాతీయ జెండాను రూపొందించి క్రెడెన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించినట్లు రజనీకాంత్‌ తెలిపారు.

తెప్పోత్సవానికి హంసవాహసం రెడీ
1
1/2

తెప్పోత్సవానికి హంసవాహసం రెడీ

తెప్పోత్సవానికి హంసవాహసం రెడీ
2
2/2

తెప్పోత్సవానికి హంసవాహసం రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement